కోయిలకొండ

తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా లోని మండలం

కోయిలకొండ, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా, కోయిలకొండ మండలానికి చెందిన గ్రామం.[1]

కోయిలకొండ
—  రెవిన్యూ గ్రామం  —
కోయిలకొండ is located in తెలంగాణ
కోయిలకొండ
కోయిలకొండ
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°45′31″N 77°47′22″E / 16.75849902776125°N 77.78939097216934°E / 16.75849902776125; 77.78939097216934
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం కోయిలకొండ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,046
 - పురుషుల సంఖ్య 2,576
 - స్త్రీల సంఖ్య 2,470
 - గృహాల సంఖ్య 969
పిన్ కోడ్ 509371.
ఎస్.టి.డి కోడ్
కోయిలకొండ రక్షకభట నిలయం

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 23 కి. మీ. దూరంలో ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]కోయిలకొండ గ్రామంలో పురాతన కోటతో పాటు పురాతన ఆలయాలు, చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.

గణాంకాలు

మార్చు

గ్రామ జనాభా

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 969 ఇళ్లతో, 5046 జనాభాతో 1309 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2576, ఆడవారి సంఖ్య 2470. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 992 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 274. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 575432.[3]

విద్యా సౌకర్యాలు

మార్చు

శ్రీ వీరభద్ర జూనియర్ కళాశాల, కోయిల కొండ (స్థాపన : 2005-06).గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉన్నాయి.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మహబూబ్ నగర్లో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ మహబూబ్ నగర్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల మహబూబ్ నగర్లో ఉన్నాయి.

ముఖ్యమైన ప్రదేశాలు

మార్చు

కోట నిర్మాణం

మార్చు

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన 7 గిరిదుర్గాలలో ఇది ఒకటి. కొండపై వెలిసిన దుర్గం కాబట్టి కోవెలకొండ అని పేరు. కోవెల అనగా దేవాలయం. కోవెలకొండ నామమే మార్పు చెంది ప్రస్తుతం కోయిలకొండగా మారింది.కోయిలకొండ గ్రామానికి దక్షిణ దిశలో ఎత్తయిన గుట్టపై కోటను నిర్మించారు. చరిత్ర ప్రకారం 14 వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియరామరాయలు కాలంలో వడ్డెరాజులు ఈ కోటను నిర్మించారు. తర్వాత ఈ కోట వెలమ రాజుల హస్తగతమైంది. ఈ కోటను ప్రస్తుతం కీలగుట్టగా పిలుస్తారు. కొందరు దురభిమానులు కోటలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. కోట చుట్టూ శ్రీరామకొండ, వీరభద్రస్వామి, వడెన్న దర్గాలు ఉన్నాయి.ఒకనాడు తాలుకా కేంద్రంగా విరజిల్లిన ఈ కోట నేడు మండల కేంద్రంగా తన ఉనికిని చాటుకుంటుంది. కోయిలకొండ గ్రామానికి దక్షిణాన ఎత్తైన గుట్టపై నిర్మాణం జరిగింది. కోట సప్తప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో లెక్కకు మించిన బురుజులతో శత్రు ప్రవేశం జరగని విధంగా నిర్మించారు. పెద్ద పెద్ద రాళ్ళను ఒక దానిపై మరొక దాన్ని పేర్చి గోడల నిర్మాణం చేశారు. గచ్చు గానీ, మట్టి గానీ వాడకుండానే గోడల నిర్మాణం చేయడం మహా అద్భుతం. కోటపైకి ఎక్కడానికి విశాలమైన మెట్లను నిర్మించారు. కోటలో రెండంతస్తుల దివ్యమైన రాణి మహేల్‌ ఉండేవి. అది నేటికి మనకంటికి అక్కడ కనిపిస్తుంది. కోటపై భాగంలో సంవత్సరం పొడవునా తాగునీటి ఎద్దడి లేకుండా విశాలమైన సరోవరములను నిర్మించారు. ఆ నాటి రాజులు తమ సౌకర్యార్ధం అశ్వశాలలు, గజశాలలు, ధాన్యాగారాలు, నివాస గృహాలు కోటపై భాగముననే నిర్మించారు. రాజు వినియోగానికి నీటి గది ఒకటి రమణీయంగా నిర్మించుకోవడం జరిగింది. ఆ గదిలోనికి వీరు మాత్రం ఎక్కడి నుండి వచ్చునో, ఎక్కడికి వెళ్ళిపోతాయో ఎవరికి తెలియదు. నీళ్ళు మాత్రం సూచికగా కనబడతాయి. కోటపై భగంలో ఆంజనేయస్వామి,దేవాలయాలతో పాటు అడుగడుగున అనేక దేవాలయాలు తారసపడతాయి.

