ఖాందేవ్ జాతర తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఖాందేవ్ జాతర జరుగుతుంది. [1][2] గోండు తెగలోని తొడసం గోత్రం వంశీయులు పూజారులుగా ఉంటారు. పుష్యమాసంలో జాతర ముగింపుతో ఆదివాసీలు కేస్లాపూర్ నాగోబా జాతర కు బయలుదేరడం ఆనవాయితీ.

ఖాందేవ్ జాతర
ఖాందేవ్ దేవాలయం
ఖాందేవ్ దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్
ప్రదేశం:నార్నూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఖాందేవ్

చరిత్ర

మార్చు

ఖాందేవ్ దేవాలయంలో ఆరాధ్యదైవం పులి, 18 ప్రతిమల సముదాయాన్ని ఖాందేవుడిగా, ఏనుగులను కుల దైవాలుగా ఆరాధిస్తుంటారు. పూర్వం 2023 నాటికి సుమారు 500 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో తొడసం వంశీయులు యుద్ధంలో విజయం సాధించి నార్నూర్ కు వచ్చి జాతర జరుపుకున్నారు. అప్పటి నుండి ఈ జాతర పూర్వీకుల నుంచి తరతరాలుగా ఆదివాసీలకు సంప్రదాయంగా వస్తుంది.

సంప్రదాయాలు

మార్చు

తొడసం వంశ ఆడపడుచు 2 కిలోల నువ్వుల నూనె తాగే మొక్కు మొక్కుతుంటారు.[3][4] మూడేళ్లకోసారి ఒకరు మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. పుష్య మాసంలో నెలవంక కనిపించిన తరువాత తాము పండించిన నువ్వులను గానుగతో నూనె సేకరించి, ఖాందేవ్ మొక్కు కోసం ఒక్కొక్కరి ఇంటి నుంచి నువ్వుల నూనె తీసుకు వస్తారు. అలా తీసుకొచ్చిన నువ్వుల నూనెను ముందుగా ఖాందేవ్, పులి, ఏనుగు, దేవుళ్ళులకు చూపించి, కటోడ పూజారి సమక్షంలో నైవైద్యం పెట్టి, నూనె మొక్కును ప్రారంభిస్తారు. తొడసం వంశంలో పుట్టిన ఆడపడుచు పెళ్లైన తరువాత ఇంటి పేరు మారినా ఆమె పుట్టిన వంశ ఆడపడుచుగానే మొక్కును చెల్లిస్తుంది. కొత్తగా వివాహమైన తొడసం వధువులకు ఖాందేవ్ వద్ద భేటింగ్ కార్యక్రమం ఉంటుంది.[5]

మూలాలు

మార్చు
  1. TM-Team (2023-01-07). "నార్నూర్ మండల కేంద్రంలో ప్రారంభమయిన ఖాందేవ్ జాతర -". Archived from the original on 2024-01-31. Retrieved 2024-01-31.
  2. "భక్తి శ్రద్ధలతో ఖాందేవుడి జాతర". 27 January 2024.
  3. "నూనె తాగి.. మొక్కు తీర్చి". Sakshi. 2023-01-08. Retrieved 2024-01-31.
  4. Desam, A. B. P. (2024-01-27). "జాతరలో వింత ఆచారం - నువ్వుల నూనెను నీళ్లలా తాగేసిన తొడసం వంశీయురాలు, ఎక్కడంటే?". telugu.abplive.com. Retrieved 2024-01-31.
  5. Basha (2023-01-06). "ఖాందేవ్ జాతర ఎప్పటినుంచి మొదలై.. ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే." TeluguStop.com. Retrieved 2024-03-29.