కొమరంభీం జిల్లా
కొమరంభీం జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని, 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా 2016 అక్టోబరు 11న అవతరించింది. [1] నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవి.
పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు
మార్చుఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్), 15 మండలాలు, నిర్జన గ్రామాలు 17తో కలిపి 419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2] పునర్య్వస్థీకరణలో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి.
స్థానిక స్వపరిపాలన
మార్చుజిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]
గణాంక వివరాలు
మార్చుకొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.
జిల్లా లోని మండలాలు
మార్చుపూర్వపు ఆదిలాబాదు జిల్లాకు చెందిన 12 పాత మండలాలు కాగా, 3 కొత్తగా ఏర్పడిన మండలాలు.[2]
- సిర్పూర్ (యు) మండలం*
- లింగాపూర్ మండలం*
- జైనూర్ మండలం
- తిర్యాని మండలం
- ఆసిఫాబాద్ మండలం
- కెరమెరి మండలం
- వాంకిడి మండలం
- రెబ్బెన మండలం
- బెజ్జూర్ మండలం
- పెంచికలపేట్ మండలం*
- కాగజ్‌నగర్ మండలం
- కౌటల మండలం
- చింతల మానేపల్లి మండలం*
- దహేగాం మండలం
- సిర్పూర్ పట్టణ మండలం
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (3)
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-05-29.
- ↑ 2.0 2.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే". Archived from the original on 2018-03-31. Retrieved 2020-01-13.