కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) (Coal India Limited (CIL) ప్రభుత్వ యాజమాన్యంలోని బొగ్గు గనుల కంపెనీ. బొగ్గు, బొగ్గు ఆధారిత ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ ఓపెన్ కాస్ట్ గనులు, భూగర్భ గనులు, మిశ్రమ గనులను నిర్వహిస్తుంది. కోల్ ఇండియా లిమిటెడ్  ఉత్పత్తులు ఉక్కు తయారీ, ఎరువులు, గాజు, విద్యుత్ సంస్థలు, సిమెంట్, సిరామిక్, రసాయన, కాగితం, దేశీయ ఇంధనం, పారిశ్రామిక ప్లాంట్లలో ఉపయోగపడతాయి. భారతదేశం అంతటా మైనింగ్ కన్సల్టెన్సీ సేవలను కూడా అందిస్తుంది. ఈ సంస్థ భారతదేశం అంతటా తన మైనింగ్ నిక్షేపాలను నిర్వహిస్తుంది. మొజాంబిక్ లో ఒక మైనింగ్ కంపెనీని కలిగి ఉంది. కంపెనీ  ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతాలో ఉంది. సంస్థలో సుమారు 2,48,550 మంది ఉద్యోగులు ఉన్నారు.[1]

మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇండియా లోగో

చరిత్ర మార్చు

 
భారతదేశంలో ఇతర ప్రాంతాలకు రైల్వే ద్వారా బొగ్గు రవాణా

భారతీయ బొగ్గు పరిశ్రమ 19 వ శతాబ్దం ప్రారంభంలో రైల్వే నెట్ వర్క్ విస్తరణతో పాటు, ముఖ్యంగా దేశం పశ్చిమ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు వాణిజ్యపరంగా మారాయి. 1813 లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్య ప్రయోజనాలు రద్దు చేయబడ్డాయి. ప్రారంభంలో, బొగ్గు క్షేత్రాలను పెద్ద సంఖ్యలో భారతీయ ప్రైవేట్ కంపెనీలు నిర్వహించాయి, ఇవి వారి ఇనుము, ఉక్కు పనులకు మద్దతు ఇవ్వడానికి క్యాప్టివ్-లేదా కంపెనీ యాజమాన్యంలోని బొగ్గు క్షేత్రాలను కలిగి ఉన్నాయి. 1900 నాటికి 34 కంపెనీలు 286 గనుల నుండి 7 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశాయి. 20 వ శతాబ్దం మొదటి అర్ధభాగంలో, ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఉత్పత్తి పెరుగుతూనే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో డిమాండ్ పెరుగుతూనే ఉంది. 1945 నాటికి ఉత్పత్తి 29 మిలియన్ టన్నులకు చేరుకుంది.

ప్రభుత్వం  రెండవ పంచవర్ష ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక 1957-1961 కింద, ప్రణాళిక కాలం ముగింపుకు 60 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రభుత్వ సంబంధింత ఆర్థిక ప్రణాళికదారులు ప్రైవేట్ రంగం ఈ లక్ష్యాన్ని చేరుకోలేదని, అందువల్ల నేషనల్ కోల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సిడిసి) ఏర్పడాలని ,ఇది పాత రైల్వే బొగ్గుగనులను కేంద్రబిందువుగా తీసుకొని కొత్త గనులను కూడా తెరిచింది. బొగ్గు ఉత్పత్తి 1956 లో 38 మిలియన్ టన్నుల నుండి 1961 లో 56 మిలియన్ టన్నులకు పెరిగింది.

1960 లలో,నేషనల్ కోల్ డెవలప్మెంట్ కార్పొరేషన్( ఎన్ సి డి సి ), సింగరేణి కాలరీస్ మినహా, భారతదేశంలోని చాలా బొగ్గుగనులు ప్రైవేటు రంగంచే నిర్వహించబడుతున్నాయి. జాతీయ స్థాయిలో, బొగ్గు పరిశ్రమ జాతీయీకరణను పరిగణించమని ప్రభుత్వాన్ని బలవంతం చేయడానికి మూడు అంశాలు రావడం జరిగింది.  మొదట, సమకాలీన మైనింగ్ పద్ధతులు గొప్ప వృధాకు దారితీస్తున్నాయనే భయం ఉంది. రెండవది, పారిశ్రామిక అభివృద్ధి ప్రాధాన్యతల దృష్ట్యా బొగ్గుకు భవిష్యత్తులో డిమాండ్ భారీగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. చివరగా, 1962-1966 మూడవ పంచవర్ష ప్రణాళిక సమయంలో, అలాగే 1966-1969 కాలంలో, ఉత్పత్తి పెరిగినప్పటికీ, పరిశ్రమలో ప్రైవేట్ మూలధన పెట్టుబడుల కొరత ఉంది. 1971-1973 కాలంలో, ఉత్పత్తిని పెంచడానికి, బొగ్గు కొరతను అధిగమించడానికి ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యంలోని బొగ్గు కంపెనీల జాతీయీకరణల పరంపరను చేపట్టింది. జాతీయీకరణల సమయంలో, దేశంలో మొత్తం బొగ్గు ఉత్పత్తి 72 మిలియన్ టన్నులు మాత్రమే ఉన్నది.[2]

కోల్ ఇండియా మార్చు

 
ధన్ బాద్ లోని బొగ్గు గని
 
ఒక కార్మికుడు బొగ్గు గనులలో పనిచేస్తున్న దృశ్యం.

టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ మినహా కోకింగ్ బొగ్గు గనులు మే 1972 లో జాతీయం చేయబడి, వాటిని నిర్వహించడానికి భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బిసిసిఎల్) అనే కొత్త ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించబడింది. మే 1973 లో, నాన్-కోకింగ్ బొగ్గు గనులు కూడా జాతీయం చేసి, కోల్ మైన్స్ అథారిటీ (సిఎంఎ) నియంత్రణలోనికి  తీసుకరావడం జరిగింది. ప్రభుత్వ రంగ కంపెనీలను పర్యవేక్షించడానికి ఇంధన మంత్రిత్వ శాఖలో బొగ్గు శాఖ ఏర్పాటు చేయబడింది. పరిశ్రమ  తదుపరి పునర్వ్యవస్థీకరణ నవంబర్ 1975 లో కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) ఏర్పాటుకు దారితీసింది, ఇందులో నేషనల్ కోల్ డెవలప్మెంట్ కార్పొరేషన్( ఎన్ సి డి సి ), కూడా విలీనం అయినది. పునర్వ్యవస్థీకరణలో మెజారిటీ ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలను కోల్ ఇండియా లిమిటెడ్( సిఐఎల్)  నిర్వహణలో ఉంచారు.  కోల్ ఇండియా లిమిటెడ్ మొదట ఆరు అనుబంధ సంస్థలను కలిగి ఉంది. వాటిలో ఐదు ఉత్పత్తిలో ఉన్నాయి.  ధన్ బాద్ లో ఉన్న బిసిసిఎల్; రాంచీలోని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్; నాగపూర్ దగ్గర వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యుసిఎల్); శాంక్టోరియా దగ్గర ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఇ సి ఎల్), మార్గెరిటా దగ్గర నార్త్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్ ఇ సి ఎల్) ఉన్నాయి. ఆరవది రాంచీలోని సెంట్రల్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సి) తో కలిసి, కోల్ ఇండియా లిమిటెడ్ భారత ప్రభుత్వం ఇంధన మంత్రిత్వ శాఖలోని బొగ్గు విభాగం ద్వారా నేరుగా నిర్వహిస్తుంది. కోల్ ఇండియా లిమిటెడ్యొ అన్ని అనుబంధ సంస్థలు స్వతంత్ర కంపెనీల హోదాను కలిగి ఉన్నాయి, కానీ విస్తృత విధానాలను రూపొందించడానికి  పరిపాలనా నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం కోల్ ఇండియా లిమిటెడ్ కు ఉంది[2].

అనుబంధ సంస్థలు మార్చు

కోల్ ఇండియా అనుబంధ సంస్థలు ఈ విధంగా ఉన్నాయి.[3]

క్రమసంఖ్య కంపెనీ
1 ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్
2 భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్
3 సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్
4 జార్ఖండ్ సెంట్రల్ రైల్వే లిమిటెడ్
5 నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్
6 వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్
7 సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్
8 ఛత్తీస్ గఢ్ ఈస్ట్ రైల్వే లిమిటెడ్
9 ఛత్తీస్ గఢ్ ఈస్ట్-వెస్ట్ రైల్వే లిమిటెడ్
10 మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎం సి ఎల్)
11 మూసీ కోల్ లిమిటెడ్
12 ఎం హెచ్ ఎన్ పవర్ లిమిటెడ్
13 మహానది బేసిన్ పవర్ లిమిటెడ్
14 మహానది కోల్ రైల్వే లిమిటెడ్
15 సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ (సిఎమ్పిడిఐ) – మైన్ ప్లానింగ్,కన్సల్టెన్సీ సంస్థ
16 కోల్ ఇండియా ఆఫ్రికనా లిమిటాడా (సియాల్) – మొజాంబిక్ లోని విదేశీ అనుబంధ సంస్థ
17 నార్త్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ - నేరుగా సిఐఎల్ ద్వారా నిర్వహించబడతాయి.
18 సిఐఎల్ నవీ కర్ణియ ఉర్జా లిమిటెడ్
19 సిఐఎల్ సోలార్ పివి లిమిటెడ్ – సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ అభివృద్ధిలో పని చేస్తుంది.

వాటాదారులు మార్చు

కోల్ ఇండియా వాటాదారులలో ప్రభుత్వం ఎక్కువమొత్తంలో ఉన్నాయి10 జనవరి 2020 ఈ విధంగా ఉన్నాయి.[4]

వాటాదారులు
క్రమసంఖ్య పేరు మొత్తం
1 భారత ప్రభుత్వం 70.96%
2 పబ్లిక్ 29.04%
3 మొత్తం 100%


మూలాలు మార్చు

  1. "Coal India Ltd Company Profile - Coal India Ltd Overview". www.linkedin.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  2. 2.0 2.1 "Coal India Ltd. - Company Profile, Information, Business Description, History, Background Information on Coal India Ltd". www.referenceforbusiness.com. Retrieved 2023-01-10.
  3. chcom (2021-12-31). "Coal India Limited (CIL)". CompaniesHistory.com - The largest companies and brands in the world (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  4. "Coal India: Holding details - NDTV". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.