ముద్దు లేదా చుంబనం (Kiss) ఒక విధమైన ప్రేమను వ్యక్తం చేసే పద్ధతి. ముద్దు పెట్టుకునే వ్యక్తి తన రెండు పెదవులతో మరొకరి శరీరంలో వివిధ భాగాల్ని సున్నితంగా స్పృశిస్తారు. అయితే వివిధ సంస్కృతులలో అనురాగం, గౌరవం, స్వాగతం, వీడ్కోలు మొదలైన ఇతర భావాలతో కూడా ముద్దు పెట్టుకుంటారు. ఇలా చేసేటప్పుడు కొంచెం శబ్దం కూడా వస్తుంది. ముద్దు పదం ఆంగ్లం లోని cyssan "to kiss", in turn from coss "a kiss" నుండి వచ్చింది.

సర్ ఫ్రాంక్ డిక్సీ వేసిన చిత్రపటంలో రోమియో, జూలియట్ల ముద్దు.
చిత్రలేఖనంలో ముద్దులొలికే పిల్లలు.

రతి క్రీడకు ముందుగా ఆలింగనం తర్వాత ముద్దు కూడా ఒక శృంగార ప్రక్రియగా మాత్రమే కొందరికి ఇది తెలుసును.

ముద్దాడే ప్రదేశాలుసవరించు

నుదురు, ముంగురులు, బుగ్గలు, కళ్ళు, వక్షస్థలం, చన్నులు, పెదవులు, నాలుక - ఈ ఎనిమిది ముద్దాడే ముఖ్యమైన ప్రదేశాలని ప్రాచీన కామశాస్త్రాచార్యులు చెప్పారు. ఇవి కాక గజ్జలు, చంకలు, బొడ్డు కూడా ముద్దు పెట్టుకోదగిన ప్రదేశాలని కొందరు చెప్పారు.

జీవశాస్త్రంలో ముద్దుసవరించు

 
జూలు కుక్కల "ముద్దు"

శాస్త్రవేత్తలు ముద్దు పెట్టడం నేర్చుకొనేదా లేదా సందర్భానుసరంగా జరిగేదా అనేది నిర్ధారించలేదు. కొన్ని జంతువులలో ఇదొక పెంపకానికి (Grooming) సంబంధించిన విషయము లేదా నమిలిన ఆహారాన్ని (Premasticated food) పిల్లలకు నోటిద్వారా అందించే ప్రక్రియ.[1]

ముద్దు ద్వారా ఎదుటివారి శరీరపు వాసనలు గ్రహించి ఎదటి వ్యక్తి తనకు సరైన జోడీనా లేదా అని నిర్ణయిస్తారు.[2][3][4]

ప్రైమేట్స్ లో కూడా ముద్దు పెట్టడం ఉన్నది.[5] కుక్కలు, పిల్లులు, పక్షులు మొదలైన జంతువులు నాకడం లేదా గ్రూమింగ్ వంటి ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. దీనినే కొన్నిసార్లు ముద్దుగా భావిస్తారు.

శరీర ధర్మశాస్త్రంసవరించు

ముద్దు పెట్టుకోవడం ఒక క్లిష్టమైన ప్రక్రియ. ముద్దు పెట్టుకొనేటప్పుడు సుమారు 34 ముఖ కండరాలు, 112 ఇతర కండరాలు పనిచేస్తాయని ప్రకటించారు.[6][7] అన్నింటికన్నా ముఖ్యమైన కండరము పెదాలను దగ్గరగా చేసే ఆర్బిక్యులారిస్ ఓరిస్ (Orbicularis oris); దీనినే ముద్దుపెట్టే కండరం (Kissing muscle) అంటారు. ఫ్రెంచి ముద్దులో నాలుక ముఖ్యమైన భాగము.

సంక్రమించే వ్యాధులుసవరించు

ముద్దు ద్వారా సంక్రమించే వ్యాధులు ఇన్ఫెక్సియస్ మోనోన్యూక్లియాసిస్ (Infectious Mononucleosis), హెర్పిస్ (Herpes). క్రిమికారక వైరస్ లు లాలాజలం (Saliva) ద్వారా ఒకరినుండి మరొకరికి వ్యాపిస్తాయి.

ముద్దులలో రకాలుసవరించు

 
బ్రెజిల్ ఉపరాష్ట్రపతి క్రైస్తవ మతాధిపతిని చేతిముద్దు పెట్టుకోవడం.

