ప్రధాన మెనూను తెరువు

తెలంగాణ రాష్ట్ర సమితి

భారతదేశం యొక్క రాజకీయ పార్టీ

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27 న అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.ఆలె నరేంద్ర, సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు తెరాసను విడిచి వెళ్ళారు. నిజాం మనుమరాలు సలీమా బాషా (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి
నాయకుడు కె.చంద్రశేఖరరావు
ప్రధాన కార్యదర్శి కే.కేశవరావు
స్థాపన 2001 ఏప్రిల్ 27
ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్, హైదరాబాదు
పత్రిక నమస్తే తెలంగాణా
సిద్ధాంతం తెలంగాణా వాదం
తెలంగాణా అసెంబ్లీ
63 / 119
లోక్ సభ
11 / 545
రాజ్య సభ
1 / 245
ఓటు గుర్తు
కారు
వెబ్ సిటు
http://www.trspartyonline.org/
జెండా
పార్టీ చిహ్నము

ఎన్నికలుసవరించు

2014 ఎన్నికలుసవరించు

తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తరువాత జరిగిన 2014 శాసనసభ ఎన్నికలో అత్యధిక స్థానాలు గెలుపొంది కే.సి.ఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణాలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

శాసనసభ ఎన్నికల ఫలితాలు

సంవత్సరం ఎన్నికలు గెలిచిన స్థానాలు పోటీ చేసిన స్థానాలు ధరావతు కోల్పోయిన స్థానాలు
2004 శాసనసభ 26 54 17[1]
2008 శాసనసభ
(ఉపఎన్నిక)
7 16 2[2]
2009 శాసనసభ 10 45 13[3]
2010 శాసనసభ
(ఉపఎన్నిక)
11 11 0
2011 శాసనసభ
(ఉపఎన్నిక)
1 1 0
2012 శాసనసభ
(ఉపఎన్నిక)
4 5 0
2012 శాసనసభ
(ఉపఎన్నిక)
1 1 0
2014 శాసనసభ 63 119 0[3]

లోక్ సభ ఫలితాలు

సంవత్సరం ఎన్నికలు గెలిచిన స్థానాలు పోటీ చేసిన స్థానాలు ధరావతు కోల్పోయిన స్థానాలు
2004 లోక్ సభ 5 22[4] 17
2008 లోక్ సభ
(ఉపఎన్నిక)
2 4 0
2009 లోక్ సభ 2 9 1 [5]
2014 లోక్ సభ 11 17 0 [5]

మూలాలుసవరించు