కోలవెన్ను రామకోటేశ్వరరావు
కోలవెన్ను రామకోటేశ్వరరావు, (1894- 1970) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, [1] సంపాదకులు.ఇతను బందరు నుండి వెలువడిన 'త్రివేణి' అనే సాంస్కృతిక పత్రికను సుమారు నాలుగు దశాబ్దాలు నిర్వహించాడు .
కోలవెన్ను రామకోటేశ్వరరావు | |
---|---|
జననం | 1894 అక్టోబరు 22 గుంటూరు జిల్లా నరసారావుపేట |
మరణం | 1970 మే 19 |
వృత్తి | పాత్రికేయులు |
తండ్రి | వియ్యన్న పంతులు |
తల్లి | రుక్మిణమ్మ |
ఇతను గుంటూరు జిల్లా నరసారావుపేటలో 1894 సంవత్సరం అక్టోబరు 22న జన్మించాడు. న్యాయశాస్త్ర పట్టభద్రులై, కొన్నాళ్ళు న్యాయవాదిగా పనిచేసిన, పిదప జాతీయోద్యమం వైపు ఆకర్షితులయ్యాడు. బందరు జాతీయ కళాశాలలో మొదట ఉపాధ్యాయులుగా, తరువాత ప్రిన్సిపాల్ గాను పనిచేశాడు.1930లో ఉప్పు సత్యాగ్రహం లోను, 1940లో వ్యక్తి సత్యాగ్రహంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని చెరసాలకు వెళ్ళాడు.
భారత దేశంలో వివిధ రాష్ట్రాల భాషా సాహిత్యాలను, ఇంగ్లీషు అనువాదాల ద్వారా, ఇతర రాష్ట్రాల వారికి పరిచయం చెయ్యటం, భారత జాతీయ జీవనంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించటంలాంటి వ్యాసాలతో త్రివేణి పత్రిక ధ్యేయంగా ఉండేది.1928లో మొదలయిన త్రివేణిపత్రికలో రాధాకృష్ణన్, రాజాజీ, నెహ్రూ మొదలైన నాయకులు రచనలు చేసారు. మహాత్మా గాంధీ 1934లో బందరు వచ్చినప్పుడు త్రివేణి బాగుందని మెచ్చుకున్నాడు.
వనరులు
మార్చు- అక్కిరాజు రమాపతిరావు రాసిన 'ప్రతిభామూర్తులు', విజ్ఞాన దీపిక ప్రచురణ, 1991.
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.