కోర

(కోరలు నుండి దారిమార్పు చెందింది)

కోర (బహువచనం: కోరలు) (ఆంగ్లం: Fang) పొడవుగా మొనదేలిన దంతాలు.[1] కోరలు మార్పుచెందిన రదనికలు (Canine teeth). క్షీరదాలు కోరల్ని మాంసాన్ని చీరడానికి, కొరకడానికి ఉపయోగిస్తాయి. పాములలో కోరలు విషాన్ని ఇంజెక్ట్ చెయ్యడానికి అనువుగా లోపల బోలుగా ఉంటాయి[2]

దేశీయ పిల్లి యొక్క నాలుగు కోరలు

మాంసాహారులకు ఈ కోరలు సర్వసాధారణం. కానీ మెగా గబ్బిలాల వంటి శాకాహారులు కూడా ఈ కోరలను కలిగి ఉంటాయి. ఇవి పెద్ద పిల్లువ వంటి జంతువులను పట్టుకోవడానికి లేదా వేగంగా చంపడానికి ఈ కోరలను ఉపయోగిస్తాయి. ఎలుగుబంట్ల వంటి మిశ్రమాహార జీవులు చేపలు లేదా ఇతర ఆహారాన్ని వేటాడేటప్పుడు ఈ కోరలను ఉపయోగిస్తాయి. కానీ అవి పండ్లను తినడానికి ఈ కోరలు అవసరం లేదు. కొన్ని కోతులకు కూడా కోరలు ఉన్నాయి, ఇవి శత్రువులను బెదిరించడానికి, పోరాడేందుకు కోరలను ఉపయోగిస్తాయి. మానవులకు ఉన్న చిన్న రదనికలు కోరలుగా పరిగణించబడవు.

భాషా విశేషాలు మార్చు

తెలుగు భాష ప్రకారంగా[3] కోర [ kōra ] అనగా దంష్ట్ర (A tusk, fang, tooth). A cup గిన్నె. A tray or dish, పళ్లెము. adj. Sharp, pointed కోర కొమ్ము a sharp horn. కోరపళ్లు the incisors. కోర మీసాలు pointed whiskers. కోర పంది a tusked boar. Unbleached, brown. Base, impure. Slanting, lying on a side ఒరిగియుండే, పక్కగానుండే. కోరదవడలు hollow cheeks. కోరకొండె or కోరసిగ a side lock or tuft of hair ముఖపార్శ్వమునవేసే కొండె. కోరపోవు అనగా వంకరలుపోవు అని అర్థం.

మూలాలు మార్చు

  1. "Fang - Definition of Fang by Merriam-Webster".
  2. Vonk, Freek J.; Admiraal, Jeroen F.; Jackson, Kate; Reshef, Ram; de Bakker, Merijn A. G.; Vanderschoot, Kim; van den Berge, Iris; van Atten, Marit; Burgerhout, Erik (July 2008). "Evolutionary origin and development of snake fangs". Nature. 454 (7204): 630–633. doi:10.1038/nature07178. ISSN 0028-0836. PMID 18668106.
  3. కోర భాషా ప్రయోగాలు[permanent dead link]

బాహ్య్త లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కోర&oldid=3830958" నుండి వెలికితీశారు