ఖనిజ తైలం
ఖనిజ తైలం అనునది రంగు, సువాసన లేని నూనె. ఇది పెట్రోలియం ఆంశిక స్వేదనంలో యేర్పడిన C15 నుండి C40 వరకు గల ఆల్కేన్ల మిశ్రమం[1]. ఇది ఆహారంగా తీసుకునే శాకాహార నూనెకు భిన్నంగా ఉంటుంది.
దీనికి వైట్ ఆయిల్, పారాఫిన్ ఆయిల్, లిక్విడ్ పారాఫిన్ (అత్యంత శుద్ధి చేసిన మెడికల్ గ్రేడ్), పారాఫినమ్ లిక్విడమ్ (లాటిన్), లిక్విడ్ పెట్రోలియం అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. బేబీ ఆయిల్ ఒక సుగంధ ఖనిజ నూనె.
చాలా తరచుగా, మినరల్ ఆయిల్ గ్యాసోలిన్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేయడానికి, ముడి చమురును శుద్ధి చేసే ప్రక్రియలో ఏర్పడిన ద్రవ ఉప ఉత్పత్తి. ఈ రకమైన ఖనిజ నూనె పారదర్శక, రంగులేని నూనె, ఇది ప్రధానంగా ఆల్కనేస్, పెట్రోలియం జెల్లీకి సంబంధించిన సైక్లోఅల్కేన్లతో కూడి ఉంటుంది. దీని సాంద్రత 0.8–0.87 g/cm3 [2]
రకాలు
మార్చుఇది మూడు రకాలు
- పారఫీన్ నూనెలు.
- నాఫ్తేనిక్ నూనెలు
- అరోమాటిక్ నూనెలు
మూలాలు
మార్చు- ↑ Mineral oil (Dictionary.com) Archived 30 సెప్టెంబరు 2015 at the Wayback Machine
- ↑ "Mechanical properties of materials". Kaye and Laby Tables of Physical and Chemical Constants. National Physical Laboratory. Archived from the original on 11 March 2008. Retrieved 2008-03-06.