గంగుబాయి

కామాతిపురంలో ఒక వేశ్యాగృహానికి చెందిన వ్యభిచారి.

గంగూబాయి హర్జీవందాస్ ముంబైలోని కామాతిపురలో ఒక వేశ్యాగృహానికి చెందిన వ్యభిచారి. ఈమె వ్యభిచార గృహాన్ని నడుపుతున్నప్పటికీ ,ఎవరినీ బలవంతంగా ఎవరిని ఈ వృత్తిలోకి తీసుకొలేదు. కమాఠీపురలో నివసించే స్త్రీలు,పిల్లలందరిని ఒక తల్లిలా చూసుకుంది.

గంగుబాయి
గంగూబాయి హర్జీవందాస్
గంగూబాయి
జననం
గంగూబాయి హర్జీవందాస్

1939
కతియావాడి
మరణం2008
కామాతిపురం
జాతీయతభారత దేశం
ఇతర పేర్లుగంగూబాయి కతియావాడి
వృత్తివేశ్యా

జననం వ్యక్తిగతం

మార్చు

గంగూబాయి 1939 కతివాడి గుజరాత్‌ లోని కతియావాడ్‌ లోని జన్మించింది.ఆమె అసలు పేరు గంగా హర్జీవందాస్.చిన్నప్పటి నుంచి బాలీవుడ్ నటి కావాలని ఉండేది.16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు,తన తండ్రికి అకౌంటెంట్‌గా ఉన్న రామ్నిక్ లాల్‌తో ప్రేమలో పడింది.అతనితో పారిపోయి ముంబైకి వచ్చి కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి అనుకుంది.కానీ రామ్నిక్ లాల్ గంగుబాయినీ మోసం చేసి వ్యభిచార గృహానికి రూ.500 అమ్మెస్తాడు.ఆమె వేశ్యగా మారి ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో నివసించడం ప్రారంభించింది.[1]

వ్యభిచార గృహాల నిర్వహణ

మార్చు

మాఫియా డాన్ అయిన కరీం లాలా 1960లలో రెడ్ లైట్ ఏరియా కమాతిపుర కూడా కరీం పాలనలో ఉంది. గంగుబాయి పై కరీం గ్యాంగ్‌లోని ఒక వ్యక్తి ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. గంగూబాయి న్యాయం కోసం మాఫియా డాన్ కరీం లాలా వద్దకు వెళ్లింది. ఆ సమయంలో కరీం లాలాకు రాఖీ కట్టి నా సోదరుడు లా ఉన్నావ్ అంటుంది. కరీం లాలా కూడా గంగును తన సోదరిగా భావించి, గంగూబాయికి కామాతిపుర పాలనను అందించాడు.ఆమె ముంబైలోని 'మాఫియా క్వీన్స్'లో ఒకరిగా ఉద్భవించింది.ఆమె వ్యభిచార గృహాన్ని నడుపుతున్నప్పటికీ,ఆమె ఎవరినీ బలవంతం చేయలేదు వారి అనుమతి లేకుండా ఈ పని చేయమని అడగలేదు.తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, మిగతా సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేయాలని నిశ్చయించుకుంది. సెక్స్ వర్కర్లు,అనాథలకు ఆమె ఒక రకమైన దేవత మారింది.కమాఠీపురలో నివసించే స్త్రీలు, పిల్లలందరిని తల్లిలా చూసుకుంది.గంగూబాయినీ ఒకసారి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కలిశారు.ఆమె తెలివితేటలను చూసి రెడ్ లైట్ ప్రాంతాలను రక్షించాలనే ఆమె ప్రతిపాదనను ఆమోదించారు.[2][3] ఈ రోజుకి కామాతిపుర ప్రజలు ఆమె జ్ఞాపకార్థం ఆ ప్రాంతంలో ఒక పెద్ద విగ్రహం ఏర్పాటు చేయబడింది. కమాతిపురలో,గంగూబాయి చిత్రాలు ఇప్పటికీ వ్యభిచార గృహాల గోడల ఉంటాయి.[1]

బయోపిక్ చిత్రం

మార్చు

గంగూబాయి జీవితం ఆధారంగా సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి పాత్రలో అలియా నటిస్తోంది.గంగూబాయి కుటుంబానికి చెందిన కొందరు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు.[4][5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Sakshi (25 February 2021). "గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో." Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
  2. "Know Gangubai Kothewali, The Legendary Brothel Madam Alia Bhatt Will Be Playing In SLB's Next". Desimartini (in ఇంగ్లీష్). 2019-09-22. Retrieved 2020-01-21.
  3. "गंगूबाई कोठेवाली-पति ने ₹500 में बेचा था,भंसाली उनपर फिल्म बनाएंगे". Quint Hindi (in హిందీ). 2019-09-25. Retrieved 2020-01-21.
  4. "Alia Bhatt begins shooting for Gangubai Kathiawadi, shares pic of her trailer:'Look what Santa gave me this year'". Hindustan Times. 27 December 2019. Retrieved 27 December 2019.
  5. "Who was Gangubai Kathiawadi: The real woman behind Alia Bhatt's latest character". Vogue India (in Indian English). Retrieved 2020-01-21.

వెలుపల లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=గంగుబాయి&oldid=3461921" నుండి వెలికితీశారు