కొమ్మిడి నరసింహారెడ్డి
కొమ్మిడి నరసింహారెడ్డి మాజీ శాసన సభ్యులు.నల్గొండ జిల్లా భువనగిరి నియోజకవర్గానికి 1978-85 కాలంలో రెండుసార్లు శాసనసభ్యులుగా పనిచేశారు. ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి, ఉన్న ఆస్తిలో అధికభాగం భూదానోద్యమంలో దానం చేశాడు.ఒక పాత స్కూటర్ తప్ప కనీసం స్వంత ఇల్లు కూడా ఉంచుకోలేదు.గోదావరి జలాలను మూసీ నదిలోకి మళ్ళించి లక్ష ఎకరాలను ఎట్లా పచ్చగా మార్చొచ్చో వివరిస్తూ ఒక బ్లూప్రింట్ తయారుచేశారు. వేల కోట్లు అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పధకం బ్లూ ప్రింటును ఒక పెద్ద ఫ్లెక్సీ పై ప్రింట్ చేయించి, దాన్ని గచ్చుమీద పరచి, ఒక ఉపాధ్యాయుడిలా అందరికీ వివరించేవాడు. భుజానికొక సంచీలో సద్దికట్టుకుని, ఒక జత బట్టలు తీసుకుని సమావేశాలకు హాజరౌతాడు. అక్కడ వక్తలు మాట్లాడిన మాటలను శ్రద్ధగా నోట్స్ రాసుకుంటాడు. బీబీనగర్ NIMS ప్రారంబించాలని ఆమరణ దీక్ష చేశాడు.[1]
భావాలు,అనుభవాలు
మార్చు- నిబద్ధతతో, నిజాయితీగా పనిచేసే అధికారులు రాజకీఅ నాయకులకు నచ్చటంలేదు.నేటితరం అవినీతి లేని సమాజం కోసం నిరంతరం ఆరాటపడుతూ పోరాటం చేయాలి. నిజాయితీగా పనిచేస్తున్న అధికారులపై ప్రతీకార చర్యలు ఏమాత్రం సమంజసం కాదు.ఇది ప్రజాసామ్య విలువలకు వ్యతిరేకమే కాక పెత్తందారీ చర్య. ఇట్టి చర్యలను ప్రజలు, యువత తీవ్రంగా ఖండించాలి. నిజాయితీగా పనిచేసే అధికారులకు మనోస్థైర్యం పెంపొందించవలసిన బాధ్యత ప్రజలపైనే ఉంది.[2]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2013-12-04.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2013-12-04.