పుష్యమాసం
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
పుష్య మాసం తెలుగు సంవత్సరంలో పదవ నెల. పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రము (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల పుష్యము.
విశేషాలు
మార్చు- కర్ణాటక సంగీతంలో నాదబ్రహ్మగా కొనియాడబడిన త్యాగరాజు వారి సంస్మరణార్ధం ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి రోజున తిరువాయూర్ లో త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కొన్ని వేల మంది ఈ సంగీత మహోత్సవంలో పాల్గొంటారు. మన్మధ నామ సంవత్సరంలో ఇదే రోజు (సా.శ.. 1775) మరొక కర్ణాటక సంగీత చక్రవర్తి ముత్తుస్వామి దీక్షితార్ జన్మించారు.
- ఆంధ్రులకు పెద్ద పండుగైన సంక్రాంతి ఈ మాసంలోనే జరుపుకుంటారు.
- అయ్యప్ప స్వామి దీక్ష కార్తీకమాసములో ప్రారంభమై పుష్యమిలో కూడా నడుస్తుంది.
- రుధిరోద్గారి నామ సంవత్సరం (క్రీ. శ. 1924) లో దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారిచే భారతి (మాస పత్రిక) స్థాపించబడింది.
- రామాయణంలో శ్రీరాముడు ఉత్తరఫల్గునీ నక్షత్రయుక్తమగు అష్టమినాడు బయలుదేరి యేడుదినములు సముద్రతీరమున స్కందావారముననుండి పుష్య శుద్ధ ప్రతిపత్తు మొదలు తదియ వరకు సేనలు నడపి సముద్రము జేరి చవితినాడు విభీషణునకు శరణొసగి పంచమినాడు మొదలు నాలుగు దినములు ప్రాయోపవేశము గావించెను. సముద్రుడు వర మొసగ దశమినాడు సేతువును గట్ట నారంభించి త్రయోదశికి బూర్తిచేసి చతుర్దశినాడు సైన్యమును సువేలాద్రి జేర్చెను. పూర్ణిమ మొదలు విదియవరకు రాముడు సపరివారముగా సముద్రము దాటి దశమివరకు నెనిమిది దినములు లంకావరొధము గావించెను. ఏకాదశినాడు శుకసారణులరాకయు ద్వాదశినాడు సైన్యసమీకరణము త్రయోదశి మొదలు అమావాస్య వరకు మూడు దినములు సైన్యము లెక్కించుటజరుగ నుత్సాహము నందెను.[1]
- సా.శ.. 1894 : విజయ నామ సంవత్సరంలో తిరుపతి వేంకట కవులు నెల్లూరులో అష్టావధానము చేశారు.[2]
- సా.శ.. 1895 : మన్మథ నామ సంవత్సరం క్రొత్తపల్లెలో శ్రీ రావు జగ్గారాయనింగారు తిరుపతి వేంకట కవులు చేత శతావధానము చేయించారు.[3]
పండుగలు
మార్చుమూలాలు
మార్చు- ↑ బులుసు, వేంకటేశ్వర్లు (1988). అరణ్యక మహర్షి, మహర్షుల చరిత్రలు. తిరుమల తిరుపతి దేవస్థానములు. p. 5. Retrieved 25 June 2016.[permanent dead link]
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 25. Retrieved 27 June 2016.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 49. Retrieved 27 June 2016.[permanent dead link]