కోసీ నది
కోసీ నది (నేపాలీ: कोशी नदी), నేపాల్, భారత దేశంలలో ప్రవహించే నది. నేపాలీ భాషలో ఈ నదిని కోషి అని అంటారు. గంగా నదికి ఉన్న పెద్ద ఉపనదులలో ఈ నది ఒకటి. ఈ నది, దాని ఉపనదులు గంగా నదిలో కలిసే ముందు మొత్తము 69,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తున్నాయి. గత 250 సంవత్సరాలలో, ఈ నది 120 కిలోమీటర్లు తూర్పు నుంచి పడమర వైపు గమనాన్ని మార్చింది. ఈ నది వర్షాకాలంలో తన ప్రవాహంతో పాటు తీసుకుని వెళ్ళే బురద ఈ నది యొక్క అస్థిర గమనమునుకు కారణం.
పుట్టుక
మార్చుతూర్పు హిమాలయ పర్వతాలలోని నేపాల్‌లో ఒక చిన్న పాయగా పుట్టిన కోసీనది సుమారు 160 మైళ్ళ దూరం ప్రవహించి బీహార్ మైదానాలలో ప్రవేశిస్తుంది. ఆ తరువాత తూర్పు బీహార్‌లో కోసీనది గంగానదిలో కలుస్తుంది.
వరదలు
మార్చుతరచుగా వరదలకు కారణమయ్యే కోసీనది చరిత్రలో ఎన్నో సార్లు తన గమనాన్ని మార్చుకొని ఎన్నో పట్టణాలను ముంచివేసింది. ముఖ్యంగా బీహారులో ఈ నది సృష్టించే భారీ వరదల వలన కోసీ నదిని బీహార్ దుఃఖదాయని [ఆధారం చూపాలి] అని కూడా అంటారు. సగటున సెకనుకు 1,564 క్యూబిక్ మీటర్ల ప్రవాహం గల కోసీ నది వరదల సమయంలో సగటుకి 18 రెట్లు ఎక్కువ ప్రవాహం కలిగి ఉంటుంది. అయితే వరదల వలన తీరప్రాంతాలలో ఒండ్రుమట్టి ఏర్పడి వ్యవసాయానికి ఎంతో తోడ్పడుతుంది.
నదీ పరీవాహక ప్రాంతం
మార్చుకోసీనది, దాని ఉపనదులు కలిసి 69,300 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రదేశాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ నదీపరీవాహక ప్రాంతానికి ఉత్తరాన బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం ఉండగా, దక్షిణాన గంగానది పరీవాహకప్రాంతం, తూర్పున మహానది పరీవాహక ప్రాంతం, పడమరన గండక్ నది పరీవాహక ప్రాంతం సరిహద్దులుగా ఉన్నాయి.