ఖోవాయ్ జిల్లా

త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా.

ఖోవాయ్ జిల్లా, త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా. 2012, జనవరి నెలలో త్రిపురలో ఏర్పాటు చేసిన నాలుగు కొత్త జిల్లాల్లో ఇది ఒకటి. ఖోవాయ్ పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది.[1] పశ్చిమ త్రిపుర జిల్లా నుండి ఈ జిల్లా ఏర్పాటు చేయబడింది.[2] జిల్లాను ఖోవాయ్, తేలియామురా అనే రెండు ఉపవిభాగాలుగా విభజించారు.[3][4]

ఖోవాయ్ జిల్లా
త్రిపుర జిల్లా
త్రిపురలో ప్రాంతం ఉనికి
త్రిపురలో ప్రాంతం ఉనికి
Coordinates (ఖోవాయ్): 23°53′51″N 91°38′14″E / 23.8974°N 91.6372°E / 23.8974; 91.6372
దేశంభారతదేశం
రాష్ట్రంత్రిపుర
ఏర్పాటుజనవరి 2012 (2012-01)
ముఖ్య పట్టణంఖోవాయ్
తహసీల్1. ఖోవాయ్
2. తేలియామురా
విస్తీర్ణం
 • మొత్తం1,377.28 కి.మీ2 (531.77 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం3,27,564
జనాభా
 • అక్షరాస్యత87.78
 • స్త్రీ పురుష నిష్పత్తి957
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Average annual precipitation2570 mm

పద వివరణ

మార్చు

ఖోవాయ్ నది నుండి ఈ జిల్లాకు ఖోవాయ్ అనే పేరు వచ్చింది. ఈ నది ఉత్తర-దక్షిణ దిశలో దాదాపు జిల్లా అంతటా ప్రవహిస్తోంది.[1]

భౌగోళికం

మార్చు

ఖోవాయి జిల్లా తూర్పు వైపు దలై జిల్లాలోని కమల్‌పూర్ ఉపవిభాగం, పశ్చిమం వైపు పశ్చిమ త్రిపుర జిల్లాలోని సదర్ ఉపవిభాగం, దక్షిణం వైపు గోమతి జిల్లాలోని అమర్‌పూర్ ఉపవిభాగం, ఉత్తరం వైపు బంగ్లాదేశ్ దేశ సరిహద్దు ఉన్నాయి.

ఈ జిల్లా పరిధిలో 55 గ్రామ పంచాయితీలు, 2 మున్సిపాలిటీలు (ఖోవాయ్, తేలియామురా) ఉన్నాయి. 69 గ్రామ కమిటీలు ఏడీసీ పరిధిలోకి వస్తాయి.[5]

విభాగాలు

మార్చు

ఈ జిల్లా ఖోవాయ్ ఉపవిభాగం, తేలియామురా ఉపవిభాగం అని రెండు ఉపవిభాగాలుగా విభజించబడింది.[3][4] జిల్లాను ఖోవయ్, పద్మబిల్, తులశిఖర్, కల్యాణ్‌పూర్, తేలియామురా, ముంగియాకుమి అనే 6 బ్లాక్‌లుగా విభజించారు.

రవాణా

మార్చు
రైలుమార్గం

ఈశాన్య సరిహద్దు రైల్వే ఆధ్వర్యంలోని లమ్డింగ్-సబ్రూమ్ మార్గం ఖోవాయ్ జిల్లా మీదుగా వెళుతోంది. జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషనైన తేలియామురా రైల్వే స్టేషను నుండి త్రిపుర రాజధాని అగర్తలా, అస్సాంలకు రైలు సౌకర్యం ఉంది.

పర్యాటక ప్రాంతాలు

మార్చు

ఖోవాయ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు[5]:-

  1. బారామురా ఎకో పార్క్
  2. చక్మఘాట్ పార్క్, తేలియామురా
  3. బనబితి ఎకో పార్క్, పద్మాబిల్, ఖోవాయ్
  4. జంగల్ మహల్, ఖోవాయ్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Districts of India - Khowai district : Tripura". Districts of India Portal -National Informatics Centre. Archived from the original on 24 జనవరి 2019. Retrieved 30 December 2020.
  2. "Four new districts for Tripura - Plan for six more subdivisions to decentralise administration". The Telegraph India online. 27 October 2011. Retrieved 30 December 2020.
  3. 3.0 3.1 "Khowai District Profile - 2016-2017" (PDF). Retrieved 30 December 2020.
  4. 4.0 4.1 "Tripura Gazette - Creation of New Khowai district" (PDF). Retrieved 30 December 2020.
  5. 5.0 5.1 "Khowai district website".

ఇతర లంకెలు

మార్చు