కొమ్మను శాఖ అని కూడా అంటారు. ఇంగ్లీషులో Branch అంటారు. కొమ్మ అంటే వృక్షాలలో ప్రదానమైన కాండం లేదా మాను చీలిన తరువాత ఉండే పై భాగము. చిన్న గుల్మాలు, పొదలలో కొమ్మలు ఎక్కువగా బలహీనంగా ఉంటాయి. అదే వృక్షాలలో మూలకాండం నుండి 2-3 కొమ్మలు మాత్రమే ఉండి అవి ఉపశాఖలుగా విభజించబడి వృక్షం పెరిగే కొద్దీ అవి బలంగా తయారౌతాయి. దీనినే శాఖోపశాఖలుగా విస్తరించడంగా పేర్కొంటారు. చెట్టు చివరగా ఉండే చిన్న కొమ్మలను రెమ్మలు అంటారు. ఆంగ్లంలో పెద్ద కొమ్మలను బగ్స్ (boughs) అని, చిన్న కొమ్మలను ట్విగ్స్ (twigs) అని అంటారు. కొమ్మలు దాదాపు అడ్డంగా, నిలువుగా, వికర్ణ దిశలో ఉంటాయి, ఎక్కువ చెట్ల యొక్క కొమ్మలు వికర్ణ దిశలోనే వృద్ధి చెందుతాయి. ట్విగ్స్ అనే చిన్న కొమ్మలు అంతిమ కొమ్మలను సూచించగా, బగ్స్ అనే పెద్ద కొమ్మలు మాను నుంచి నేరుగా వచ్చిన శాఖలను సూచిస్తాయి.

చెట్టు కొమ్మపై కూర్చున్న ఒక బాలుడు
చెట్టు యొక్క కొమ్మలు, ఆకులు.
Looking up into the branch structure of a Pinus sylvestris tree

పాటలు సవరించు

  • కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి.
  • కొమ్మ మీద కోయిలమ్మ కుహూ అన్నది కుహూ కుహూ అన్నది.

ఇవి కూడా చూడండి సవరించు

మాను

బయటి లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కొమ్మ&oldid=2879749" నుండి వెలికితీశారు