కాకినాడలో ప్రసిద్ధిచెందిన మిఠాయిలు కొట్టయ్య కాజాలు. వీటినే కాకినాడ కాజా, గొట్టం కాజా అనే పేర్లతో కూడా పిలుస్తారు.

కోటయ్య కాజా
కోటయ్య కాజా (కాకినాడ కాజా, గొట్టం కాజా)
మూలము
మూలస్థానంభారత దేశం
ప్రదేశం లేదా రాష్ట్రంకాకినాడ
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు గోధుమపిండి, చక్కెర


చరిత్ర

మార్చు

గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ని చిన్నపరిమి కోటయ్య స్వగ్రామం. ఇంట్లో పోట్లాడి తిరుపతి వెళ్ళిన కోటయ్యకు ఒక బామ్మ లడ్డూ ఇచ్చి తన వెంట మద్రాస్ తీసుకు వెళ్ళిందట. ఆమెది మిఠాయిల వ్యాపారం. అక్కడే రకరకాల మిఠాయిల తయారీ విధానాలు తెలుసుకొని ఇంటికి వచ్చి సరికొత్త మిఠాయి తయరీకి పూనుకున్నాడట. అనేక ప్రయత్నాల అనంతరం చేసిన మిఠాయికి ఉన్న పల్లెలో ఆదరించలేదని బంధువులున్న కాకినాడకు ప్రయాణం అయ్యి అక్కడే అమ్మకం మొదలుపెట్టాడట. దానికి ఆదరణ లభించడంతో కాకినాడ కాజాగా పేరు పొందినది.

కాజాలు, రకాలు

మార్చు

కాజాలలో మడతకాజా, గొట్టం కాజా, చిట్టికాజా అనే రకాలు ఉన్నాయి.

కాజాలు తయారుచేసే విధానం

మార్చు

మైదా - ఒక కిలో, శనగపిండి - ఏబై గ్రాములు, డాల్డా - వంద గ్రాములు, పంచదార - ఒక కిలో, మంచి నూనె - అర కిలో, తినేసోడా, - అర స్పూన్, ఏలకుల పొడి - ఒక పావు స్పూను

ఒక గిన్నెలో పంచదార వేసి అందులో తగినంత పరిమాణంలో నీళ్ళు వేసి కొద్ది సేపు మరగనిస్తే పాకంలా తయారవుతుంది. అందులో ఏలకులపొడి వేసి స్టవ్ సింలో పెట్టాలి. పాకం చిక్కబడకుండా లేత పాకంగా ఉండాలి.

మైదా, శనగపిండి జల్లించి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో డాల్డా, తినేసోడా వేసి బాగా కలిపి కొద్దిపాటి నీళ్ళు చల్లుతూ చపాతి పిండిలా కలిపి ఓ రెండు గంటల సేపు నానపెట్టాలి. బాగా నానివున్న ఆ పిండిని ఒక సన్న గొట్టం మాదిరిగా చేస్తూ, ముక్కలుగా కోయాలి. ఇంకో స్టవ్ వెలిగించి దానిమీద మూకుడు పెట్టి అందులో నూనె వేసి బాగా కాగాక పైన కోసి పెట్టుకున్న ముక్కలు ఎర్రగా వేయించి వాటిని తీసి పాకంలోనే వేయాలి. ఐదు నిమిషాల తరువాత కాజాలను పాకం లోంచి తీసి ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. నోరూరించే గొట్టం కాజాలు తయార్.

ఇది గుండ్రంగా ట్యూబ్ ఆకారంలో ఉండటం వలన దీనిని గొట్టం కాజా అన్నారు. మైదా పిండితో చేసే ఇవి లోపలి భాగం స్పాంజిలా గదులుగా ఉండి ఆ స్పాంజిలాంటి ప్రాంతంలో చక్కెర పాకం నిలువ ఉంటుంది. కాజాల లోపలి భాగంలో గుల్లదనం రావడం కోసం కొంతమంది పిండిలో బేకింగ్ పౌడర్ ఒక చిటికెడు కలుపుతారు.

రికార్డులు, అవార్డులు

మార్చు

ఇతర విశేషాలు

మార్చు
  • కోటయ్య కాజా పేరున భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.[1][2]
  • కోటయ్య కాజా దుకాణంతో ప్రసిద్ధి చెందిన ఈ వీధిని కోటయ్య స్ట్రీట్ అనే పిలుస్తారు.
  • ఇక్కడ కోటయ్య కుమార్ల ద్వారా అతి పెద్ద దుకాణ సముదాయం కలదు
  • గొట్టం కాజా గురించి ప్రముఖ దర్శకుడు వంశీ తన రచనల్లో తరచుగా రాస్తుంటారు.
  • ఈ కాజా కాక మామూలు కాజాలలో శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ తాపేశ్వరం కాజా ప్రపంచ ప్రసిద్దం

చిత్రాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "కాకినాడ 'కోటయ్య కాజా'కు అరుదైన గౌరవం..." న్యూస్18. 2020-01-02. Retrieved 2022-05-20.
  2. "Special postal covers released on Kotaiah Kaja, Uppada silks". The Hindu. 2020-01-03. Retrieved 2022-05-20.

బయటిలింకులు

మార్చు