క్రైస్తవ ఛాందసవాదం

క్రైస్తవ ఛాందసవాదం ఒక ఉద్యమంగా బ్రిటీషు, అమెరికా ప్రొటెస్టెంటు క్రైస్తవం నుండి ఉద్భవించింది. 19వ శతాబ్దపు చివరి భాగం నుండి 20వ శతాబ్దపు తొలినాళ్ళలో సాంప్రదాయ, ఎవాంజెలికల్ క్రైస్తవులు, ఆధునీకరణకు ప్రతిస్పందిస్తూ కొన్ని క్రైస్తవ దృఢమైన మౌలిక నమ్మకాలను క్రియాశీలకంగా ప్రచారం చేస్తూ ఆచరిస్తున్న గుంపులలో ఆధునిక క్రైస్తవ ఛాందసవాదం మొదలయ్యింది. వీరు గట్టిగా నమ్మిన నమ్మకాలలో బైబిల్ యొక్క నిష్కళంకత, బైబిల్ యొక్క దైవత్వం (సోలా స్క్రిప్చురా), యేసు యొక్క కన్యపుట్టుక, యేసు సమస్త ప్రజల పాపాలకు బదులుగా మూల్యం చెల్లించినాడన్న సిద్ధాంతము, యేసు సమాధినుండి తిరిగి లేచినాడన్న నమ్మకం, జరగబోవు యేసు యొక్క పునరాగమనం ముఖ్యమైనవి. ఈ నమ్మకాలను విశ్వసించే కొందరు ఛాందసవాదులనే ముద్రను తిరస్కరిస్తున్నారు. ఇది కేవలం చారిత్రక క్రైస్తవ బోధనలకు వెక్కిరింత మాత్రమేనని వీరి భావన.[1] మరికొందరు దీన్ని గర్వకారణమైన పతాకంగా స్వీకరిస్తున్నారు. అయితే వీరు ఫండమెంటలిస్ట్ (ఛాందసవాది) కంటే ఫండమెంటల్ (మౌలిక) అన్న పదం వైపు మొగ్గుతున్నారు.[2]

వీధుల్లో ప్రచారం చేస్తున్న క్రైస్తవ ఛాందసవాది


మూలాలు

మార్చు
  1. Robbins, Dale A., "What is a Fundamentalist Christian?" Grass Valley, CA: Victorious Publications, 1995. Available online: http://www.victorious.org/chur21.htm Archived 2008-12-27 at the Wayback Machine
  2. Horton, Ron, "BJU Statement of Christian Education" Greenville, SC: Bob Jones University. Available online: http://www.bju.edu/academics/edpurpose.html Archived 2008-12-22 at the Wayback Machine

బయటి లింకులు

మార్చు