గంగ పండగ చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున జరిగే పండగల్లో ఒకటి. ఈ పండగకు మూలం ప్రతి ఏట తిరుపతిలో అత్యంత వైభవంగా జరిగే గంగ జాతరే. ఈ జాతరకు పెద్ద చరిత్ర, ఆచారము, ఉన్నాయి. కాని జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో జరిగే గంగ పండగను జరుపుకుంటారు.

పండగ జరిపే కాలం

మార్చు

ఎండా కాలంలో వ్యవసాయ పనులన్ని అయి పోయి పంటలన్ని ఇండ్లల్లొకి వచ్చి రైతులు, రైతు కూలీలు, రైతులపై ఆధార పడిన ఇతర కుల వృత్తుల వారు విశ్రాంతిగా వున్నప్పుడు వస్తుంది ఈ పండగ. ఈ పండగకు అటు ఒక వారం ఇటు ఒక వారం వరకు ఈ పండగ జరుపు కుంటారు.

పండగ విధానం

మార్చు

సంవత్సరం పాటు రైతుల వద్ద పొలంలో పని సేసిన కూలీలు, ఇతర కుల వృత్తుల వారు ఈ పండగ నాడు రైతుల వద్ద నుండి ధాన్యం రూపంలో బాగానే నజరానా పొందుతారు. కూలీలైతే చిత్ర విచిత్ర వేషాలు ధరించి ఊర్ల లోని రైతులను మెప్పించి ఫలితం పొందుతారు. ముఖ్యంగా పులి వేషం వేషధారి ఆబాల గొబాలాలను మెప్పిస్తారు. చిన్న పిల్లలకు ఇది పెద్ద పండగ. పులి వేష గాని వెంబడి డప్పు, పిల్లనగొయ్యి, ఇతర వాయిద్యాలు వాయిస్తూ ఉండగా ఇతరులు ఆడుతుండగా పులి వేషధారి గంతులు వేస్తూ పల్టీలు కొడుతూ నానా హంగామా చేస్తాడు. ఇది అందరికీ పండగే.

పులి వేషాలు

మార్చు

పులి వేషాలను ఎవరు బడితే వారు వేయలేరు. ఆ వేషం వేయడానికి మంచి దేహదారుడ్యం వుండాలి. మంచి ఆరోగ్య వంతుడై వుండాలి. ఎందుకంటే అతను వేసే గంతులకు చేసే విన్యాసాలకు అతని శరీరము సహకరించాలి. పులి వేష ధారి మొలకు ఒక లంగోటి మాత్రం కట్టుకొని శరీరమంతా పసుపు రంగు చారలు తీర్చి, తలకి పులి కన్నులవలె దిద్దిన, మద్యలో రంద్రాలున్న, పులిచెవులు లాంటి చెవులున్న టోపి ధరించి, (దీనిని ఈ వేషం కొరకే తయారు చేసుకుంటారు.) నోట్లో పెద్ద నాలుకలాగ ఒక ఎర్రటి అట్టముక్కను పెట్టుకొని తయారవతాడు. అతని నడుముకు దారాలు కట్టి ఇద్దరు వ్వక్తులు పగ్గాలతో అతనిని పట్టుకొని నియంత్రిస్తూ వుంటారు. ఒక పొడవాటి వెదురు బద్దకు రంగు కాగితాలు కట్టి ఒక కొసన ఒక పెద్ద బుట్టను కట్టి దానిని కూడా రంగు కాగితాలను అతికించి వుటారు. ఒక వ్వక్తి దానిని రెండో చివరన పట్టుకొని పులి వేష ధారి వెనక నిలబడి రెండో చివరన నున్న బుట్ట భాగాన్ని పులి వేషదారుని ముందు వచ్చేటట్టు పట్టుకొని వూపుతూ వుంటాడు. ఇద్దరు ముగ్గురు డప్పులు కొడుతుండగా ఆ డప్పులకు అనుగుణంగా పులి వేష ధారి అడుగులు వేస్తూ, పైన వూగు తున్న రంగు కాగితాల బుట్టను చూస్తూ పులి లాగా ఆడుతుంటాడు. ఒక రిద్దరు ఉత్సాహ వంతులు అతనికి తోడుగా ఆడు తుంటారు. ఈ విధంగా ఆడుతూ వారికి సంబంధించిన పల్లెల్లో మాత్రమే అనగా వారు పనిచేసే రైతులున్న పల్లెల్లో మాత్రమే తిరుగుతారు. ప్రతి రైతు వారి స్థాయిని బట్టి ధాన్యము, ధనము, పాత బట్టలు ఇస్తారు. వారికిచ్చిన ప్రతిఫలము వారికి తక్కువగా అనిపిస్తే సాధించి తీరుతారు. రైతుల వంటి పైనున్న పై వస్త్రాన్ని లాక్కుంటారు. చివరగా ఆ యింటి నుండి వెళ్ళే టప్పుడు ఆ రైతు పేరున వారి కుటుంబం వారి పేరు పది నిముషాల సేపు ఆసువుగా పాట పాడగా దానికి తగిన డప్పు వాయిద్యాలు, ధరువులు వేసి పొగిడి తర్వాత మరొక ఇంటికి వెళతారు. పెద్ద రైతులు వారికి కొన్ని బట్టలు, డబ్బులు, ఒక బస్తా వడ్లను కూడా ఇస్తారు. సామాన్య రైతు సాధారణంగా ఒక గంప వడ్లును ఇస్తారు. ఈ పులివేష ధారణ ఆబాల గోపాలన్ని చాల అలరిస్తుంది.

