క్లూప్ compressed loop device (cloop) కి సంక్షిప్త రూపం. ఇది లినక్స్ కెర్నెల్ లో ఆఆదించడానికి సిద్ధంగా ఉన్న మాడ్యూల్. ఈ అనువర్తనం ద్వారా డేటాను అణిచివేసే పద్ధతిని పారదర్శకం చెయ్యవచ్చు. ఇది ఒక అణిచివేయబడ్డ దస్త్ర వ్యవస్థ కాదు.

క్లూప్
సాఫ్టువేర్ అభివృద్ధికారుడురస్టీ రజెల్
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుక్లాజ్ నాపర్
Stable release
2.637-1 / 12 జనవరి 2011; 13 సంవత్సరాల క్రితం (2011-01-12)
ఫైల్ పరిమాణం338 కేబీ
రకంఆడించగల కెర్నల్ మాడ్యూల్
లైసెన్సుగ్నూ జీపీఎల్ v2[1]

క్లూప్ నిజానికి రస్టీ రజెల్ రూపొందించిన లెవంటా అనే బూట్ చెయ్యదగిన బిజినెస్ కార్డ్ కోసం వ్రాయబడింది. కానీ క్లాజ్ నాపర్ దీనిని ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. క్లూప్ ద్వారా సాంప్రదాయ నిర్వహణా వ్యవస్థలను అణిచి సీడీ మీద పట్టేలా చేయవచ్చు.

క్లూప్ ద్వారా సాధారణంగా 2.5:1 నిష్పత్తిలో ఆణిచివేయవచ్చు. నాపిక్స్ ను 700 ఎంబీ గా 1.8 జీబీ నుండి అణిచివేయవచ్చు.

ఆకృతి మార్చు

క్లూప్ లోని భాగాలు:

  • ఒక షెల్ స్క్రిప్ట్
  • ఒక హెడర్ పాఠ్యం, ఇందులో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, అణిచివేయని బ్లాక్ నిడివి ఎంత అన్న సమాచారం ఉంటుంది
  • చేరేందుకు సూచిక, ఇందులో అణిచివేసిన, అణిచివేయని స్థితులలో బ్లాక్ నిడివి జతగా పేర్కొని ఉంటుంది.
  • జెడ్‍లిబ్ - అణిచివేయబడిన డేటా బ్లాకులు, ఒకదాని వెంబడి మరొకటి

డేటా బ్లాకులను విడి విడిగా అణిచివేయడం జరుగుతుంది. అలా చేయడం వలన ప్రత్యేక డేటా బ్లాకును పరికించవచ్చు. కానీ అణిచివేసే స్థాయి తగ్గుతుంది. సీడీల్లో సాధారణంగా డేటా ను కుచించివేయడానికి, కుచించే/అణిచివేసే గతికీ సానుకూలంగా ౨౫౬ కేబీ బ్లాక్ నిడివి వాడతారు.

ఆపిల్ ఆధారిత ఉపకరణాలలో కనబడే .dmg(DMG) దస్త్రాలు ఇలాంటి పద్ధతిలోనే అణిచివేయబడతాయి.

పరిమితులు మార్చు

కంప్యూటర్ జ్ఞప్తి ఒక వేళ తక్కువ ఉన్నా, కంప్యూటర్ సామర్ధ్యం తక్కువ ఉన్నా, క్లూప్ పనితనం తగ్గిపోతుంది. ఇందుకు కారణం క్లూప్ నిర్మాణ సిద్ధాంతం లో ఉంది. క్లూప్ నిర్మాణం ప్రకారం మొత్తం అణిచివేయబడిన బ్లాక్ ను ఒక సారే డిస్క్ నుండి చదవాలి. అందువల్ల క్లూప్ ఒక్కో డిస్క్ నుండి విడి విడిగా అణిచివేయ్బడిన బ్లాక్ విభాగాలను చదవడం ఆలస్యమవుతుంది. [2]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. README లో tarball Archived 2012-03-07 at the Wayback Machine వద్ద ఇవ్వబడిన ప్రకారం.
  2. క్లూప్ పనితనం పరీక్షThinkPad T61 పై[permanent dead link]

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=క్లూప్&oldid=3877774" నుండి వెలికితీశారు