కొమ్మూరి పద్మావతీదేవి


కొమ్మూరి పద్మావతీదేవి ( జూలై 7, 1908 - మే 9, 1970) తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి.

కొమ్మూరి పద్మావతీదేవి
కొమ్మూరి పద్మావతీదేవి
జననంకొమ్మూరి పద్మావతీదేవి
జూలై 7, 1908
మరణంమే 9, 1970
ప్రసిద్ధితెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి..
మతంహిందూ మతము
భార్య / భర్తకొమ్మూరి వెంకటరామయ్య
పిల్లలుఉషారాణి భాటియా (రచయిత్రి)

పద్మావతీదేవి చెన్నై లో 1908 జూలై 7 న సంఘసంస్కర్తల కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు సంఘసంస్కరణోద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ సంస్కరణ వివాహాం చేసుకున్నారు. వారి వివాహన్ని స్వయంగా కందుకూరి వీరేశలింగం పంతులు నిర్వహించారు. తల్లితండ్రులు పద్మావతిదేవికి చదువుతో పాటూ సంగీతం కూడా నేర్పించారు. పద్మావతిదేవికి 14 యేళ్ల వయసులో గుడిపాటి వెంకట చలం తమ్ముడు కొమ్మూరి వెంకటరామయ్యతో వివాహం జరిగింది. ఈమె కూమార్తె ఉషారాణి భాటియా కూడా రచయిత్రి.

తెలుగు నాటకరంగంలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టిన బళ్ళారి రాఘవ రంగస్థలం పైకి సంసార స్త్రీలను ఆహ్వానించినప్పుడు ఈమె సంప్రదాయపు సంకెళ్ళను త్రెంచుకుని నాటకరంగం మీద కాలుపెట్టారు. ఈమె ప్రహ్లాద నాటకంలో లీలావతి పాత్ర పోషించేవారు. ఆమె రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు, చంద్రగుప్త, ఆ లోకం నుండి ఆహ్వానం మొదలైన నాటకాలలో రాఘవతో కలిసి సముచిత పాత్రలలో నటించారు. మహాత్మా గాంధీ డాక్యుమెంటరీ చిత్రంలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సినిమాల ప్రవేశంతో ద్రౌపదీ మానసంరక్షణం, రైతు బిడ్డ, సుమతి, పెద్ద మనుషులు చిత్రాలలో నటించారు. వీరు స్త్రీల సమస్యల మీద ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు.

ఈమె చెన్నై లో 1970 మే 9 తేదీన పరమపదించారు.

మూలాలు

మార్చు