ఖుష్దిల్ షా

పాకిస్తానీ క్రికెట్ క్రీడాకారుడు

ఖుష్దిల్ షా (జననం 1995, ఫిబ్రవరి 7) పాకిస్తానీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను సమాఖ్య పరిపాలనలో ఉన్న గిరిజన ప్రాంతాలకు ఆడాడు.[2] పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్ తరపున ఆడాడు. 2019 నవంబరులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.

ఖుష్దిల్ షా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఖుష్దిల్ షా
పుట్టిన తేదీ (1995-02-07) 1995 ఫిబ్రవరి 7 (వయసు 29)
బన్నూ, ఖైబర్ పఖ్తుంఖ్వా , పాకిస్తాన్
ఎత్తు5 ft 10 in (178 cm)[1]
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రMiddle-order batter
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 228)2020 నవంబరు 3 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2022 ఆగస్టు 21 - నెదర్లాండ్స్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.72
తొలి T20I (క్యాప్ 83)2019 నవంబరు 8 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2022 అక్టోబరు 2 - ఇంగ్లాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.72
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2014–2019Fata Cheetas
2015–2019FATA
2017–2018పెషావర్ జాల్మి
2019–2020Khyber Pakhtunkhwa
2020–presentముల్తాన్ సుల్తాన్స్
2023–presentSouthern పంజాబ్
2023-presentComilla విక్టోరియాns
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 10 24 29 74
చేసిన పరుగులు 199 309 1,418 2,535
బ్యాటింగు సగటు 33.2 20.6 25.78 42.96
100లు/50లు 0/0 0/0 2/7 8/13
అత్యుత్తమ స్కోరు 41* 36* 122 154*
వేసిన బంతులు 96 12 178 1,901
వికెట్లు 2 4 48
బౌలింగు సగటు 53.50 23.25 36.43
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/50 3/42 4/39
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 2/– 34/– 26/–
మూలం: Cricinfo, 2 అక్టోబర్ 2022

దేశీయ క్రికెట్ మార్చు

2018 ఏప్రిల్ లో 2018 పాకిస్తాన్ కప్ కోసం బలూచిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[3][4] 2018–19 క్వాయిడ్-ఎ-అజామ్ వన్ డే కప్‌లో ఫెడరల్ అడ్మినిస్ట్రేడ్ ట్రైబల్ ఏరియాస్ తరపున ఏడు మ్యాచ్‌లలో 463 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[5]

2019 మార్చిలో 2019 పాకిస్తాన్ కప్ కోసం ఖైబర్ పఖ్తున్ఖ్వా జట్టులో ఎంపికయ్యాడు.[6][7] 2019 ఏప్రిల్ 5న టోర్నమెంట్‌లో పంజాబ్‌పై అజేయంగా 154 పరుగులు చేశాడు.[8]

2020 అక్టోబరు 9న 2020–21 జాతీయ టీ20 కప్‌లో ఒక మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీని సాధించి, వేగంగా సెంచరీ సాధించిన పాకిస్తానీ బ్యాట్స్‌మన్ గా నిలిచాడు.[9]

అంతర్జాతీయ క్రికెట్ మార్చు

2018 డిసెంబరులో 2018 ఏసిసి ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[10]

2019 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ కోసం పాకిస్తాన్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[11][12] 2019 నవంబరు 8న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన టీ20 అరంగేట్రం చేసాడు.[13] 2019 డిసెంబరులో బంగ్లాదేశ్‌లో 2019 ఏసిసి ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[14]

2020 జూన్ లో కరోనా-19 సమయంలో ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ పర్యటన కోసం అతను 29 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు.[15][16] 2020 అక్టోబరులో జింబాబ్వేతో పాకిస్తాన్ స్వదేశీ సిరీస్ కోసం 22 మంది "ప్రాబబుల్స్" జట్టులో ఎంపికయ్యాడు.[17][18] 2020 అక్టోబరు 29న జింబాబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్‌కు పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[19] 2020 నవంబరు 3న జింబాబ్వేపై పాకిస్తాన్ తరపున వన్డే అరంగేట్రం చేసాడు.[20] 2020 నవంబరులో న్యూజిలాండ్ పర్యటన కోసం పాకిస్తాన్ 35 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు.[21]

2021 సెప్టెంబరులో 2021 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[22]

2022 ఆగస్టులో 2022 ఆసియా కప్ కోసం పాకిస్తాన్ జట్టులో షా ఎంపికయ్యాడు. 2020 సెప్టెంబరులో 2022 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.

మూలాలు మార్చు

  1. "Khushdil Shah's profile on CREX".
  2. "Khushdil Shah". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  3. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 2023-09-04.
  4. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 2023-09-04.
  5. "Quaid-e-Azam One Day Cup, 2018/19 - Federally Administered Tribal Areas: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  6. "Federal Areas aim to complete hat-trick of Pakistan Cup titles". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  7. "Pakistan Cup one-day cricket from April 2". The International News. Retrieved 2023-09-04.
  8. "Khushdil Shah's 154 not out seals memorable win for Khyber Pakhtunkhwa". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  9. "Khushdil Shah sets new record of fastest T20 century by a Pakistani". Geo Super. Retrieved 2023-09-04.
  10. "Pakistan squad announced for Emerging Asia Cup 2018 to Co-Host by Pakistan and Sri Lanka". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  11. "Fresh look to Test and T20I sides as Pakistan begin life after Sarfaraz Ahmed". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  12. "Pakistan names exciting young fast bowling stars Musa and Naseem for Australia Tests". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  13. "3rd T20I (D/N), Pakistan tour of Australia at Perth, Nov 8 2019". ESPN Cricinfo. Retrieved 8 November 2019.
  14. "Saud Shakeel named Pakistan captain for ACC Emerging Teams Asia Cup 2019". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  15. "Haider Ali the new face as Pakistan name 29-man touring party for England". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  16. "Haider Ali named in 29-player squad for England tour". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  17. "Abdullah Shafiq in Pakistan probables for Zimbabwe series". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  18. "Amir dropped, Uncapped Shafique in Pakistan squad for Zimbabwe series". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  19. "Haider Ali, Abdullah Shafiq cut from squad for Friday's 1st ODI against Zimbabwe". Geo Super. Retrieved 2023-09-04.
  20. "3rd ODI (D/N), Rawalpindi, Nov 3 2020, Zimbabwe tour of Pakistan". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  21. "Pakistan name 35-player squad for New Zealand". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  22. "Sharjeel Khan dropped from T20 World Cup squad; Asif Ali, Khushdil Shah make 15-man cut". ESPN Cricnfo. Retrieved 2023-09-04.

బాహ్య లింకులు మార్చు