క్రిస్టోఫర్ లుక్సాన్
న్యూజిలాండ్ నూతన ప్రధానిగా నేషనల్ లిస్టు పార్టీ నేత, మాజీ వ్యాపారవేత్త క్రిస్టఫర్ లుక్సాన్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో నేషనల్ పార్టీ విజయం సాధించింది[1]. 2023 సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన చేపట్టిన ఎన్నికల కౌంటింగ్ లో 40% పైగా ఓట్లు నేషనల్ పార్టీ సాధించింది. అధికార లేబర్ పార్టీకి 25 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో జెసిండా ఆర్నాల్డ్ నేతృత్వంలో ఆరేళ్ల క్రితం ఏర్పాటైన ప్రభుత్వ హయాం ముగిసింది. యాక్ట్ పార్టీతో కలిసి క్రిస్టఫర్ లుక్సాన్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు[2]. క్రిస్టఫర్ లుక్సాన్ రాజకీయ ప్రవేశం చేసి నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఆయన తొలిసారిగా 2020 సంవత్సరంలో పార్లమెంట్లోకి అడుగుపెట్టారు[3]. 2021 సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ఇంత తక్కువ కాలంలోనే ఆయన ప్రధాని పీఠాన్ని అధిరోహించడం విశేషం. అంతకు ముందు ఆయన న్యూజిలాండ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని విమాన సంస్థ ఎయిర్ న్యూజిలాండ్ సీఈవో గా ఏడు సంవత్సరాలు పాటు బాధ్యతలు నిర్వహించారు. న్యూజిలాండ్ పార్లమెంటులో 121 సీట్లు ఉండగా... నేషనల్ పార్టీ 50, వారి భాగస్వామ్య పక్షం ఏసీటీ పార్టీ 11 స్థానాల్లో గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీకి 34 స్థానాలు మాత్రమే లభించాయి. క్రిస్టోఫర్ లుక్సోన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ములాలు :
- ↑ "new zealand: న్యూజిలాండ్ తదుపరి ప్రధాని క్రిస్టఫర్ లుక్సాన్". EENADU. Retrieved 2023-11-22.
- ↑ "న్యూజిలాండ్ నూతన ప్రధాని క్రిస్టోఫర్ లుక్సోన్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ". ap7am.com. 2023-10-16. Retrieved 2023-11-22.
- ↑ "మార్పునకు ఓటేసిన న్యూజిలాండ్: కొత్త ప్రధానిగా లక్సన్". Sakshi. 2023-10-14. Retrieved 2023-11-22.