చేతి ముద్దుసవరించు

చేతి ముద్దు (Hand-kissing) ఉన్నత స్థాయికి చెంది, గౌరవ సూచకంగా పెట్టుకొనే ముద్దు. ఈ ముద్దు పొందే వ్యక్తి తన చేయిని ముందుకు ఉంచుతారు. ముద్దిచ్చే వ్యక్తి ఆ చేతిని అందుకొని, ముందుకు వంగి సున్నితంగా వేళ్ళను పెదాలతో తాకుతాడు. ఆధునిక కాలంలో దీనిని తిరస్కరించడం ఎదుటి వ్యక్తిని అవమానించడంగా భావిస్తారు.

చెక్కిలి ముద్దుసవరించు

బుగ్గ మీద ముద్దు (Cheek kissing) ప్రేమతో, స్నేహంతో లేదా గౌరవ సూచకంగా ఇచ్చే ముద్దు. ధన్యవాదాలు తెలుపడానికి లేదా ఇతరుల్ని ఓదార్చడానికి కూడా ఇస్తారు. సోవియట్ యూనియన్, కొన్ని కమ్యూనిస్టు దేశాలలో ప్రభుత్వ కార్యక్రమాలలో ఇది స్నేహానికి సంకేతంగా ఉపయోగిస్తారు. మన దేశంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కువగా బుగ్గమీద ప్రేమతో ముద్దిస్తారు.

బుగ్గమీద ముద్దుపెట్టుకొనే వ్యక్తులు ఒకరి బుగ్గను మరొకరి బుగ్గతో గాని పెదాలతో గాని సున్నితంగా తాకుతారు. ఇవి ఒకటి కన్నా ఎక్కువసార్లు కూడా పెట్టుకోవచ్చును.

ఫ్రెంచి ముద్దుసవరించు

 
ప్రేమికుల ఫ్రెంచి ముద్దు

ఫ్రెంచి ముద్దు (French kiss) రొమాంటిక్ లేదా సెక్స్ సంబంధమైనదిగా భావిస్తారు. ఇందులొ ఒకరి నాలుక మరొకరి నోటిలో ప్రవేశించి ఇంకొకరి నాలుకను తాకుతుంది.

గాలి ముద్దుసవరించు

 
గాలి ముద్దిస్తున్న పాశ్చాత్య నటి.

గాలి ముద్దు లేదా ఎగిరే ముద్దు (Air kiss) ఆధునిక కాలంలో ఒక సంకేతంగా ఉపయోగించే ఊహాజనితమైన ముద్దు. పెదాలను ముద్దు పెట్టినట్లు గుండ్రంగా చేసి, ముద్దు శబ్దాన్ని, చేతులతో ఎవరికి పంపాలో వారివైపుగా చూపించడం. దీనిలో ఒకరినొకరు తాకరు.

తెలుగు సాహిత్యంలో ముద్దుసవరించు

  • ముద్దుగారే యశోద - అన్నమాచార్య కీర్తన
  • ముద్దు మోము ఏలాగున చెలంగెనో - త్యాగరాజు కృతి
  • అడగక ఇచ్చిన మనసే ముద్దు - సినిమా పాట
  • అల్లారు ముద్దు కదే అపరంజి ముద్దు కదే - సినిమా పాట
  • ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో - ముత్యమంత ముద్దు సినిమా పాట
  • బుగ్గపై ముద్దు పెట్టు ముక్కెరై పోయేట్టు - చందమామ సినిమా పాట
  • ముద్దు పెట్టు ముద్దు మీద ముద్దు పెట్టు - డాన్ సినిమా పాట

మూలాలుసవరించు

  1. "Premastication - Langmaker". Archived from the original on 2008-12-29. Retrieved 2009-01-26.
  2. Santos, PS; Schinemann JA, Gabardo J, Bicalho Mda G. (2005). "New evidence that the MHC influences odor perception in humans: a study with 58 Southern Brazilian students". Hormones & Behavior. 47: 384–388. doi:10.1016/j.yhbeh.2004.11.005.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)
  3. Wedekind, C.; Seebeck, T., Bettens, F. and Paepke, A. J. (1995). "MHC-dependent mate preferences in humans". Proceedings: Biological Sciences. 260 (1359): 245–249. doi:10.1098/rspb.1995.0087.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)
  4. Fiore, Kristina (October 2, 2006). "Why do humans kiss?". Scienceline.
  5. "How animals kiss and make up". BBC News. October 13, 2003.
  6. Adrienne Blue (1996-06-01). "The kiss". The Independent (London). Archived from the original on 2008-12-23. Retrieved 2008-08-29.
  7. Roger Highfield (2006-10-17). "Seal with..146 muscles". The Telegraph. Archived from the original on 2006-10-26. Retrieved 2008-08-29.

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=ముద్దు&oldid=3907562" నుండి వెలికితీశారు