కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సుకు సమీపంలో ఉన్న సహజ సిద్ధమైన అభయారణ్యం.

కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సుకు సమీపంలో ఉన్న సహజ సిద్ధమైన అభయారణ్యం. 673 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం 1972 వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం 1999, నవంబరు నెలలో స్థాపించబడింది. 2002లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కోసం రామ్‌సర్ కన్వెన్షన్‌ను ఏర్పాటు చేయబడింది.[1][2]

కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం
IUCN category IV (habitat/species management area)
కొల్లేరు సరస్సు వద్ద పక్షులు
Map showing the location of కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం
Map showing the location of కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం
కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం
ప్రదేశంఆంధ్రప్రదేశ్, భారతదేశం
సమీప నగరంఏలూరు
భౌగోళికాంశాలు16°37′N 81°12′E / 16.617°N 81.200°E / 16.617; 81.200[1]
విస్తీర్ణం673 km2 (166,000 acres)
స్థాపితం1999 నవంబరు (1999-11)
పాలకమండలిఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ
చెల్లని డెజిగ్నేషను
గుర్తించిన తేదీ19 ఆగస్టు 2002[1]

భౌగోళికం సవరించు

కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకృష్ణానది, గోదావరి డెల్టాల మధ్యన ఏలూరు నగరం నుండి 10 నుండి 25 కి.మీ.ల వరకు విస్తరించి ఉంది.[3]

వృక్షజాలం సవరించు

ఈ ప్రాంతంలో ఫ్రాగ్మిట్స్ కర్కా ప్రధాన వృక్షజాలంగా ఉంది.[4] ఇది 10 అడుగుల ఎత్తు వరకు పెరిగి, కొన్ని జాతుల పక్షులకు ఆశ్రయం కల్పిస్తుంది.[5] దీనితోపాటు నిమ్ఫే నౌచాలి, నైఫోయిడ్స్ ఇండికం, ఒట్టెలియా అలిస్మోయిడ్స్, నెచమండ్రా ఆల్టర్నిఫోలియా, లిమ్నోఫిలా ఇండికా, వల్లిస్నేరియా స్పైరాలిస్, బ్లైక్సా ఆక్టాండ్రా, ఇపోమోయా ఆక్వాటికా, స్కిర్పస్ ఆర్టికులిటమ్స్, పాస్గామాటాస్ వంటి జల వృక్షాలు కూడా ఉన్నాయి.

మూలాలు సవరించు

  1. 1.0 1.1 1.2 "Kolleru Lake". Ramsar Wetlands. Ramsar. Retrieved 12 July 2021.
  2. "Kolleru Bird Sanctuary". www.sanctuariesindia.com. Archived from the original on 12 మే 2016. Retrieved 12 July 2021.
  3. Ramsar convention, Wet land. "Kolleru Lake". www.rainwaterharvesting.org. Retrieved 12 July 2021.
  4. Wetlands of the World I: Inventory, Ecology and Management edited by Dennis F. Whigham, D. Dykyjová, S. Hejný (page-382)
  5. Kolleru Lake, Flora. "C.P.R. Environmental Education Centre". www.cpreec.org. Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 12 July 2021.

బయటి లింకులు సవరించు