బ్రహ్మోస్-2 లేదా బ్రహ్మోస్ మార్క్ 2 భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. NPO మషినోస్త్రోయేనియా, భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ను స్థాపించి ఈ క్షిపణిని అభివృద్ధి చేస్తున్నాయి. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణుల శ్రేణిలో ఇది రెండవ క్షిపణి. 290 కి.మీ. పరిధి కలిగిన బ్రహ్మోస్-2, మ్యాక్ 7 వేగాన్ని అందుకుంటుంది. క్షిపణి తన క్రూయిజ్ దశలో  స్క్రామ్‌జెట్  ఇంజనుతో పనిచేస్తుంది.[1][2] దీని కొలతలు, తయారీ ఖర్చు వంటి విషయాలు ఇంకా వెల్లడి కాలేదు.[3][4][5] 2017 నాటికి బ్రహ్మోస్-2 పరీక్షలకు సిద్ధంగా ఉంటుందని అంచనా.[6]

బ్రహ్మోస్-2 నమూనా బొమ్మ

రష్యా, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ లో సభ్యురాలు కావడం వలన, అక్కడి నిబంధనల ప్రకారం, 300 కి.మీ. కంటే ఎక్కువ పరిధి గల క్షిపణుల తయారీకి సంబంధించిన సాంకేతికతను ఇతర దేశాలకు ఇవ్వరాదు. అందుచేత బ్రహ్మోస్-2 క్షిపణి పరిధిని 290 కి.మీ. కు పరిమితం చేసారు.[5] దీని వేగం మాత్రం, బ్రహ్మోస్-1 కంటే రెట్టింపు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి.[7][8] బ్రహ్మోస్-2 కోసం రష్యా  ఒక ప్రత్యేకమైన, రహస్యమైన ఇంధన ఫార్ములాను తయారుచేస్తోంది.[9]

వివిధ వినియోగాల కోసం వివిధ క్షిపణుల డిజైన్ల తయారీ 2011 అక్టోబరు నాటికి పూర్తయింది. 2012 లో పరీక్షలు మొదలయ్యాయి.[10] నాలుగో తరం రష్యను నేవల్ డిస్ట్రాయర్లు (Project 21956) కూడా బ్రహ్మోస్-2 ను  వాడుతాయి.[11]

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ స్మృతిలో బ్రహ్మోస్-2 కు బ్రహ్మోస్-2 (కె) అని పేరు మార్చారు.[12]

బ్రహ్మోస్-2, రష్యా తయారు చేస్తున్న 3M22 జిర్కాన్ క్షిపణి యొక్క ఎగుమతి రూపమేనని భావిస్తున్నారు. బ్రహ్మోస్-1 కూడా రష్యావారి P-800 ఓనిక్స్ యొక్క ఎగుమతి రూపమే.[13]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Hypersonic BrahMos version missile to be ready by 2017". 28 June 2012. 
  2. "Hypersonic version of Brahmos missile on the way with Mach 7".
  3. "Brahmos to Launch Submarine Version of the Missile, Hike Up Speed to Mach 7 for Hypersonic Version" Archived 2013-04-26 at the Wayback Machine.
  4. "India, Russia work on hypersonic stealth cruise missile" Archived 2014-09-03 at the Wayback Machine. philSTAR.com. 9 October 2011.
  5. 5.0 5.1 "India, Russia to develop new hypersonic cruise missile :: BrahMos.com" Archived 2010-12-12 at the Wayback Machine. brahmos.com Official Website of Brahmos.
  6. "Russia, India to test-fly hypersonic missiles by 2017: BrahMos chief".
  7. "BrahMos 2 Hypersonic Missile to be ready in five years".
  8. "Russian-Indian JV to develop Brahmos-2 hypersonic missile" Archived 2011-11-25 at the Wayback Machine.
  9. Top Secret Fuel Formula to Accelerate Russia's Hypersonic Missiles - Sputniknews.com, 20 February 2015
  10. "BrahMos to develop first hypersonic cruise missile in 5 years".
  11. Sandeep Unnithan (18 March 2009).
  12. Singh, Rahul (8 August 2015).
  13. 3M22 Zircon Hypersonic Missile in Development Testing for Russian Navy Kirov-class Cruiser Archived 2016-03-14 at the Wayback Machine - Navyrecognition.com, 19 February 2016