కోట చరిత్ర

మార్చు

కోయిలకొండ కోటను వడ్డె రాజులు నిర్మించారు. వారు చేసిన నిర్మాణం ప్రశంసనీయం. కాగా కాల క్రమంలో కోట వెలమరాజుల (పద్మనాయక రాజుల) వశమైంది. ఈ కోటను పరిపాలించిన చివరి వెలమ రాజు సవాయిబసవరాజు. అతడు గోల్కొండ కుత్‌బ్‌షాహి వంశ మూల పురుషుడు మహ్మద్‌ కులీకుత్‌బ్‌షాకు సమకాలికుడు. కోయిలకొండ కోట రాజు సవాయి బసవరాజు కాగా, సేనాధిపతి యాదవరావు, కోశాధికిరగా పురుషోత్తంరావు పనిచేశారు. కోయిలకొండ రాజ్యం చాలా విస్తీర్ణం కలిగి చించోళి వరకు వ్యాపించి ఉండేది. యాదవరావు తన గుర్తుగా కోట కింద ప్రాంతం గల గ్రామాన్ని పేట అని పిలిపిచే వారు. ఈ పేటలోని ప్రజలకు తాగునీటి కోసమై చేదబావిని త్రవ్వించాడు. గంభీరరావు తన జ్ఞాపకార్ధకంగా గంభీరోని చెరువు తవ్వించాడు. గోల్కొండ నవాబు కోయిలకొండను ఆక్రమించాలని కోయిలకొండ రాజుపై దండెత్తారు. కోట పేటలో భీకరమైన యుద్ధం జరిగి వేలాది మంది మృత్యువు పాలయ్యారు. అనంతరం హిందూ, ముస్లింల పెద్దలు అందరు ఐక్యతతో ఉండాలని కోటపై భాగంలో ఒక శిలా శాసనాన్ని రాయించారు.

చూడదగ్గ ప్రదేశాలు

మార్చు

కోటలో నిర్మించిన అద్భుత కట్టడాలైన గోడలు, సిరస్సులు, ధాన్యాగారాలు, దేవాలయాలు, రెండు పెద్ద పిరంగులతో పాటు కోట చుట్టూ గల కొండలపై అలనాడే మహిమ గల దేవాలయాల నిర్మించారు. కోటకు పడమటి భాగాన రామగిరి అని నాడు రామకొండ అని నేడు పిలిచే ఎత్తైన కొండపై శ్రీ రాముని పాదములు ఉంది. ఆ కొండపై సైతం లెక్కలెనన్ని గృహాలు ఉన్నాయి. పూర్వ కాలంలో మునులు, ఋషులు సంవత్సరాల తరబడి తపస్సు చేశారని పెద్దల వాక్కు, ఈ కొండపై విశేష వన మూలికలు ఉన్నాయి. అక్కడ గల సిరస్సులోని నీళ్ళతో స్నానం చేసి ఆ నీరును తాగి రాముని పాదాన్ని దర్శించుకుంటే కోరిన కోర్కెలు అన్ని ఇట్టే నెరవేరుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. కోటకు దక్షిణాన పెద్దవాగు ఉంది. దాన్ని పక్కనే ధర్మరాజుల బండ ఉంది. ఇక్కడికి పంచపాండవులు సైతం తమ అరణ్యవాసంలో వచ్చి ఉండొచ్చని పూర్వీకులు అంటారు. కోటకు తూర్పభాగాన ఎత్తైన కొండపై వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడికి మనహారాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల వారు సంవత్సరం పొడవున వచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారు.

మొహర్రం విశిష్టత

మార్చు

కోయిలకొండలో ప్రతి సంవత్సరం పది రోజుల పాటు మొహర్రం పండగకు ఎంతో విశిష్టత ఉంది. దిశ నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు వచ్చి కోటపై గల బీబీ ఫాతిమాను దర్శించుకుంటారు. కాగా ఈ మొహర్రం పండగను ఇక్కడ మతసామరస్యంతో హిందూ, ముస్లింలు ఐక్యతతో జరుపుకోవడం ప్రత్యేకత. హిందూ, మహ్మదీయుల సంప్రదాయాలను ఏకం చేసి ఈ ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

కోయిలకొండలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు నలుగురుఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

కోయిలకొండలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.

సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

కోయిలకొండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 82 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 178 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 145 హెక్టార్లు
  • బంజరు భూమి: 288 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 614 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 641 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 261 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

కోయిలకొండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.మండలంలో 12 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 750 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[4]

  • బావులు/బోరు బావులు: 132 హెక్టార్లు* చెరువులు: 128 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

కోయిలకొండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

జొన్న, కంది, వరి

పారిశ్రామిక ఉత్పత్తులు

మార్చు

ఇటుకలు

సంఘటనలు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79

బయటి లంకెలు

మార్చు