కోకిల

ఆప్ అభ్యర్థుల
(కోయిల నుండి దారిమార్పు చెందింది)

కోకిల లేదా కోయిల (ఆంగ్లం Koel) ఒక పక్షి. వసంత కాలంలో కూవ్వూ కువ్వూ, "కుహూ కుహూ" అంటూ రాగాలాలపిస్తుంది. ఆడ కొయిల కీక్, కీక్ అని అరుస్తుంది. నిజమైన కోయిలలు కుకులిఫార్మిస్ క్రమంలో, కుకులిడే కుటుంబంలోని యూడైనమిస్ ప్రజాతికి చెందినవి. ఇవి ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాలలో నివసిస్తాయి.ఆసియా కోకిల లేక కోయిల వలసపక్షే. వేసవి ప్రారంభం కాగానే సింగపూరు ప్రాంతాలనుంచి మనదేశానికి, నేపాల్ పర్వంతం వచ్చి, పునరుత్పత్తి జరిపి మళ్ళీ వెనక్కి ఎగిరి పోతాయి. కోయిల వేసవి దాటిపోయిన తర్వాత మౌనంగా ఉంటుందట, ఇక్కడే ఆకులందున అణిగి మణిగి ఉంటుందని, పాడడం మానేసి మౌనవ్రతం దాలుస్తుందని ఇటీవల కొందరు అర్నథాలజిస్టులు అభిప్రాయం వ్యక్తంచేశారు.అది బయొలాజికల్ కాబోలు. ఆసియా కోకిల లేక కోయిల వలసపక్షేనని, వేసవి ప్రారంభం కాగానే సింగపూరు ప్రాంతాలనుంచి మనదేశానికి, నేపాల్ వరకూ వచ్చి, గుడ్లుపెట్టి, కాకులో మరో దాదులపైనో పెంపకం బాధ్యత నెట్టి, మళ్ళీ వెనక్కి ఎగిరి పోతాయని మరికొన్ని గ్రంథాల్లో రాశారు. సింగపూరు, శ్రీలంక అయినా సమీపంలోనే కదా!

కోకిల
Scientific classification
జాతులు

యూడైనమిస్ మెలనోరింకస్
యూడైనమిస్ స్కోలపేసియస్
యూడైనమిస్ సయనోసెఫలస్
యూడైనమిస్ టైటెన్సిస్

మగకోయిల నల్లగా, కాస్త నీలం రంగుతో, ఎర్రని కళ్ళతో చెట్ల కొమ్మలమధ్య నక్కి కపించకుండా కూర్చుని ఉంటుంది. ఆడపక్షి గచ్చకాయరంగు, రెక్కల మీద ఊదారంగు చుక్కలు, మగపక్షి కన్నా కాస్త పెద్దగా ఉంటుంది. ఇవి కాస్తంత సిగ్గరులు.

చెట్ల మీది పళ్ళు, చిన్న చిన్న కీటకాలు వీటి ఆహారం. ఇవి ఆమ్నిఓరస్. సర్వభక్షకులు.మనుషులకు అపకారం చేసే విషఫలాలను కూడా తింటాయి. షుమారు పదిపన్నెండేళ్ళు జీవిస్తాయి. మగపక్షి కువూ, కుహూ అని మధురంగా రోజంతా పాడుతూనే ఉంటుంది. ఆడపక్షి కీక్, కీక్ అని అరుస్తుంది.

ఇవి గూళ్ళు కట్టుకోలేవు, కాకి, ఇతర పక్షుల గూళ్ళలో గుడ్లుపెడతాయి. ఒకే గూటిలో అన్ని గుడ్లూ పెట్టవట! వేరువేరు గూళ్ళలో గుడ్లు పెడుతాయి. జతపక్షి గూళ్ళు వెతకడంలో సహాయకారిగా ఉంటుంది. కాకి లేదా మరోపక్షి గూటిలో ఆగుడ్ల సరసనే తన గుడ్లు కూడా పెడుతుందేతప్ప అసలు పక్షి గుడ్లను తోసివేయదు. కాకులు తమగుడ్లతో పాటు కోయిల గుడ్లనుకూడా పొదిగి పిల్లనుచేసి సాకుతాయి. వసంతకాల సంప్రాప్తే కాకః కాకః పికఃపికః అని నానుడి. కంఠం గుర్తించి కాకులు కోకిల పిల్లలను తరిమేస్తాయి.

పూర్వం మనదేశంలో కోయిలలను పంజరంలో పెట్టి పెంచేవారట. వేసవి ముగియగానే ఇవి మరలా శ్రీలంక, సింగపూరు ఎగిరిపోతాయి. భారతీయ కవిత్వంలో పుంస్కోకిల ప్రస్తావన తరచుగా వస్తుంది. మన కవి రామిరెడ్డి గారి బిరుదు కవికోకిల. ఫొటోలు ఎనిమాలియా సౌజన్యంతో.

వేకువన 4గంటలనుంచి మగకోయిల కూయడం మొదలు పెడుతుంది, నిర్విరామంగా. మగ పక్షుల కూతకు సమాధానంగా ఆడపక్షి కూడా కీక్, కీక్అని కూస్తూ సమాధానం చెప్పినట్లు అరుస్తుంది. 


రోజూ దూరంగా మరోచెట్టు మీదినుంచి మా కోయిల పిలుపుకు బదులు చెబుతున్నట్లు మరొక కోయిల కూస్తుంది!

మగ కొయిల నల్లగా, కాస్త నీలంరంగు, యెర్రటి కళ్ళతొ కనిపిస్తుంది. మగపక్షుల కన్నా ఆడవి కాస్త పెద్దవిగ, గచ్చకాయ రంగులొ రెక్కలమీద బూడిదరంగు, పయిన చుక్కలతొ ఉంటుంది.  ఇవి సిగ్గరులు, ఆకులమధ్య, కొమ్మల నడుమ అణగి, మణగి అంతగా కనిపించవు. ఇవి పండ్లను, కీటకాలను తింటాయి. మానవులకు విషతుల్యమయిన పంద్లను కూడా ఇవి తింటాయి.  కాకి మొదలైన ఇతర పక్షుల గూళ్ళలో గుడ్లు పెడతాయి, కాని ఆ పక్షుల గుడ్లను గూడునుంచి తోసివెయకుండానె తమ గుడ్లను పెడతాయి. అన్ని గుడ్డను ఒకె గూటిలొ పెట్టవు, నాలుగయిదు గూళ్ళల్లొ పెడుతుంది. మగపక్షి గూళ్ళు వెతకడంలొ సహకరిస్తుంది. వీటి జీవితకాలం షుమారు పన్నెండు సంవత్సరాలు. 

భారతీయులు కోయిలలను పంజరాలలొ పెట్టి పెంచుతారు. భారతీయ సాహిత్యంలొ కొయిల పాట ప్రస్తావన తరచు వస్తుంది.

In New Zealand the Long-tailed Koel is known as the Long-tailed Cuckoo.ies, also known as koels but are in their own monotypic genera.

Asian koel (Female) photographed in India.
Asian koel photographed in Mumbai, India.

ఇవి కూడా చూడండి

మార్చు
 
ఆస్ట్రేలియా మగ కోకిల
"https://te.wikipedia.org/w/index.php?title=కోకిల&oldid=4235829" నుండి వెలికితీశారు