గోమతి జిల్లా
గోమతి జిల్లా, త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా. 2012, జనవరి నెలలో త్రిపురలో ఏర్పాటు చేసిన నాలుగు కొత్త జిల్లాల్లో ఇది ఒకటి. ఉదయ్‌పూర్ దీని ముఖ్య పట్టణం. ఈ జిల్లాలోని మాతా త్రిపుర సుందరి ఆలయం ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. ఉదయ్‌పూర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాతాబారి వద్ద ఈ దేవాలయం ఉంది. భారతదేశంలోని 51 మహాపీఠాలలో ఈ ఆలయం ఒకటి. త్రిపుర దేశీయ జానపద కథలు, సంస్కృతి, మతపరమైన ఆచారాలకు సంబంధించిన బొమ్మలు ఇక్కడ ఉన్నాయి.
గోమతి జిల్లా | |
---|---|
త్రిపుర జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | త్రిపుర |
ఏర్పాటు | జనవరి 2012 |
ముఖ్య పట్టణం | ఉదయ్‌పూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,522.8 కి.మీ2 (588.0 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 4,41,538 |
జనాభా | |
• అక్షరాస్యత | 100% [1] |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
భౌగోళికం
మార్చుపచ్చని, సారవంతమైన గోమతి లోయలతో ఈ గోమతి జిల్లా ఉంది. జిల్లాలోని ఉదయ్‌పూర్, అమర్‌పూర్ ఉపవిభాగాల చుట్టూ కొండలపై చెక్కబడిన సున్నితమైన శిల్పకళా రచనలతో అత్యున్నత డెబ్టమురా కొండ శ్రేణి ఉంది.[2] జిల్లాలో ఒకేఒక మున్సిపాలిటీ (ఉదయ్‌పూర్ మున్సిపాలిటీ) ఉంది. ఈ జిల్లా పరిధిలో 173 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 16 పోలీస్ స్టేషన్లు సేవలు అందిస్తున్నాయి.
విభాగాలు
మార్చుగోమతి జిల్లాలో ఉదయ్‌పూర్ ఉపవిభాగం, అమర్పూర్ ఉపవిభాగం, కార్బుక్ ఉపవిభాగం అనే 3 ఉపవిభాగాలు ఉన్నాయి. గోమతి జిల్లా పరిధిలో మాతాబారి, టెపానియా, కిల్లా, కాక్రాబన్, అమర్‌పూర్, ఓంపి, కార్బుక్, సిలాచారి అనే 8 బ్లాక్‌లు ఉన్నాయి.[3]
పర్యాటక ప్రదేశాలు
మార్చుగోమతి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు[4]:-
- త్రిపురేశ్వరి మందిర్: జిల్లాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ ఆలయాన్ని 1501లో మహారాజా ధన్య మణిక నిర్మించాడు.
- భువనేశ్వరి ఆలయం: భువనేశ్వరి దేవికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో మహారాజా గోవింద మాణిక్య నిర్మించాడు.[5] గోమతి నది పక్కన ఉన్న ఈ ఆలయం, శిథిలావస్థలో ఉన్న పాత రాజభవనానికి దగ్గరగా ఉంది.
- పాత రాజ్‌బరి: కవిగురువు రవీంద్రనాధ టాగూరు ఈ స్థలాన్ని సందర్శించాడు. ఉదయ్‌పూర్ రాష్ట్ర రాజధానిగా ఉన్నప్పుడు ఈ రాజ్‌బరి నిర్మించారు.
- గుణబతి ఆలయం: దీనిని గుణబతి మందిర్ గుచ్చా అని పిలుస్తారు. ఇది మూడు దేవాలయాల సమూహంగా ఉంది. ఇందులోని ఒక ఆలయపు రాతి-శాసనం సా.శ. 1668లో హైనెస్ మహారాణి గుణబతి (మహారాజా గోవింద మణిక భార్య) పేరిట నిర్మించబడిందని తెలుపుతుంది.
- చోబిమురా: గోవి నది ఒడ్డున రాతిలో చెక్కిన దేవి దుర్గా, ఇతర దేవతల చిత్రాలు ఇక్కడ ఉన్నాయి.
- టెపానియా ఎకో పార్క్: 8వ జాతీయ రహదారి వైపు ఈ పార్కు ఉంది. ఇక్కడ పచ్చని అడవి, ఒక చెట్టు ఇల్లు ఉంది.
- తీర్థ్ముఖ్: ఈ జిల్లాలో అమర్‌పూర్ ఉపవిభాగంలో ఈ తీర్థయాత్ర కేంద్రం ఉంది.
రవాణా
మార్చురోడ్డుమార్గం
మార్చుఅస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ నుండి త్రిపుర రాష్ట్రంలోని సబ్రూమ్ వరకు ఉన్న 8వ జాతీయ రహదారి ఈ జిల్లా మీదుగా వెళుతుంది.[6]
రైలుమార్గం
మార్చుఈశాన్య సరిహద్దు రైల్వేకు చెందిన లమ్డింగ్-సబ్రూమ్ రైలు మార్గం సిపాహీజాల జిల్లా గుండా వెళుతోంది.[7][8] ఈ జిల్లాలో ఉదయ్‌పూర్ త్రిపుర రైల్వే స్టేషను, గార్జీ రైల్వే స్టేషను అనే రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. త్రిపుర రాజధాని అగర్తలా, అస్సాం, ధర్మనగర్, ఉదయ్‌పూర్, బెలోనియా వంటి రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు ఇక్కడినుండి రైల్వే సౌకర్యం ఉంది.[9]
మూలాలు
మార్చు- ↑ "Gomati district website".
- ↑ "Gomati district website".
- ↑ "Gomati district subdivision and blocks".
- ↑ "Tourism in Gomati district".
- ↑ "Bhuvaneswari temple".
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 30 December 2020.
- ↑ First Commercial Broad Gauge Freight Train Arrives In Tripura
- ↑ BG railhead reaches Udaipur amid cheers Archived 2016-03-21 at the Wayback Machine
- ↑ "Indian Rail Info".
ఇతర లంకెలు
మార్చు- Media related to గోమతి జిల్లా at Wikimedia Commons
- అధికారిక వెబ్సైట్