గంధమహోత్సవం
గంధమహోత్సవం అనగా గంధపు చెక్కలతో తయారు చేసిన గంధపు లేపన్నాన్ని పంచే ఉత్సవం. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని దేవాలయాలలో, దర్గాలలో ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ఎంతో పవిత్రమైన ఈ గంధాన్ని స్వీకరించుటకు దూరప్రాంతాల నుంచి కూడా ఈ ఉత్సవానికి హాజరవుతుంటారు. మన రాష్ట్రంలో జరిగే కొన్ని ముఖ్యమైన గంధమహోత్సవములు.
దొరసానమ్మ గంధమహోత్సవం
మార్చునెల్లూరు జిల్లాలోని అనుమసముద్రంపేట (A.S.పేట)లో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం దొరసానమ్మ గంధమహోత్సవం జరుగుతుంది.
చరిత్ర
మార్చుకర్నూలు నవాబ్ కుమార్తె అయిన హబీబా (దొరసానమ్మ) పెళ్ళి వయస్సు వచ్చేలోపే ఖురాన్‌ను పూర్తిగా చదివి చిన్న వయస్సులోనే ముస్లీం పెద్దల ప్రసంశలను అందుకున్నారు. ఓ రోజు ఆమె స్వప్నంలో ఓ సాదుపుంగవుడు ప్రత్యక్షమైనట్లు, ఆయన్ను వివాహం చేసుకున్నట్లు కల కన్నది. ఆ కలను తల్లికి వివరించింది. ఈ విషయాన్ని హబీబా తల్లి కర్నూలు నవాబ్‌కు వివరించడంతో ఆయన అంగీకరించలేదు. పెద్దలు చెప్పిన నిర్ణయం మేరకే ఉండాలని నవాబ్ బీష్మించడంతో నాడే హబీబా చింతాకాంతురాలైంది. ఓ రోజు తల్లిదండ్రులతో కర్నూలు నవాబ్ మసీదు వద్ద ప్రార్థనలు చేస్తూ తన కోరిక ఫలించాలంటూ స్వప్నంలో ప్రత్యక్షమైన వ్యక్తినే వివాహమాడాలని ప్రార్థించింది. అప్పటికప్పుడే ఆమె స్పృహ తప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ సమయంలో హబీబా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. భక్తుల కోర్కెలు తీర్చడంలో పేరు పొందిన హజరత్ నాయబ్ రసూల్ అక్కడికి వచ్చి హబీబాను ప్రమాదం నుంచి కాపాడాడు.
దీంతో కర్నూలు నవాబ్ అంగరంగవైభవంగా హబీబాను నాయబ్స్రూల్‌కు ఇచ్చి వివాహం చేశారు. నాటి నుంచి ఎంతో మంది భక్తులకు సేవలందిస్తూ, వారి కోర్కెలను తీరుస్తూ ఉండేవారు. 1781లో రబీబుల్ అన్వర్ నెల 26న నాయబ్స్రూల్ మృతి చెందారు. దీంతో ఆయన సమాధిని ఏఎస్‌పేట వద్ద శ్రీ హజరత్‌నాయబ్స్రూల్ దర్గాగా నిర్మించి నిత్య ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. 1798లో రబీబుల్ అన్వర్ నెల 7వ తేదీన హబీబా ఖాతూన్ (దొరసానమ్మ) మృతి చెందారు. నాయబ్స్రూల్ సతీమణి హబీబా ఖాతూన్ చిన్ననాటి నుంచే భక్తిపారవశ్యంగా మంచి పేరుగడించి నాయబ్స్రూల్‌ను వివాహం చేసుకుని మంచి వరాలిచ్చే కల్పవల్లిగా నామకరణ చెందింది.
ఆమె సమాధిని నాయబ్స్రూల్ సమాధి సమీపంలో ఏర్పాటు చేసి నాటి నుంచి ప్రార్థనలు చేయడం ప్రతి ఏటా ఆమె పేరిట గంధమహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఎంతో మంది మహిళలు సంతానలేమితో బాధపడుతూ దర్గా వద్ద ప్రార్థనలు చేసి సంతానప్రాప్తి పొందినట్లు దర్గా పెద్దలు చెబుతుంటారు. దీనికి తోడు మతిస్థిమ్మితం లేక ఉండే ఎంతో మంది బాగుపడిన సందర్భాలు ఉన్నారు. గంధమహోత్సవానికి మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, తదితర రాష్ట్రాల నుంచి కులమతాలకతీతంగా భక్తులు హాజరుకావడం ఇక్కడ ప్రత్యేకత.