కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 - 2024 ఫిబ్రవరి 26 | |||
నియోజకవర్గం | నెల్లూరు రూరల్ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1966 నెల్లూరు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | బాబీ రెడ్డి,[1] సారలమ్మ | ||
జీవిత భాగస్వామి | సుజిత | ||
బంధువులు | బాలానందరెడ్డి, నవీన్ (అల్లుళ్ళు) | ||
సంతానం | లక్ష్మి హైందవి,[2] సాయి వైష్ణవి [3] | ||
నివాసం | నెల్లూరు |
జననం, విద్యాభాస్యం
మార్చుకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు లో బాబీ రెడ్డి, సారలమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన నెల్లూరు వి.ఆర్. కాలేజీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి బి.కామ్ పూర్తి చేశాడు.[4]
రాజకీయ జీవితం
మార్చుకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పై 25653 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2019లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ షేక్ పై 20776 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
శ్రీధర్ రెడ్డి వైసీపీని విడి టీడిపికి మద్దతుగా ఉండడంతో వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్‌తో ఆ పార్టీని వీడిన ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు.[5][6][7]
మూలాలు
మార్చు- ↑ Sakshi (11 October 2014). "ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి పితృ వియోగం". Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.
- ↑ Sakshi (28 February 2015). "కోటంరెడ్డి వారి పెళ్లిసందడి". Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.
- ↑ Sakshi (2 July 2018). "వైభవంగా కోటంరెడ్డి కుమార్తె వివాహం". Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.
- ↑ Sakshi (18 March 2019). "నెల్లూరు బరిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
- ↑ NT News (27 February 2024). "ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
- ↑ Eenadu (27 February 2024). "8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
- ↑ Eenadu (5 June 2024). "పసుపు జెండా.. విజయ ఢంకా". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.