కోట హరినారాయణ

భారత వైమానిక శాస్త్రవేత్త, తేజస్ యుద్ధ విమాన రూపకర్త

కోట హరినారాయణ (జననం:1943) ఏరోనాటికల్ ఇంజనీరు. తేజస్ యుద్ధ విమానం తయారీ ప్రాజెక్టుకు డైరెక్టరు, ఛీఫ్ డిజైనరు.[1] యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదుకు ఉప కులపతిగా పనిచేసాడు. [2] ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.[3]

కోట హరినారాయణ
జననం1943
బరంపురం, ఒరిస్సా
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థలు
 • బెనారస్ హిందూ యూనివర్సిటీ
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
 • ఐఐటి, బాంబే
గుర్తింపు తెచ్చినవితేజస్ యుద్ధ విమానం
పురస్కారాలు
 • పద్మశ్రీ
 • డా. యలవర్తి నయుడమ్మ పురస్కారం
 • డిఆర్‌డివో జీవన సాఫల్య పురస్కారం
 • ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ వారి జీవన సాఫల్య పురస్కారం
 • బెర్హంపూర్ యూనివర్సిటీ డాక్టరేటు
 • లోకమాన్య తిలక్ పురస్కారం

జీవిత విశేషాలుసవరించు

హరినారాయణ 1943 లో సారథి చౌదరి, ముత్యం దంపతులకు ఒడిషా లోని బరంపురంలో జన్మించాడు. ఐదుగురు పిల్లల్లో హరినారాయణ మధ్యవాడు.[4] బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగు చదివాడు.[5] ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఏరో ఇంజనీరింగులో ఎమ్‌ టెక్, బోంబే ఐఐటీలో పిహెచ్‌డి చేసాడు.

అతను చదువుకునే సమయంలో భారతదేశం ఎదుర్కొన్న రెండు యుద్ధాలు - 1962 చైనా యుద్ధం, 1965 పాకిస్తాన్ యుద్ధం - అతనికి ఏరోనాటికల్ ఇంజనీరింగుపై ఆసక్తి కలిగించాయి.

1967లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఫ్లైట్ టెస్ట్ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరాడు.[4] 1970లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలో చేరాడు.1982లో మళ్ళీ హెచ్ఏఎల్ లో చీఫ్ డిజైనరుగా నాసిక్ లో పనిచేశాడు. మిగ్ -21 విమాన ఆయుర్దాయాన్ని పెంచే ప్రాజెక్టులో పనిచేసాడు.  

1985 డిసెంబరులో హరినారాయణ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజన్సీ డైరెక్టరుగా ఎంపికయ్యాడు. 2002 జూన్ వరకు అక్కడే పనిచేసి రిటైరయ్యాడు. ఈ కాలం లోనే తేజస్ యుద్ధ విమాన రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించాడు.

పదవీ విరమణ చేసాక, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదుకు 2002 నుండి 2005 వరకు ఉపకులపతిగా పనిచేసాడు. 2016 లో తన పాత సహోద్యోగులతో కలిసి డ్రోన్‌ల తయారీ కోసం జనరల్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను బెంగళూరులో స్థాపించాడు.

మారుమూల గ్రామాల్లో విద్యాభివృద్ధి కోసం వికసిత్ భారత్ ఫౌండేషన్ను స్థాపించాడు.[4]

పురస్కారాలుసవరించు

 
2008 లో ప్రధాని మన్మోహన్ సింగ్ నుండి డిఆర్‌డీవో జీవన సాఫల్య పురస్కారం స్వీకరిస్తున్న కోట హరినారాయణ


 • విశిష్ట శాస్త్రవేత్త పురస్కారం, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ [6]
 • నేషనల్ ఏరోనాటిక్స్ ప్రైజ్ - 1996
 • ఎఫ్‌ఐఇ ఫౌండేషన్ పురస్కారం - 1996
 • డా. యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం - 2001
 • ఎస్‌బిఐ వారి ప్రజ్ఞా పురస్కార్ - 2001
 • భారత ప్రభుత్వ పద్మశ్రీ - 2002[7]
 • గుజార్ మల్ మోడీ సైన్స్ ఫౌండేషన్ పురస్కారం - 2006
 • ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ వారి జీవన సాఫల్య పురస్కారం - 2006[8]
 • ఓం ప్రకాశ్ భసీన్ పురస్కారం - 2007
 • బెర్హంపూర్ యూనివర్సిటీ డాక్టరేటు - 2008
 • డిఆర్డివో జీవన సాఫల్య పురస్కారం - 2008
 • లోకమాన్య తిలక్ పురస్కారం - 2011
 • ఒక ఎయిర్ షోలో తేజస్ విమాన ప్రదర్శన చూసిన ఒక ఆయుధ వ్యాపార దళారీ ఆయనతో ఇలా అన్నాడు: "కొంప ముంచావు కదయ్యా! తేజస్‌తో మా రెండొందల విమానాల వ్యాపారం ఫోగొట్టావు"[4]

మూలాలుసవరించు

 1. "Zephyr 2009 - Celebrating the Spirit of Aviation - Aerospace Engineering, IIT Bombay". aero.iitb.ac.in. మూలం నుండి 3 September 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 30 May 2011.
 2. "German grant for Hyderabad varsity". The Hindu Business Line. 4 November 2004. Retrieved 27 January 2010.
 3. "Kalam for updating aeronautical policy". The Hindu. 22 January 2003. మూలం నుండి 20 జూలై 2009 న ఆర్కైవు చేసారు. Retrieved 27 January 2010. Check date values in: |archive-date= (help)
 4. 4.0 4.1 4.2 4.3 "తేజస్‌తో తలెత్తుకున్నాం". ఈనాడు. మూలం నుండి 23 Feb 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 23 Feb 2020.
 5. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2012-09-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-02-18. Cite web requires |website= (help)
 6. "`LCA is about creating wealth for country' -- Dr Kota Harinarayana, Programme Director (LCA), Aeronautical Development Agency". The Hindu Business Line. 13 January 2001. Retrieved 27 January 2010.
 7. "Padma Vibhushan for Rangarajan, Soli Sorabjee". The Hindu. 26 January 2002. మూలం నుండి 21 ఆగస్టు 2010 న ఆర్కైవు చేసారు. Retrieved 27 January 2010.
 8. "ప్రొఫైల్ - డా. హరినారాయణ" (PDF). నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్.