ఖాజీపురం (బేస్తవారిపేట)
ఖాజీపురం ప్రకాశం జిల్లా, బేస్తవారిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..
ఖాజీపురం (బేస్తవారిపేట) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°26′48.588″N 79°7′3.180″E / 15.44683000°N 79.11755000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | బేస్తవారిపేట |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చుఓసూరమ్మ చెరువు:- ఖాజీపురం గ్రామ సమీపాన ఉన్న ఈ చెరువుకు నల్లగొండ వాగు నుండి నీరు వచ్చును. ఈ చెరువు నీటి వలన ఖాజీపురం, ఎంపీచెరువు, కొత్తపేట, బసినేపల్లి గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి వునురు సత్యనారాయణమ్మ సర్పంచిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ నారాయణస్వామివారి ఆలయం
మార్చుగ్రామములో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2017,జూన్-11వతేదీ ఆదివారంనాడు విగ్రహప్రతిష్ఠ నిర్వహించినారు. ప్రాణప్రతిష్ఠ, పూర్ణాహుతి హోమం నిర్వహించినారు. భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. మూడురోజులపాటు ప్రత్యేకప్రతిష్ఠా పూజలు నిర్వహించినారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు.
గ్రామ ప్రముఖులు
మార్చుఈ గ్రామానికి చెందిన శ్రీ పడిగిరెడ్డి కాశిరెడ్డి, శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగు స్టేషనులో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ మధ్యన ఈ రాకెట్ కేంద్రము నుండి ప్రయోగించిన అంగారక యాత్రకు పంపిన మంగళయాన్ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఇంకా వీరు PSLV-C 25 తయారీలో గూడా పాల్గొన్నారు. వీరు సర్కారీ చదువునుండి శాస్త్రవేత్తగా ఎదిగారు.