అహ్సానుల్లా

(ఖాన్ బహదూర్ అహ్సానుల్లా నుండి దారిమార్పు చెందింది)

ఖాన్ బహదూర్ అహ్సానుల్లా ( 1873 డిసెంబరు 27 – 1965 ఫిబ్రవరి 9)  దేశ విభజనకు ముందు భారతదేశానికి చెందిన విద్యావేత్త, సాహితీవేత్త, ఇస్లామిక్ వేదాంతవేత్త, సంఘ సంస్కర్త. అహ్సానుల్లా అవిభక్త బెంగాల్, అస్సాంలలో విద్యా శాఖ సహాయ సంచాలకుడిగా సూఫీ ఆలోచనాపరునిగా బెంగాల్ లోని ముస్లిములలో ఖ్యాతి పొందిన మహనీయుడు.

ఖాన్ బహదూర్ అహ్సానుల్లా
খান বাহাদুর আহ্‌ছানউল্লাহ
జననం(1873-12-27)1873 డిసెంబరు 27
మరణం1965 ఫిబ్రవరి 9(1965-02-09) (వయసు 91)
Nalta Sharif, Satkhira, East Pakistan, Pakistan
ఇతర పేర్లుSultanul Aaulia Kutubul Aktab Gause Jaman Aref Billah Hazrat Shah-Sufi Aalhaaj Khan Bahadur Ahsanullah Warsi
వృత్తిEducator
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Founder of Nalta Central Ahsania Mission, Dhaka Ahsania Mission and Co-Founder of University of Dhaka

జీవితం

మార్చు

ఖాన్ బహదూర్ అహ్సానుల్లా నల్టా అనే గ్రామంలో జన్మించాడు.  గతంలో ఖుల్నా కింద ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని సాత్ఖిరా జిల్లాలో ఉంది.  తండ్రి మున్షీ మహమ్మద్ మొఫిజుద్దీన్ ధనవంతుడు. అతని విద్యాభ్యాసం ఐదు సంవత్సరాల వయస్సులోనే ప్రారంభం అయినది. ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తయిన తరువాత, నల్టాలోని మిడిల్ ఇంగ్లిష్ స్కూల్ లో, కొంతకాలం తరువాత, అతను పశ్చిమ బెంగాల్ లోని టేకీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాల్గవ తరగతి (ప్రస్తుతం ఏడవ తరగతికి సమానం) లో చేరాడు. ఈ పాఠశాలలో అన్ని తరగతులలో ప్రథమ శ్రేణిలో ఉంటూ, సంవత్సరాంతంలో కలకత్తాలోని ఎల్.ఎం.ఎస్.ఇనిస్టిట్యూషన్ (లండన్ మిషనరీ స్కూల్) లో, సెకండరీ విద్య పరీక్షలో  ఉత్తీర్ణుడై  ఉపకార వేతనాన్ని (స్కాలర్ షిప్ )  పొందాడు. అతడు 1892 లో హూగ్లీ కళాశాల నుండి  హైయర్ సెకండరీ విద్యను, 1894 లో కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి బ్యాచలర్ ఆఫ్ ఆర్ట్స్ ( బి.ఏ) పట్టాను, 1895 లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎం.ఎ) పట్టాను పొందడం జరిగింది.[1]

ఢాకా అహ్సానియా మిషన్

మార్చు

ఢాకా అహ్సానియా మిషన్ అనేది ఖాన్ బహదూర్ అహ్సానుల్లా స్థాపించిన ప్రభుత్వేతర అభివృద్ధి సంస్థ.  మిషన్  ఉద్దేశం  'దైవిక, మానవతా సేవ', మానవులలో  సామాజిక, ఆధ్యాత్మిక అభివృద్ధి  లక్ష్యాలను పెట్టుకొని,  1958 సంవత్సరంలో మిషన్ స్థాపించాడు. ఢాకా అహ్సానియా మిషన్ సంస్థ స్థాపించిన వాటిలో సమాజముకు కావలసిన వైద్య, సాంకేతిక కళాశాలలు, వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించిన విద్యలలో నెలకొలిపిన  అహ్సానుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఏయూఎస్టీ), ఖాన్ బహదూర్ అహసానుల్లా టీచర్స్ ట్రైనింగ్ కాలేజ్ (కేఏటీసీ), అహ్సానియా మిషన్ కాలేజ్ (ఏఎంసీ), అహసానుల్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఏఐఐసీటీ), అహ్సానియా మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ (ఏఐఎంఐఎంటీ), అహ్సానియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ బిజినెస్ (ఏఐటీబీ), అహ్సానియా ఇ-సొల్యూషన్స్ (ఏఈఎస్), అహ్సానియా మిషన్ బుక్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ (ఏఎంబీడీహెచ్), అహ్సానియా మిషన్ బుక్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ (ఏఎంబీహెచ్), అహ్సానియా మిషన్ బుక్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ (ఏఎంబీహెచ్), అహ్సానియా మిషన్ బుక్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ (ఏఎంబీహెచ్), అహ్సానియా మిషన్ బుక్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ (ఏఎంబీడీహెచ్), అహ్సానియా మిషన్ అండ్ జనరల్ హాస్పిటల్ (ఏఎంబీడీహెచ్),  ఇవియే గాక  ఎన్.సి.ఎ.ఎం. ఢాకాలో నల్తా షరీఫ్ అహ్సానియా మిషన్ అనాథాశ్రమం (ఎన్.ఎస్.ఎ.ఎం.ఒ) ను స్థాపన చేయడం జరిగింది.[2]

గౌరవం

మార్చు

అహ్సానుల్లా చేసిన సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం 1929 సంవత్సరంలో ఆయనకు "ఖాన్ బహదూర్" అనే బిరుదును ప్రదానం చేసింది.[3] అవిభాజ్య బెంగాల్ లోని హిందువులు, ముస్లింలలో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ లో చేరిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. కలకత్తా విశ్వవిద్యాలయానికి సెనేటర్ గా పనిచేసి, ఢాకా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనే ఉద్యమంలో ముఖ్యంగా క్రియాశీలకంగా వ్యవహరించాడు.

ఖాన్ బహదూర్ అహ్సానుల్లా 1965 ఫిబ్రవరి 9న మరణించారు

మూలాలు

మార్చు
  1. "Founder | Dhaka Ahsania Mission". www.ahsaniamission.org.bd (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-09-18. Retrieved 2022-04-01.
  2. "About Us | Dhaka Ahsania Mission". www.ahsaniamission.org.bd (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-09-09. Retrieved 2022-04-01.
  3. "Ahsanullah, Khan Bahadur - Banglapedia". en.banglapedia.org (in ఇంగ్లీష్). Retrieved 2022-04-01.