ఉషారాణి భాటియా
ఒక తెలుగు రచయిత్రి
ఉషారాణి భాటియా, ఒక తెలుగు రచయిత్రి. ఈమె పలు పేరు పొందిన రచనలు చేశారు.[1]
ఉషారాణి భాటియా | |
---|---|
జననం | ఉషారాణి భాటియా చెన్నై |
మరణం | డిసెంబరు 28, 2020 ఢిల్లీ |
ప్రసిద్ధి | తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత |
మతం | హిందూ |
నేపధ్యం
మార్చుఈమె తల్లి దండ్రులు కూడా కళలకు సంబంధించినవారె. ఈమె పెదనాన్న గుడిపాటి వెంకట చలం ఒక పేరుగల తెలుగు రచయిత. తల్లి నటి, రచయిత్రి కొమ్మూరి పద్మావతీదేవి. ఈ దంపతులకు ఉషారాణి భాటియా చిన్న కుమార్తె. ఈమె బంధుత్వ రీత్యా కొడవటిగంటి కుటుంబరావుకు మరదలు అవుతారు.[1]
బాల్యం-విద్యాభ్యాసం
మార్చుఈవిడ బాల్యం అంతా చెన్నైలో గడిచింది. అక్కడే న్యాయ విద్యను అభ్యసించింది. ఆంధ్రపత్రిక లో కొంతకాలం పని చేసి, దుర్గాబాయి దేశ్‌ముఖ్ సలహా మేరకు ఢిల్లీలోని సెంట్రల్ సోషల్ వెల్‌ఫేర్ బోర్డు వారి ఆంగ్లపత్రిక సంపాదకవర్గంలో చేరింది. ఆ తరువాత నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా తెలుగుశాఖకు, తొలి ఎడిటర్‌గా 1990 వరకు పదవీబాధ్యతలు నిర్వహించింది.[1]
రచనా వ్యాసాంగం
మార్చునవలలు
మార్చు- చిన్నారి
- తండ్రి కూతురు
- ప్రతీకారం
- అరుణోదయం
కథలు
మార్చు- క్షణం శాంతి లేదు
- దేవుడి ఇల్లు
- నిర్ణయం
- ఆ లోకం నుంచీ ఆహ్వానం
- ఆరోజు సాయంత్రం
- తెల్లవారింది
- ఓ ముగ్గురి కథ
- ఎవరైనా చెప్పండి
మరణం
మార్చుఉషారాణి 2020, డిసెంబరు 28న ఢిల్లీలోని స్వగృహంలో మరణించింది.[2]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (2 January 2021). "ఉషారాణి [[భాటియా]]: సాహిత్యమే వృత్తీ,ప్రవృత్తీ". www.andhrajyothy.com. విహారి. Archived from the original on 2 January 2021. Retrieved 2 January 2021.
{{cite news}}
: URL–wikilink conflict (help) - ↑ ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (29 December 2020). "నేషనల్ బుక్‌ట్రస్ట్..తొలి తెలుగు ఎడిటర్..ఉషారాణి కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 2 January 2021. Retrieved 2 January 2021.