కోయిలకొండ కోట
తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన 7 గిరిదుర్గాలలో ఇది ఒకటి [1]. కొండపై వెలిసిన దుర్గం కాబట్టి కోవెలకొండ అని పేరు. కోవెల అనగా దేవాలయం. కోవెలకొండ నామమే మార్పు చెంది ప్రస్తుతం కోయిలకొండగా మారింది.కోయిలకొండ గ్రామానికి దక్షిణ దిశలో ఎత్తయిన గుట్టపై కోటను నిర్మించారు. చరిత్ర ప్రకారం 14 వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియరామరాయలు కాలంలో వడ్డెరాజులు ఈ కోటను నిర్మించారు. తర్వాత ఈ కోట వెలమ రాజుల హస్తగతమైంది. ఈ కోటను ప్రస్తుతం కీలగుట్టగా పిలుస్తారు. కొందరు దురభిమానులు కోటలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. కోట చుట్టూ శ్రీరామకొండ, వీరభద్రస్వామి, వడెన్న దర్గాలు ఉన్నాయి.
కోయిలకొండ శాసనం
మార్చుకోయిలకొండ దుర్గం యొక్క గోడకు తాపబడిన శిలాఫలకంపై ఒక శాసనం ఉంది. ఇది శక సంవత్సరం 1472 సాధారణ, మాఘ శుద్ధ పంచమి సోమవారం (సా.శ. 1550) నాడు వేయించారు. గోల్కొండ నవాబు ఇబ్రహీం కుతుబ్‌షా గౌరవార్థం కోయిలకొండ హాశిం వేయించిన శాసనం ఇది. ఈ శాసనం 13 పంక్తులలో ఉంది[2].