గంగూబాయి కతియావాడి
గంగూబాయి కతియావాడి రచయిత, జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ నవలను ఆధారంగా చేసుకుని నిర్మించిన హిందీ సినిమా. భన్సాలీ ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్‌లపై సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్ గడ నిర్మించిన ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించాడు. ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్, ఇమ్రాన్ హష్మి ప్రధాన నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 25న విడుదలయింది.[1]
గంగూబాయి కతియావాడి | |
---|---|
![]() సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | సంజయ్ లీలా భన్సాలీ |
కథ | హుస్సేన్ జైదీ |
నిర్మాత | జయంతిలాల్ గడ సంజయ్ లీలా భన్సాలీ |
నటవర్గం | ఆలియా భట్ |
ఛాయాగ్రహణం | సుదీప్ ఛటర్జీ |
సంగీతం | బ్యాక్గ్రౌండ్ స్కోర్: సంచిత్ బాళ్హరా అంకిత్ బాళ్హరా పాటలు: సంజయ్ లీలా భన్సాలీ |
నిర్మాణ సంస్థలు | భన్సాలీ ప్రొడక్షన్స్ పెన్ ఇండియా లిమిటెడ్ |
పంపిణీదారులు | పెన్ ఇండియా లిమిటెడ్ |
విడుదల తేదీలు | 2022 ఫిబ్రవరి 25 |
దేశం | ![]() |
భాష | హిందీ |
కథసవరించు
గంగూబాయి యుక్త వయసులో ఓ వ్యక్తిని ఇష్టపడి అతడిని గుడ్డిగా నమ్మి ఇంట్లో నుండి పారిపోయి అతడితో కలిసి ముంబై వస్తుంది. ఆమె అయామకత్వాన్ని అలుసుగా తీసుకున్న ఆమె ప్రియుడు, గంగూబాయిని ట్రాప్ చేసి ముంబైలోని కామతిపురలోని ఓ వేశ్యా గృహంలో అమ్మేస్తాడు. అనుకోకుండా ఆ వలలో చిక్కుకున్న గంగూబాయి మెల్లగా ఆ వృత్తిపై పట్టు సాధించి, ముంబై అండర్‌వరల్డ్ సహాయంతో సొంతంగా తనే వేశ్యాగృహాలు నడుపుతూ ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ గా ఎదిగింది. ఆ తర్వాత కామతిపురలో జీవన పరిస్థితులను మెరుగుపర్చడానికి గంగూబాయి చేసిన ప్రయత్నాల ఏమిటి? తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులుసవరించు
- ఆలియా భట్[3]
- శాంతాను మహేశ్వరి
- విజయ్ రాజ్
- ఇందిరా తివారి
- సీమ పహ్వ
- వరుణ్ కపూర్
- జిమ్ సరబ్
- షాను కుమార్
- శంతను మహేశ్వరి
- రజా మురాద్
- జిమ్ సర్భ్
- వరుణ్ కపూర్
అతిధి పాత్రల్లోసవరించు
సాంకేతిక నిపుణులుసవరించు
- బ్యానర్లు: భన్సాలీ ప్రొడక్షన్స్
పెన్ ఇండియా లిమిటెడ్ - నిర్మాతలు: జయంతిలాల్ గడ
సంజయ్ లీలా భన్సాలీ - కథ: హుస్సేన్ జైదీ
- స్క్రీన్ప్లే, దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీ
- సంగీతం: సంజయ్ లీలా భన్సాలీ
- సినిమాటోగ్రఫీ: సుదీప్ ఛటర్జీ
వివాదంసవరించు
గంగూబాయి కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి ఈ చిత్రంపై ఆందోళనకు దిగారు. ఇప్పటికే బాబూ రావుజీ షా పిటిషన్ దాఖలు చేయడంతో ముంబయి కోర్టు సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌లకు సమన్లు జారీ చేసింది. కేసు పెండింగ్‌లో ఉంది. తన అమ్మ జీవితాంతం సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేస్తే సామాజిక కార్యకర్త అవుతుందా.. వేశ్యనా అని ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు.[4]
మూలాలుసవరించు
- ↑ NTV (28 January 2022). "'గంగూబాయి కతియావాడి' రాకకు అంతా సిద్ధం". Archived from the original on 29 January 2022. Retrieved 29 January 2022.
- ↑ Sakshi (25 February 2021). "గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో." Archived from the original on 29 January 2022. Retrieved 29 January 2022.
- ↑ Sakshi (10 April 2021). "ఆలియా @ ప్రెసిడెంట్ ఆఫ్ కామాటిపురా". Archived from the original on 29 January 2022. Retrieved 29 January 2022.
- ↑ "Gangubai Kathiawadi: సినిమా కోసం మా అమ్మని వేశ్యగా చూపిస్తారా..?గంగూబాయ్ తనయుడి ఫైర్". EENADU. Retrieved 2022-02-17.