క్యామ మల్లేశ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.[1]

క్యామ మల్లేశ్

ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1992 - 1995

వ్యక్తిగత వివరాలు

జననం 1965 జనవరి 5
శేరిగూడ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి క్యామ జంగమ్మ
సంతానం అంజన్‌కుమార్‌, ప్రియాంక, అవంతి, అరోణి
నివాసం ఇబ్రహీంపట్నం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

క్యామ మల్లేశ్ విద్యా దశలోనే రాజకీయాల పట్ల ఆసక్తితో 1984లో ఎన్‌ఎస్‌యూఐ ఇబ్రహీంపట్నం జూనియర్ కళాశాల ఫౌండర్‌గా రాజకీయాల్లోకి వచ్చి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1988 నుండి 1989 వరకు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, 1990 నుండి 1992 వరకు ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1992 నుండి 1995 వరకు ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా, 1994 నుండి 2000 వరకు ఇబ్రహీంపట్నం పార్టీ మండల అధ్యక్షుడిగా, 2006 నుండి 2013 వరకు రాష్ట్ర కార్యదర్శిగా, 2013 నుండి 2018 వరకు కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పని చేశాడు.

క్యామ మల్లేశ్ 2013 నుంచి 20 కురమ సంఘం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనకు 2018లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో 2018లో కాంగ్రెస్‌ను వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. క్యామ మల్లేష్ ను 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది.[2][3]

మూలాలు మార్చు

  1. NT News (24 March 2024). "భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేశ్‌". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
  2. Sakshi (25 March 2024). "భువనగిరి బరిలో 'క్యామ'". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
  3. A. B. P. Desam (23 March 2024). "భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు - కేసీఆర్ కీలక ప్రకటన". Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.