రాశి
జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి నూట ఎన్మిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబడినవే మేషము, మీనం మొదలగు రాశులు.
సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాస కాలం ఉంటాడు. ఆతరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి రెండు గంటలు చొప్పున ఇరవైనాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజిస్తారు.
రాశులు
మార్చు- మేషరాశి (March 21 నుండి [April 20) ]]
- వృషభరాశి (ఏప్రిల్ 21 నుండి మే 20 )
- మిథునరాశి (మే 21 నుండి జూన్ 21)
- కర్కాటకరాశి (జూన్ 22 నుండి జూలై 20)
- సింహరాశి (జూలై 21 నుండి ఆగష్టు 20)
- కన్యారాశి (ఆగష్టు 21 నుండి సెప్టెంబరు 20)
- తులారాశి (సెప్టెంబరు 21 నుండి అక్టోబరు 20)
- వృశ్చిక రాశి (అక్టోబరు 21 నుండి నవంబరు 20)
- ధనూరాశి (నవంబరు 21 నుండి డిసెంబరు 20)
- మకరరాశి (డిసెంబరు 21 నుండి జనవరి 20)
- కుంభరాశి (జనవరి 21 నుండి ఫిబ్రవరి 20)
- మీనరాశి (ఫిబ్రవరి 21 నుండి మార్చి 20)
ఒక రోజులో పన్నెండు లగ్నాలు ఉంటాయి. ప్రతి రెండు గంటల సమయానికి లగ్నం మారుతూ ఉంటుంది. పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం జరుగుతుంది. జాతకుడు పుట్టిన లగ్నం అతడికి మొదటి రాశి లేక స్థానం లేక లగ్నం ఔతుంది. మేషమునకు అధిపతి కుజుడు, వృషభముకు అధిపతి శుక్రుడు. మిధునముకు అధిపతి బుధుడు. కటకముకు అధిపతి చంద్రుడు. సింహముకు అధిపతి సూర్యుడు. కన్యకు అధిపతి బుధుడు. తులకు అధిపతి శుక్రుడు. వృశ్చికముకు అధిపతి కుజుడు. ధనస్సుకు అధిపతి గురువు. మర, కుంభములకు వరుసగా శని అధిపతి. చివరి రాశి అయిన మీనముకు అధిపతి గురువు.
- ఉపచయ రాశులు లగ్నము నుండి 3,6,10,11.
- అపోక్లిమ రాశులు లగ్నము నుండి 3,6,9,12.
- ఉపాంత్యము అంటే చివరి రాశికి ముందు రాశి.
ఉచ్ఛ నీచ రాశులు
మార్చు- సూర్యునకు ఉచ్ఛ రాశి మేషము. అలాగే నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న తులారాశి.
- చంద్రుడికి ఉచ్ఛ రాశి వృషభము. నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న వృశ్చికము.
- కుజుడికి ఉచ్ఛ రాశి మకరము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కటకము.
- బుధుడికి ఉచ్ఛరాశి కన్య. నీచ రాశి దానికి ఏడవ స్థానం ఉన్న మీనము.
- గురువుకు ఉచ్ఛ రాశి కర్కాటకం. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మకరము.
- శుక్రుడికి ఉచ్ఛ రాశి మీనము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కన్య.
- శనికి ఉచ్ఛ రాశి తుల. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మేషము.
- పురుష రాశులు :- మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభము.
- స్త్రీరాశులు :- వృషభము, కర్కాటకం, కన్య, వృశ్చికము, మకరము, మీనము.
- ఎరుపు వర్ణ రాశులు :- మేషము, సింహము, ధనస్సు.
- నలుపు :- మకరము, కన్య, మిధునము.
- పసుపు :- వృశ్చికము, కుంభము, మీనము.
- తెలుపు :- వృషభము, కటకము, తుల.
- బ్రాహ్మణ జాతి :- వృషభము, తులా, వృశ్చికము, మీనము.
- క్షత్రియ జాతి :- మేషము, సింహము, ధనస్సు.
- వైశ్యజాతి :- మిధునము, కుంభము.
- శూద్రజాతి :- కర్కాటకం, కన్య, మకరములు.
- రాశులు దిక్కులు :-
- తూర్పు దిక్కు :- మేషం, వృషభం, మిధునములు.
- దక్షిణం దిక్కు :- కటకం, సింహం, కన్య.
- ఉత్తర దిక్కు :- తులా, వృశ్చికం, ధనస్సులు.
- పడమర దిక్కు :- మకరం, కుంభం, మీనం.
- చరరాశులు:- మేషము, కర్కాటకం, తులా, మకరములు.
- సమరాశూలను ఓజ రాశులు అంటారు.
రాశుల స్వరూపం
మార్చు- మేషం :- మేక ఆకారం.
- వృషభం :- కుమ్ముతున్న ఎద్దు.
- మిధునం :- గదను ధరించిన పురుషుడు.
- కర్కాటకం :- ఎండ్రకాయ ఆకారం.
- సింహం :- సింహాకారము.
- కన్య :- సస్యమును, దీపమును చేత పట్టుకుని తెప్ప మీద ఉన్న కన్య.
- తుల :- త్రాసు ధరించిన పురుషుడు.
- వృశ్చికము :- తేలు ఆకారము.
- ధనస్సు :- ధనస్సు ధరించిన పురుషుడు.
