తమ్మినేని సీతారాం

తమ్మినేని సీతారాం (జననం 1955 జూన్ 10) ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి శాసనసభ సభ్యునిగా గెలుపొంది స్పీకరుగా ఎన్నికయ్యాడు.[2] మొదటగా తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశాడు. తర్వాత ప్రజా రాజ్యం పార్టీలో కొంతకాలం పనిచేశాడు.[3]

తమ్మినేని సీతారాం
తమ్మినేని సీతారాం

తమ్మినేని సీతారాం


15వ సభాధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ శాసనసభ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 మే
గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ముందు కోడెల శివప్రసాదరావు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 మే నుండి 2024 జూన్ 04
ముందు కూన రవికుమార్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
పదవీ కాలం
1983 – 1989
ముందు పైడి శ్రీరామమూర్తి
తరువాత పైడి శ్రీరామమూర్తి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
పదవీ కాలం
1994 – 2004
ముందు పైడి శ్రీరామమూర్తి
తరువాత బొడ్డేపల్లి సత్యవతి

వ్యక్తిగత వివరాలు

జననం (1955-06-10) 1955 జూన్ 10 (వయసు 69)
తొగరాం , శ్రీకాకుళం జిల్లా
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు శ్రీరామమూర్తి
ఇందుమతి
బంధువులు కూన రవికుమార్
నివాసం ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా[1]
మతం హిందూ

జీవిత విశేషాలు

మార్చు

తమ్మినేసి సీతారాం శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అతను ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో తమ్మినేని శ్రీరామమూర్తి, ఇందుమతి దంపతులకు జన్మించాడు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం చేసాడు. 1980లో తన 18వ యేటనే ఆముదాలవలస షుగర్ ఫ్యాక్టరీ డైరక్టరుగా నియమితుడయ్యాడు.1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించాక ఆ పార్టీలో చేరి ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనాడు. తొమ్మిదేళ్ళపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసాడు. 18 శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రభుత్వ విప్ గా ఐదేళ్ళు, శాప్ డైరక్టరుగా మూడేళ్ళు ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా మూడుసార్లు పనిచేసాడు.[4]

ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావముతో తమ్మినేని సీతారాం ఆ పార్టీలో చేరి ఎన్నికల్లో ఓడిపోయాడు. తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన 'ఆపరేషన్ స్వగృహ' పిలుపు మేరకు గత ఎన్నికల్లో తెదేపాకు వదలి ప్రజారాజ్యం పార్టీలో చేరిన పలువురు నేతలు ఒక్కొక్కరుగా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. తమ్మినేని సీతారాం కూడా ప్రజారాజ్యం పార్టీని వదలి 2009 ఆగస్టు 15న తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలం అంటూ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని తమ్మినేని సీతారాం తప్పపట్టాడు. విభజన విషయంలో బాబు కీలకపాత్ర పోషించడంపై సీతారాం నిప్పులు చెరిగాడు. బాబు వైఖరికి నిరసనగా అతను ఆ పార్టీకి రాజీనామా చేశాడు. విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావాన్ని ప్రకటించాడు. అతను 2013 ఆగస్టు 29న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి చేరాడు[5]. 2014 ఎన్నికల్లో ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుండి వై.ఎస్.అర్ పార్టీ తరుపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన రవికుమార్‌పై పోటీ చేశారు కానీ ఓడిపోయాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.అర్ పార్టీ తరుపున పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన రవికుమార్‌పై విజయం సాధించాడు.

15వ శాసనసభ స్పీకరుగా ఎన్నిక

మార్చు

తమ్మినేని సీతారాం 2019 జూన్ 13న (గురువారం) ఆంధ్రప్రదేశ్ 15వ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.[6] అతని అభ్యర్థిత్వానికి 32 మంది ఎమ్మెల్యేలు మద్దతివ్వగా, సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పల నాయుడు ప్రకటించారు. తమ్మినేని సీతారాం స్పీకరు పదవిలో 2019 జూన్ 13 నుండి 2024 జూన్ 5 వరకు అధికార బాధ్యతలు నిర్వర్తించారు.[7][8][9]

శ్రీకాకుళం జిల్లా నుంచి సీతారాం నాలుగో స్పీకరు కాగా. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి స్పీకర్‌గా ఆర్‌ఎల్‌ఎన్ దొర, రెండో స్పీకర్‌గా తంగి సత్యనారాయణ, మూడో స్పీకర్‌గా కె. ప్రతిభాభారతి ఎన్నికయ్యారు.

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (13 June 2019). "స్పీకర్ల జిల్లా శ్రీకాకుళం: ఆంధ్ర రాష్ట్రం నుంచి నవ్యాంధ్ర వరకు ఎవరెవరంటే..." Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  2. Samdani MN (7 June 2019). "Tammineni Sitaram to be Andhra Pradesh assembly speaker".
  3. Sakshi (18 March 2019). "శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు". Sakshi (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  4. వై.సి.పి లో చేరిన తమ్మినేసి సీతారాం
  5. "Ex-minister Tammineni Sitaram joins YSR Congress". దక్కన్ క్రానికల్. Retrieved 29 August 2013.[permanent dead link]
  6. "Ex-minister Tammineni unanimously elected Andhra assembly speaker | Vijayawada News - Times of India". web.archive.org. 2024-06-27. Archived from the original on 2024-06-27. Retrieved 2024-06-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. https://legislation.aplegislature.org/PreviewPage.do?filePath=basePath&fileName=/Portlets/LatestNews/1560439439002_Speaker.pdf[permanent dead link]
  8. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2024-06-27. Retrieved 2024-06-27.
  9. "Andhra Governor Abdul Nazeer dissolves 15th State Legislative Assembly". ANI News (in ఇంగ్లీష్). Retrieved 2024-06-27.