కోస్గి మండలం (నారాయణపేట జిల్లా)
కోస్గి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన ఒక మండలం.[1][2] గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[3] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[4] ప్రస్తుతం ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉండేవి. అయితే ఆ తరువాత 8 రెవెన్యూ గ్రామాలు 2022 జూలై 22న కొత్తగా ఏర్పడిన గుండుమల్ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు, 2 రెవెన్యూ గ్రామాలు వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలంలో విలీనం చేయబడ్డాయి. దీంతో కోస్గి మండలంలో మొత్తం రెవెన్యూ గ్రామాల సంఖ్య 15కి తగ్గింది.
కోస్గి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, కోస్గి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°59′02″N 77°43′10″E / 16.983905°N 77.719345°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నారాయణపేట జిల్లా |
మండల కేంద్రం | కోస్గి |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 202 km² (78 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 57,495 |
- పురుషులు | 28,575 |
- స్త్రీలు | 28,920 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 45.50% |
- పురుషులు | 59.39% |
- స్త్రీలు | 31.85% |
పిన్‌కోడ్ | 509339 |
గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 202 చ.కి.మీ. కాగా, జనాభా 62,221. జనాభాలో పురుషులు 30,910 కాగా, స్త్రీల సంఖ్య 31,311. మండలంలో 12,816 గృహాలున్నాయి.[5]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- కోస్గి
- కొత్తపల్లి
- లోధీపూర్
- చంద్రవంచ
- నాచారం
- తోగాపూర్
- ఏజీపూర్
- సర్జఖాన్‌పేట
- ముంగిమళ్ళ
- ముక్తిపహాడ్
- ముశ్రిఫా
- మీర్జాపూర్
- బిజ్జారం
- చెన్నారం
- కడంపల్లి
కొత్తగా ఏర్పడిన గుండుమాల్ మండలం
మార్చు2022 జూలై 22న గుండుమాల్ రెవెన్యూ గ్రామం ప్రస్తుత కోస్గి మండలం నుండి కొత్త మండలముగా ఏర్పడింది.[6]
గుండుమాల్ మండలంలో విలీనమైన గ్రామాలు
మార్చు2022 జూలై 22న కోస్గి మండలంలోని 8 గ్రామాలను కొత్తగా ఏర్పడిన గుండుమాల్ మండలంలో చేర్చారు, అలాగే వికారాబాదు జిల్లాలో కొత్తగా ఏర్పడిన దుద్యాల మండలంలో 2 గ్రామాలు విలీనం చేయబడ్డాయి.[6]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
- ↑ "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ 6.0 6.1 telugu, NT News (2021-07-23). "కొడంగల్‌లో మూడు కొత్త మండలాలు". www.ntnews.com. Retrieved 2023-08-17.