ప్రతిపక్ష నాయకుడు

అధికార పార్టీకి పోటీగా ఏర్పడిన ఒక పెద్ద పార్టీకి నాయకుడుగా ఉన్న వ్యక్తి.

ప్రతిపక్ష నాయకుడు అనగా లోక్‌సభ, శాసనసభ, రాజ్యసభలలో అధికార పార్టీకి పోటీగా ఏర్పడిన ఒక పెద్ద పార్టీకి రాజకీయ నాయకుడుగా ఉన్న వ్యక్తి. ఇతను అధికారంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగ లోపాలను గట్టిగా ప్రశ్నిస్తాడు.ప్రతిపక్షనేత తరచుగా ప్రత్యామ్నాయ ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అంతటి హోదాకలిగిన వ్యక్తిగా చూడబడతాడు. అతను షాడో క్యాబినెట్ లేదా ప్రతిపక్ష పార్ఝీగా పిలవబడే ఒక ప్రత్యామ్నాయ బెంచ్‌కి ప్రధాన నాయకుడు. ప్రశ్నల సమయంలో ప్రతిపక్షపార్టీ తరపున ప్రధానమంత్రిని లేదా ముఖ్యమంత్రిని లేదా మంత్రులను ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుని ప్రధాన కర్తవ్యం.

ప్రతిపక్ష నాయకుడు సభలో ముఖ్యమైన కార్యకర్త.అతని ప్రాముఖ్యతను గుర్తించి మంత్రి హోదా ఇవ్వబడుతుంది. అతిపెద్ద గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ నాయకుడు సాధారణంగా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించబడతారు.అతను ప్రజా ప్రాముఖ్యత గల విషయాలను లేవనెత్తుతాడు. వాటిపై వివరణాత్మక చర్చలు జరపాలని రాజ్యాంగ సభలో వత్తిడి చేస్తాడు. సభా వ్యవహారాలను నిర్వహించడంలో స్పీకర్‌కు సహకారం అందిస్తాడు. అతనుకు ముందు వరుసలో సీటు, శాసనసభ ప్రాంగణంలో ఒక గది, సెక్రటరీ, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ప్రతిపక్ష నాయకుడుకు ఆచార సందర్భాలలో కొన్ని అధికారాలు ఉంటాయి. అంటే స్పీకరుగా ఎన్నుకోబడినవారిని వేదిక దగ్గరకు తీసుకెళ్లడం, గవర్నరు ప్రసంగించే సమయంలో సభలకు ముందు వరుసలో సీటు కేటాయింపు ఇలాంటివి ఉంటాయి.[1]

పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడును పార్లమెంటు చట్టం 1977 ప్రకారం ప్రతిపక్ష నాయకుడు జీతం, భత్యాలు 'ప్రతిపక్ష నాయకుడు' అనే పదాన్ని రాజ్యసభ సభ్యుడు లేదా లోక్‌సభ సభ్యునిగా నిర్వచిస్తుంది. అతను గొప్ప సంఖ్యాబలం ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకుడును రాజ్యసభ ఛైర్మన్ లేదా లోక్‌సభ స్పీకర్ చేత గుర్తింపు ఉంటుంది..[2] ప్రభుత్వ పరిపాలనా విధానాలపై చర్చలకు, బడ్జెటుపై అవసరమైన సమాచారం అందించబడతాయి. అధికారపార్టీపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టుటకుకొత్త చట్టాన్ని పరిశీలించడానికి కమిటీ ప్రక్రియలో భాగంగా మరింత అవకాశం, ప్రతిపక్షాలు మీడియాను చేరుకోవడానికి ఉపయోగిస్తాయి.[3]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Leader of the Opposition". aplegislature.org. Archived from the original on 2024-02-13. Retrieved 2020-08-12.
  2. "PARLIAMENT OF INDIA". legislativebodiesinindia.nic.in. Retrieved 2020-08-12.
  3. https://www.parliament.qld.gov.au/documents/explore/education/factsheets/Factsheet_3.14_RoleOfOpposition.pdf

వెలుపలి లంకెలు

మార్చు