- మకరము :- మృగము వంటి ముఖము కలిగిన మొసలి.
- కుంభము :- రిక్త కుంభము చేత పట్టిన పురుషుడు.
- మీనము :- అన్యోన్య పుచ్ఛాభిముఖమై ఉన్న రెండు చేపలు.
రాశులు మరికొన్ని వివరాలు
మార్చురాశులు | లింగం | స్వభావం | తత్వం | శబ్దం | సమయం | ఉదయం | జల/నిర్జల | జీవులు | వర్ణం | పరమాణం | జాతి | దిశ | అధిపతి | సంతానం | ప్రకృతి | కాలపురుషుని అంగం | సమ/విషమ |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
మేషరాశి | పురుష | చర | అగ్ని | అధిక | రాత్రి | పృష్ఠ | పాదం | పశువులు | రక్తవర్ణం | హస్వ | క్షత్రియ | తూర్పు | కుజుడు | అల్ప | పిత్త | శిరసు | విషమ |
వృషభరాశి | స్త్రీ | స్థిర | భూమి | అధిక | రాత్రి | పృష్ఠ | అర్ధ | పశువులు | శ్వేతం | హస్వ | బ్రాహ్మణ | దక్షిణ | శుక్రుడు | సమం | వాత | ముఖము | సమం |
మిధుననరాశి | పురుష | ద్విశ్వభావ | వాయు | అధిక | రాత్రి | శీర్షం | నిర్జల | మనుష్య | ఆకుపచ్చ | సమ | వైశ్య | పడమర | బుధుడు | సమం | వాతం | బాహువులు | విషమ |
కర్కాటకరాశి | స్త్రీ | చర | జల | నిశ్శబ్దం | రాత్రి | పృష్ట | పూర్ణ | జల | పాటల | సమ | శూద్ర | ఉత్తర | చంద్రుడు | అధికం | కఫం | వక్షం | సమ |
సింహరాశి | పురుష | స్థిర | అగ్ని | అధిక | పగలు | శీర్షం | నిర్జల | పశువులు | ధూమ్ర, పాండు | దీర్ఘం | క్షత్రియ | తూర్పు | సూర్యుడు | అల్పం | పిత్తం | గుండె | విషమ |
కన్యారాశి | స్త్రీ | ద్విశ్వభావ | భూమి | అర్ధ | పగలు | శీర్షం | నిర్జల | మానవ | చిత్రవర్ణం | దీర్ఘం | శూద్ర | దక్షిణం | బుధుడు | అల్పం | వాతం | పొట్ట | సమ |
తులారాశి | పురుష | చర | వాయు | నిశ్శబ్ధ | పగలు | శీర్షం | పాద | మానవ | నీలవర్ణం | దీర్ఘం | వైశ్య | పడమర | శుక్రుడు | అల్పం | వాతం | పొత్తికడుపు | విషమ |
వృశ్చికరాశి | స్త్రీ | స్థిర | జల | నిశ్శబ్ధ | పగలు | శీర్షం | పాద | కీటక | స్వర్ణవర్ణం | దీర్ఘం | బ్రాహ్మణ | ఉత్తర | కుజుడు | అధికం | కఫం | మర్మస్థానం | సమ |
ధనస్సురాశి | పురుష | ద్విశ్వభావం | అగ్ని | అధిక | రాత్రి | పృష్ట | అర్ధ | మనుష్య, పశు | కపిల | సమ | క్షత్రియ | తూర్పు | గురువు | అల్పం | ఉష్ణ, పిత్త | తొడలు | విషమ |
మకరరాశి | స్త్రీ | చర | భూమి | అర్ధ | రాత్రి | పృష్ట | పూర్ణ | పశు, జలచర | శుక్ల, కపిల | సమ | శూద్ర | దక్షిణం | శని | అల్పం | వాతం | మోకాళ్ళు | సమ |
కుంభరాశి | పరుష | స్థిర | వాయు | అర్ధ | పగలు | శీర్షం | అర్ధ | మానవ | బబ్రు | హస్వ | వైశ్య | పడమర | శని | సమ | వాత, పిత్త, కఫ | పిక్కలు | విషమ |
మీనరాశి | స్త్రీ | ద్విశ్వభావ | జల | నిశ్శబ్ధ | పగలు | ఉభయ | పూర్ణ | జల | స్వచ్ఛ | హస్వ | బ్రాహ్మణ | ఉత్తరం | గురువు | అధికం | కఫం | పాదం | సమ |
నవాంశ రాశులు
మార్చునవాంశచక్రము జాతక నిర్ణయంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉత్తరభారతదేశంలో నవాంశను ఆధారంగా చేసుకుని జాతక నిర్ణయం చేస్తారు. ఫలితాలు తుల్యంగా ఉంటాయని పండితుల అభిప్రాయం. రాశిలోని తొమ్మిది నక్షత్ర పాదాలను తొమ్మిది భాగాలుగా విభజిస్తారు. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రాశి ఆధిపత్యం వహిస్తుంది. మేషం, కటకం, తుల, మకరం వరుసగా నవాంశ ఆరంభ రాశులు. నవాంశను గ్రహం ఉపస్థిత రాశిని దానికి ఒక్కొక్క పాదంలో స్థానంలో ఉన్న రాశిని అనుసరించి నిర్ణయిస్తారు.