కోలిన్ స్నెడెన్
కోలిన్ అలెగ్జాండర్ స్నెడెన్ (1918, జనవరి 7 - 2011, ఏప్రిల్ 24) న్యూజీలాండ్ మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కోలిన్ అలెగ్జాండర్ స్నెడెన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1918 జనవరి 7|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2011 ఏప్రిల్ 24 న్యూజీలాండ్ | (వయసు 93)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు |
| |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 43) | 1947 మార్చి 21 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 1 April 2017 |
జననం, కుటుంబం
మార్చుకోలిన్ అలెగ్జాండర్ స్నెడెన్ 1918, జనవరి 7న న్యూజీలాండ్ లో జన్మించాడు. స్నెడెన్ ఆక్లాండ్‌లోని సేక్రేడ్ హార్ట్ కాలేజీలో చదివాడు.[1] ఇతని తండ్రి నెస్సీ స్నెడెన్, సోదరుడు వార్విక్ స్నెడెన్ ఇద్దరూ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. వార్విక్ కుమారుడు మార్టిన్ స్నెడెన్ న్యూజీలాండ్ తరపున 25 టెస్టులు, 93 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.
క్రికెట్ కెరీర్
మార్చుఆక్లాండ్ క్రికెట్ జట్టు తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. ఆడుకునే రోజుల్లో సుమారు 143 కిలోగ్రాముల బరువు కలిగి ఉన్నాడు.[1] శీఘ్ర ఆఫ్-బ్రేక్‌లను బౌలింగ్ చేయడంలో రాణించాడు.[2] రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఒక మ్యాచ్ ఆడాడు, తర్వాత 1946-47లో ఎనిమిది సీజన్‌ల తర్వాత తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించాడు. ఒటాగోపై ఐదు వికెట్లు తీసుకున్నాడు, ఆ తర్వాత కాంటర్బరీపై ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు, రెండో ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 59 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు.[3]
1947 మార్చిలో క్రైస్ట్‌చర్చ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన న్యూజీలాండ్ తరపున సింగిల్ టెస్ట్‌కు ఎంపికయ్యాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఐదుగురు న్యూజీలాండ్ ఆటగాళ్ళు అరంగేట్రం చేశారు. న్యూజీలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 345 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది; స్నెడెన్ 11వ నంబర్ బ్యాట్స్‌మెన్ కాబట్టి బ్యాటింగ్ చేయలేదు. 16 ఓవర్లు బౌలింగ్ చేసాడు మ్యాచ్ డ్రాగా రద్దు చేయబడింది.[4][5]
పదవీ విరమణ చేయడానికి ముందు మరో రెండు సీజన్లలో కొన్ని మ్యాచ్‌లు ఆడాడు.[6]
తరువాతి జీవితం
మార్చురిటైర్మెంట్ తర్వాత స్నెడెన్ క్రికెట్, రగ్బీలో రేడియో వ్యాఖ్యాతగా మారాడు.[7][2] 1950 నుండి 1986 వరకు ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో క్రికెట్, రగ్బీ మ్యాచ్‌లను విశ్లేషించాడు.[1]
మరణం
మార్చుకోలిన్ అలెగ్జాండర్ స్నెడెన్ తన 93వ ఏట 24 ఏప్రిల్ 2011న నిద్రలోనే మరణించాడు.[8][9] 2010 ఆగస్టు 1న ఎరిక్ టిండిల్ మరణంతో, స్నెడెన్ న్యూజీలాండ్ టెస్ట్ క్రికెటర్‌గా జీవించి ఉన్న అతిపెద్ద వయసులో ఉన్నాడు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Joseph Romanos, Great New Zealand Cricket Families, Random House, Auckland, 1992, pp. 139–44.
- ↑ 2.0 2.1 Wisden 2012, p. 221.
- ↑ Auckland v Canterbury, 1946–47
- ↑ "The Unfortunate Few". NZ Cricket Museum (in అమెరికన్ ఇంగ్లీష్). 27 November 2015. Archived from the original on 2 April 2017. Retrieved 31 August 2017.
- ↑ "Only Test, Christchurch, Mar 21 - 25 1947, England tour of New Zealand". Cricinfo. Retrieved 29 August 2021.
- ↑ "First-Class Matches played by Colin Snedden". CricketArchive. Retrieved 29 August 2021.
- ↑ "Auckland cricket dynasty loses veteran". NZ Herald. 30 April 2011. Retrieved 31 August 2017.
- ↑ Cricinfo
- ↑ "New Zealand veteran Colin Snedden dies". ESPNcricinfo. 24 April 2011. Retrieved 31 August 2017.