కౌగిలి
కౌగిలి, కవుగిలి లేదా ఆలింగనం (Hug) అనేది మానవ సంబంధాలలో అన్యోన్యతను సూచించే పద్ధతి. ఇది సాధారణంగా ఒకరిని మరొకరు చేతులతో చుట్టుకొని తెలియజేస్తారు. ఇది మానవులలో ప్రేమ, అభిమానాన్ని చూపేందుకు ఎక్కువమంది ముద్దు పెట్టుకోవడంతో సహా ప్రయోగిస్తారు.[1] చాలా దేశాలలో ఇది బహిరంగ ప్రదేశాలలో ఏమాత్రం జంకు, భయం లేకుండా వారి కుటుంబ సభ్యులతోనే కాకుండా అన్ని మతాలలో, సంస్కృతులలో, అన్ని వయస్సులవారు, స్త్రీపురుషులు అతి సామాన్యంగా అభిమానాన్ని చూపే విధానం.
ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రమే కాక, కౌగిలించుకోవడం కష్టాలలో వున్న వ్యక్తిని ఓదార్చడానికి, నేనున్నానని ధైర్యం చెబుతుంది. కొన్ని దేశాలలో కొత్త వ్యక్తిని కలిసేటప్పుడు కౌగిలితో పలకరిస్తారు. కౌగిలించుకోవడం మనుషులలోనే కాకుండా కొన్ని జంతువులలో కూడా కనిపిస్తుంది.
కౌగిలించుకోవడం ఆరోగ్యపరంగా మంచిదని తెలియజేస్తారు. ఒక పరిశోధనలో కౌగిలించుకోవడం వలన స్త్రీలలో ఆక్సిటోసిన్ విడుదలౌతుందని రక్తపోటు తగ్గుతుందని గుర్తించారు.[2]
భాషా విశేషాలు
మార్చుతెలుగు భాష[3] ప్రకారంగా కౌగిలి [ kaugili ] or కవుగిలి kaugili భూజాంతరము. కౌగిట చేర్చు to take in one's arms, to embrace. కౌగిలించు or కవుగిలించు kaugilinṭsn. n. To embrace. ఆలింగనముచేయు. కౌగిలింత, కవుగిలింత or కౌగిలింపు kaugilinta. n. An embrace. ఆలింగనము.
రకాలు
మార్చుకౌగిలింతలలో చాలా రకాలున్నాయని వాత్స్యాయనుడు కామసూత్రలో తెలియజేశాడు. ప్రేమికులు, దంపతులు రతి సమయంలో ఎక్కువకాలం కౌగిలించుకోవడం సాధారణంగా జరుగుతుంది.[4] వ్యక్తులిద్దరూ ఒకరికి మరొకరు ఎదురెదురుగా పడుకొని కౌగిలించుకుంటే దానిని "కడ్లింగ్" (Cuddling) అంటారు. అదే ఒకరి వెనుక మరొకరు పడుకొని కౌగిలించుకుంటే దానిని "స్పూనింగ్" (Spooning) అంటారు.[5]
మానవేతరుల్లో
మార్చుపాట్రికా మెక్ కానెల్ అన్న శాస్త్రజ్ఞుడు కౌగలించబడడాన్ని కుక్కలు, మానవులు ఇతర ప్రిమేట్ జంతువుల కన్నా తక్కువ ఇష్టపడతాయనీ, ఎందుకంటే ఇతర జంతువులపై కాళ్ళు పెట్టడం ఆధిపత్య సంకేతం.[6]
-
Madame Vigée-Lebrun et sa fille, by Louise Élisabeth Vigée Le Brun, 1789
-
The Kiss, by Francesco Hayez, 1859
-
Glassy embrace, a glass sculpture depicting a hug
మూలాలు
మార్చు- ↑ Kathleen Keating (1994). The Hug Therapy Book. Hazelden PES. ISBN 1-56838-094-1.
- ↑ "How hugs can aid women's hearts". BBC News. August 8, 2005. Retrieved 2008-11-28.
- ↑ కౌగిలి భాషా ప్రయూగాలు[permanent dead link]
- ↑ "Cuddle", WordNet 3.0. Princeton University. Accessed 10 March 2008.
- ↑ Jim Grace, Lisa Goldblatt Grace (1998) "The Art of Spooning: A Cuddler's Handbook" ISBN 0-7624-0270-9
- ↑ Patricia McConnell (June 4, 2002), The Other End of the Leash (1st ed.), Ballantine Books, ISBN 978-0-345-44679-4