ఖగెన్ దాస్
ఖగెన్ దాస్ (4 సెప్టెంబర్ 1937 - 21 జనవరి 2018) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన త్రిపుర శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పని చేసి, త్రిపుర పశ్చిమ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ఖగెన్ దాస్ | |||
పదవీ కాలం 2002-2014 | |||
ముందు | సమర్ చౌదరి | ||
---|---|---|---|
తరువాత | శంకర్ ప్రసాద్ దత్తా | ||
నియోజకవర్గం | త్రిపుర పశ్చిమ | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1998-2002 | |||
త్రిపుర రాష్ట్ర రెవెన్యూ, ఆరోగ్యం & గణాంకాల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1983-1988 | |||
పదవీ కాలం 1978-1988 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కొమిల్లా , భారతదేశం | 1937 సెప్టెంబరు 4||
మరణం | 2018 జనవరి 21 కోల్‌కతా | (వయసు 80)||
రాజకీయ పార్టీ | సీపీఐ (ఎం) | ||
జీవిత భాగస్వామి | అనుపమా దాస్ | ||
సంతానం | 2 కుమార్తెలు | ||
నివాసం | అగర్తల | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చుఖగెన్ దాస్ మజ్లిష్పూర్ నియోజకవర్గం నుండి 1978 నుండి 1988 వరకు రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై 1983 నుండి 1988 వరకు రాష్ట్ర ఆరోగ్య, గణాంకాలు & రెవెన్యూ మంత్రిగా పని చేశాడు. ఆయన 1993 నుండి 1998 వరకు అప్పటి త్రిపుర ముఖ్యమంత్రి దశరథ్ దేబ్‌కు రాజకీయ కార్యదర్శిగా పని చేశాడు. ఖగెన్ దాస్ 1998 నుండి 2002 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఆ తరువాత త్రిపుర పశ్చిమ నుండి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన 2006లో త్రిపుర లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్గాఎన్నికై మరణించే వరకు ఆ హోదాలో పని చేశాడు.
మరణం
మార్చుఖగెన్ దాస్ సీపీఎం పార్టీ మూడు రోజుల సెంట్రల్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు కోల్‌కతాలో వెళ్లగా 21 జనవరి 2018న ఛాతీ నొప్పి రావడంతో ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు గుండెపోటుతో మార్గమధ్యలో మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1][2]
మూలాలు
మార్చు- ↑ The New Indian Express (21 January 2018). "Veteran CPI (M) leader Khagen Das dies at 80, body to be donated to Tripura medical college" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
- ↑ "Veteran CPI-M leader, ex-MP Khagen Das dead" (in ఇంగ్లీష్). 21 January 2018. Retrieved 28 September 2024.