జంతు బలులు

మార్చు

ఈ పండగ మాంసాహార పండగ. ప్రతి ఒక్కరు కోళ్లను కోయడం, ఏట్లను కోయడం, వివిధ రకాల పిండి వంటలు చేసి తినడం ఆనవాయతి. ఆ రోజు సాయింత్రం ఊరి బయట ఒక వేప చెట్టు క్రింద గంగమ్మను నిలిపి పొంగిళ్లును పెట్టడం ఆచారం. ఈ గంగమ్మ దేవత వద్ద పూజారి ఆ వూరి చాకలి. అతను వేప కొమ్మలతో గంగమ్మకు ఒక చిన్న పందిరి గుడిని, దాని ముందు పెద్ద పందిరిని నిర్మిస్తాడు. పొంగిళ్లు పెట్టిన తరువాత చాకలి ద్యారా కోళ్లు, పొట్టేళ్లు, మేక పోతులు బలి ఇస్తారు. ఈ బలి ఇవ్వడానికి చాకలి వద్ద పెద్ద వేట కత్తి వుంటుంది. చాల కాలం క్రితం దున్నపోతులను కూడా బలి ఇచ్చేవారు. కాని ఇప్పుడు దున్న పోతును బలి ఇచ్చే సాంప్రాదాయం లేదు. మామూలు బలులు కూడా కనుమరుగ వుతున్నాయి.

ప్రస్తుతం ఈ పండగ సాంప్రదాయం

మార్చు

పొంగిళ్ళు పెట్టేవారు నానాటికి తగ్గుతున్నారు. ఇదేదో అనాగరిక చర్యగా భావిస్తున్నట్టున్నారు. రకరకాల వేష దారులు రాను రాను తక్కువై పోతున్నారు. ఇంత కాలం తమ పొలాల్లో పనిచేసిన పనివారు ఈ పండగ నాడు వివిధ వేషధారులుగా వచ్చి రైతులను మెప్పించి, ఘనంగా ధాన్యం రూపంలో, వస్త్ర రూపంలో, ధన రూపంలో ఫలితాన్ని పొందేవారు.ఇప్పుడు వ్యవసాయం చేసే రైతులు తక్కువైనారు, కూలీలు తక్కువైనారు, ఆ వేషాలు ఇప్పుడు లేవు. రాబోవు తరాలకు ఇటువంటి పండగ ఒకటుండేది అది ఈ విధంగా జరిగేది అని ఇలాంటి వ్యాసాల ద్వారా మాత్రమే తెలుసుకునే పరిస్థితి వస్తుంది. కనుక ఇటువంటి వ్యాసాలు ఇంకా వివరంగా వస్తే కనీసం కాగితాల మీద నైనా ఈ పండగను బతికించిన వారమవుతాము. పల్లెల్లో ఈ గంగ పండగ కళ తగ్గినా తిరుపతి లోని గంగ జాతర స్థిరంగానే కొనసాగున్నది.

యివి కూడా చూడండి

మార్చు

సూచికలు

మార్చు

యితర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=గంగపండగ&oldid=2985012" నుండి వెలికితీశారు