ప్రధాన మెనూను తెరువు

తెలంగాణ యొక్క సంస్కృతి, సంప్రాదాయాలు, వైభవం, నాగరికత మొదలైన వాటి గురించి చెప్పే వాటిలో తెలంగాణ కోటలు ప్రముఖమైనవి. ఈ కోటలలో అప్పటి రాజులు వేయించిన శాసనాలు, నాణాలతోపాటు వారు రాజ్యపరిపాలన సాగించిన తీరుతెన్నులు, శత్రుదుర్భేద్యంగా నిర్మించిన రాతి గోడలు అబ్బురపరిచే వాటి నిర్మాణశైలి మొదలైన ఎన్నో ఈ కోటల ద్వారా తెలుస్తాయి. అంతేకాకుండా ఏయే రాజవంశీయులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారో వారి ఆచార్య వ్యవహరాలు, వారు వాడిన వస్తువులు, దుస్తులు, ఆయా రాజుల కళాపోషణ, నాటి శిల్పకళా వైభవం, అద్భుతమైన రాతికట్టడాలు మొదలైనవి గత చరిత్రకు సాక్షీభూతంగా ఈ కోటలలో నెలకొని ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా వరకు కోటలు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని కోటలు పర్యాటక కేంద్రాలుగా మారి నేటికీ ప్రజలకు ఆహ్లాదాన్ని కల్గిస్తున్నాయి.[1]

ప్రసిద్దకోటలుసవరించు

 1. గోల్కొండ కోట (హైదరాబాదు జిల్లా)
 2. రామగిరిఖిల్లా (పెద్దపల్లి జిల్లా)
 3. భువనగిరి కోట (యాదాద్రి - భువనగిరి జిల్లా)
 4. గద్వాల కోట (జోగులాంబ గద్వాల జిల్లా)
 5. మెదక్ కోట (మెదక్ జిల్లా)
 6. సిర్పూర్‌ కోట (కొమురంభీం జిల్లా)
 7. నిజామాబాదు కోట (నిజామాబాద్ జిల్లా)
 8. వరంగల్ కోట (వరంగల్ జిల్లా)
 9. ఎలగందల్ కోట (కరీంనగర్ జిల్లా)
 10. ఖమ్మం కోట (ఖమ్మం జిల్లా)
 11. మొలంగూర్ కోట (కరీంనగర్ జిల్లా)
 12. నిర్మల్ కోట (నిర్మల్ జిల్లా)
 13. ప్రతాపగిరి కోట (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)
 14. కోటిలింగాల కోట (జగిత్యాల జిల్లా)
 15. గాంధారి ఖిల్లా (మంచిర్యాల జిల్లా)
 16. దేవరకొండ కోట (నల్లగొండ జిల్లా)
 17. జగిత్యాల కోట (కరీంనగర్ జిల్లా)
 18. ఉట్నూరు కోట (ఆదిలాబాద్ జిల్లా)
 19. ఖిల్లా ఘనపూర్ కోట (వనపర్తి జిల్లా)
 20. దేవదుర్గం కోట (కొమురంభీం జిల్లా)
 21. రాజాపేట కోట (యాదాద్రి - భువనగిరి జిల్లా)
 22. పానగల్ కోట (వనపర్తి జిల్లా)
 23. నగునూర్ కోట (కరీంనగర్ జిల్లా)
 24. రాయగిరి కోట (యాదాద్రి భువనగిరి జిల్లా)
 25. వనపర్తి కోట (వనపర్తి జిల్లా)
 26. కౌలాస్ కోట (నిజామాబాద్ జిల్లా)
 27. దోమకొండ కోట (నిజామాబాద్ జిల్లా)
 28. రాచకొండ కోట (రంగారెడ్డి జిల్లా)

మూలాలుసవరించు

 1. తెలంగాణ కోటలు, తెలంగాణ వైభవం పరిచయదీపిక, తెలంగాణ రాష్ర్ట విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ హైదరాబాదు, డిసెంబర్ 2017, పుట. 83.