క్లోరిన్ పెర్క్లోరేట్

క్లోరిన్ పెర్క్లోరేట్ ఒక రసాయన సమ్మేళనం.ఈరసాయన సంయోగ పదార్థాన్ని డైక్లోరిన్‌ టెట్రాక్సైడ్ అనికూడా అంటారు.ఇది ఒక ఆకర్బన రసాయన సంయోగపదార్ధం. ఈ రసాయన సంయోగపదార్థం యొక్క రసాయన సంక్షిప్త సంకేతపదం Cl2O4.ఈ క్లోరిన్ ఆక్సైడ్ అసౌష్టవ అణునిర్మాణం కలిగిన ఆక్సైడ్.ఇందులో లోని రెండు క్లోరిన్ పరమాణువులలో ఒకటి ఆక్సీకరణస్థితి/స్థాయి+1 కలిగి ఉండగా, రెండవది +7 ఆక్సీకరణస్థితిని కలిగి ఉంది. కావున ఈ రసాయన సమ్మెళనపదార్ధం యొక్క విస్తృత సంకేతపదం ClOClO3చూపిస్తారు.గది ఉష్ణోగ్రత వద్ద క్లోరిన్ డయాక్సైడును 436 nm తరంగ పొడవు అతినీలలోహిత కాంతితో కాంతివిశ్లేషణ (photolysis) చెయ్యడం వలన క్లోరిన్ పెర్క్లోరేట్ ఉత్పత్తి అగును.

క్లోరిన్ పెర్క్లోరేట్
పేర్లు
IUPAC నామము
Chlorine perchlorate
Systematic IUPAC name
Chloro perchlorate[1]
ఇతర పేర్లు
Chlorine (I,VII) oxide
Dichlorine tetroxide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [27218-16-2]
పబ్ కెమ్ 168667
SMILES ClO[Cl](=O)(=O)=O
ధర్మములు
Cl2O4
మోలార్ ద్రవ్యరాశి 134.90 g·mol−1
స్వరూపం Pale green liquid
సాంద్రత 1.81 g cm−3
ద్రవీభవన స్థానం −117 °C (−179 °F; 156 K)
బాష్పీభవన స్థానం 20 °C (68 °F; 293 K) (decomposes)
Reacts
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు oxidizer
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references
2 ClO2 → ClOClO3

ఈ దిగువన చూపిన రసాయనప్రక్రియ ప్రకారం (మైనస్) −45 °C వద్ద రసాయనచర్య జరిగేలా చేసిన క్లోరిన్ పెర్క్లోరేట్ ఉత్పత్తిఅగును.

CsClO4 + ClOSO2F → Cs(SO3)F + ClOClO3

క్లోరిన్ పెర్క్లోరేట్ పాలిపోయిన ఆకుపచ్చరంగులో ఉండు ద్రవం. గదిఉష్ణోగ్రతవద్ద ఈ రసాయన సంయోగపదార్ధం వియోగం/విఘటన చెందును.

రసాయనలక్షణాలు

మార్చు

క్లోరిక్ ఆక్సైడు కన్న క్లోరిన్ పెర్క్లోరేట్ తక్కువ స్థిరత్వం కలిగి, గది ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్, క్లోరిన్, డైక్లోరిన్ హెక్సాక్సైడు (Cl2O6 ) గా వియోగం చెందును.

2 ClOClO3 → O2 + Cl2 + Cl2O6

లోహ క్లోరైడులతో క్లోరిన్ పెర్క్లోరేట్‌చర్య వలన నిర్జల పెర్క్లోరేటులు ఏర్పడును.

CrO2Cl2 + 2 ClOClO3 → 2 Cl2 + CrO2(ClO4)2
TiCl4 + 4 ClOClO3 → 4 Cl2 + Ti(ClO4)4

భౌతిక లక్షణాలు

మార్చు

క్లోరిన్ పెర్క్లోరేట్ పాలిపోయిన ఆకుపచ్చరంగులో ఉండు ద్రవం. క్లోరిన్ పెర్క్లోరేట్ యొక్క అణుభారం134.90 గ్రాములు/మోల్.ఈఈ రసాయన పదార్థం యొక్క సాంద్రత1.81 గ్రాములు/సెం.మీ3.క్లోరిన్ పెర్క్లోరేట్ యొక్క ద్రవీభవన స్థానంమైనస్−117 °C (−179 °F; 156K).ఈసంమ్మేళన పదార్థం యొక్క బాష్పీభవన స్థానం20°C (68 °F; 293 K) (వియోగం చెందును.).నీటితో చర్య జరుపును.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Chloro Perchlorate - PubChem Public Chemical Database". The PubChem Project. USA: National Center for Biotechnology Information.