క్లైవ్ రైస్
క్లైవ్ ఎడ్వర్డ్ బట్లర్ రైస్ (23జూలై 1949 – 28 జూలై 2015) జాతి వివక్ష నుంచి విముక్తి పొందిన తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్‌గా వ్యవహరించిన మాజీ ఆల్‌రౌండర్[1].ఆయన ఫస్టు క్లాస్ క్రికెట్ లో బ్యాటింగ్ సరాసరి 22.49. ఆయన 1979-1987 మధ్య నాట్టింగమ్‌షైర్ కంట్రీ క్రికెట్ క్లబ్ కు కెప్టెన్ గా వ్యవహరించారు.
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | క్లైవ్ ఎడ్వర్డ్ బట్లర్ రైస్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | జోహన్స్బర్గ్,త్రాస్ వాల్ ప్రొవెన్సీ, యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా | 1949 జూలై 23||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2015 జూలై 28 కేప్‌టౌన్,కేప్ ప్రొవెన్సీ, దక్షిణ ఆఫ్రికా | (వయసు 66)||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి-చేతి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | రైట్ ఆర్ం ఫాస్ట్-మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆర్ రౌండర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 7) | 1991 నవంబరు 10 - భారతదేశం తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1991 నవంబరు 14 - భారతదేశం తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1992/93–1993/94 | నాటల్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1970/71–1991/92 | ట్రాన్స్‌వాల్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1988–1989 | స్కాట్‌లాండ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1987 | MCC | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1975–1987 | Nottinghamshire | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2008 జనవరి 18 |
జీవిత విశేషాలు
మార్చు1971-72 సీజన్‌లో ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యారు. అయితే అప్పటి దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుసరిస్తున్న వర్ణ వివక్ష విధానాల పట్ల వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ పర్యటన రద్దయింది. 1991 నవంబర్‌లో దక్షిణాఫ్రికా మళ్లీ అంతర్జాతీయ స్రవంతిలోకి వచ్చిన తర్వాత ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రైస్‌ను నియమించారు. ఈ జట్టు భారత్‌లో పర్యటించి మూడు అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లు ఆడింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా 1992లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్న దక్షిణాఫ్రికా జట్టు నుంచి రైస్‌ను వివాదాస్పద రీతిలో తొలగించారు. జాతి వివక్ష కారణంలో దాదాపు 20 ఏళ్లు క్లైవ్ దక్షిణాఫ్రికా దేశవాళి క్రికెట్ లోనే ఆడాడు. 1991లో దక్షిణాఫ్రికాపై అంతర్జాతీయ నిషేధం తొలగిన తర్వాత తొలి వన్డే సీరీస్ కు రైస్ కెప్టెన్ గా నిలిచాడు. 42 ఏళ్ల వయస్సులో ఆ సీరీస్ లో మూడు వన్డేలు ఆడాడు. తర్వాత 1992 వరల్డ్ కప్ కు రైస్ ను ఎంపిక చేయలేదు. అంతకు ముందు కెర్రి ప్యాకర్ వరల్డ్ సీరీస్ లో కూడా రైస్ ఆడాడు. 482 ఫస్ట్ క్లా స్ మ్యాచ్ లలో 48 సెంచరీలు చేశాడు. 930 వికెట్లు పడగొట్టాడు.[2]
మరణం
మార్చుబ్రెయిన్ ట్యూమర్ (మెదడులో కణితి)తో బాధపడుతున్న రైస్ క్రికెట్ కెరీర్‌లో ఎక్కువ భాగం దక్షిణాఫ్రికా జట్టు అంతర్జాతీయ పోటీలకు దూరమైన 20 ఏళ్ల కాలంలోనే సాగింది. 66వ పడిలో ప్రవేశించిన రైస్ బెంగళూరులో రోబోటిక్ రేడియేషన్ చికిత్స చేయించుకున్నారు. ఈ చికిత్స జరిగిన నాలుగు నెలలకే ఆయన జూలై 28 2015 మంగళవారం తన స్వదేశంలో కన్నుమూశారు.[3] [4]
మూలాలు
మార్చు- ↑ "దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ కన్నుమూత". Archived from the original on 2020-08-05. Retrieved 2015-07-30.
- ↑ "సౌతాఫ్రికా క్రికెటర్ క్లైవ్ రైస్ మృతి". Archived from the original on 2016-03-05. Retrieved 2015-07-30.
- ↑ "సఫారీ కెప్టెన్ క్లైవ్ రైస్ మృతి". Archived from the original on 2015-07-29. Retrieved 2015-07-30.
- ↑ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ క్లైవ్ రైస్ మృతి
వనరులు
మార్చు- Sproat, I. (1988) The Cricketers' Who's Who 1988, Willow Books: London. ISBN 0 00 218285 8.
ఇతర లింకులు
మార్చు- Clive Rice Sports and Bush Safaris website
- క్రిక్ఇన్ఫో లో క్లైవ్ రైస్ ప్రొఫైల్
- Sunday Times article జనవరి 3 2010 Archived 2011-06-04 at the Wayback Machine
- Fasmily tree Archived 2015-08-10 at the Wayback Machine