గంగా పుష్కరం

(గంగా పుష్కరాలు నుండి దారిమార్పు చెందింది)

గంగా పుష్కరం (Ganga Pushkaram) అనగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే గంగా నది యొక్క ఒక పండుగ. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది,[1] బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. అయితే పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో కలిసి వచ్చి ఉంటాడని ఈ పన్నెండు రోజూలలో గంగా నదిలో స్నానం చేయటం వలన సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని గంగా నదిలో అనేక మంది భక్తులు స్నానాలు చేస్తారు.

గంగా పుష్కరం
హరిద్వార్ వద్ద పవిత్ర గంగా నదిలో మునకలేస్తున్న యాత్రికులు (2012)
స్థితిక్రియాశీల
ప్రక్రియహిందూ పండుగలు
ఫ్రీక్వెన్సీప్రతి 12 సంవత్సరాలు
స్థలం
ప్రదేశంగంగా నది
దేశంభారతదేశం
ఇటీవలి2011
తరువాతిఏప్రిల్ 22 - మే 5, 2023
విస్తీర్ణంఉత్తర భారతదేశం
కార్యక్రమంపవిత్ర నదిలో మునకలేయడం

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Roshen Dalal (18 April 2014). Hinduism: An Alphabetical Guide. Penguin Books Limited. pp. 921–. ISBN 978-81-8475-277-9.