శ్రీగంధం లేదా చందనం ఒక విశిష్టమైన సుగంధాన్నిచ్చే వృక్షం. దీని శాస్త్రీయనామం శాంటాలమ్ ఆల్బమ్ (Santalum album). ఇది శాంటాలేసియా కుటుంబానికి చెందినది.

శ్రీగంధం
'Sandalwood' by Köhler
Santalum album
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
ఎస్. ఆల్బమ్
Binomial name
శాంటాలమ్ ఆల్బమ్

సాగువిధానం మార్చు

ఇసుకతో కూడిన ఎర్రమట్టి నేలలు చందనము సాగుకు అనుకూలమైనవి. ఇది ఉష్ణమండల పంట. దీనికి తేమగల పొడి నేలలు అవసరము.గంధం లేదా చందనము ఒక విశిష్టమైన సుగంధాన్నిచ్చే వృక్షం. ఇది ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన బహువార్షిక వృక్షం. దీనిని భారతదేశంలో ప్రాచీనకాలము నుండి పూజా ద్రవ్యముగా వాడబడుచున్నది. సాగువిధానం ఇసుకతో కూడిన ఎర్రమట్టి నేలలు చందనము సాగుకు అనుకూలమైనవి. ఇది ఉష్ణమండల పంట. దీనికి తేమగల పొడి నేలలు అవసరము. శ్రీగంధం చెట్టు ఒక పరాన్న జీవన వృక్షం. అనగా ఇది భూమి నుండి నేరుగా నీటిని, పోషకాలను గ్రహించలేదు. వేరే మొక్కల వేర్లతో ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకొని నీటిని, పోషకాలను గ్రహిస్తుంది. అందువలన శ్రీగంధం మొక్కలతో పాటు వేరే అతిథేయి మొక్కలను పెంచవలసి ఉంటుంది. అతిథేయి మొక్కలుగా కంది, ఉసిరి, సరుగుడు, కానుగ, మిరప, కరివేపాకు మొదలైనవాటిని పెంచవచ్చును

ఉపయోగాలు మార్చు

చందనము వ్యాధి నిరోధక శక్తిని, మేధస్సును పెంచే గుణము కలది. చందనపుచెక్కనుండి తీసిన తైలం మంచి సువాసన కలిగియుండి పరిమళ ద్రవ్యముల తయారీలో బాగా వాడుతున్నారు. ఇది మెదడు, హృదయమునకు సంబంధించిన వ్యాధులకు, కడుపులో మంట, జ్వరము, తలనొప్పి, జలుబు, శ్వాసకోశ, మూత్రకోశ, అతిసార వ్యాధులకు, మశూచి, స్ఫోటకము, ఇతర చర్మవ్యాధులకు సంబంధించిన మందుల తయారీలో ఉపయోగపడును. వేరు నుండి లభించే తైలాన్ని అత్తరు, అగరుబత్తి, సబ్బులలో ఉపయోగిస్తారు.

దీన్ని సిరి గందం చెట్టు అని కూడా అంటారు. బాగా ముదిరిన ఈ చెట్టు కర్ర మంచి సువాసన కలిగి వుంటుంది. అటు వంటి కర్రలను రాతి బండలపై నీళ్లు చిలకరిస్తూ రుద్దుటుంటే గందం వస్తుంది. దీని దేవునికి పూస్తారు. తిరుమల లోని శ్రీ వేంకటేస్వరాలయంలో ఈ విధంగా గందం తీయడానికి ఒక గది ఉంది. (గందపు గది) ఈ చెట్లు ఎక్కువగా నల్లమల అడవులో పెరుగు తాయి. తిరుమల కొండ పైన ఈ చెట్లు విస్తారంగా కనిపిస్తాయి. ఇక్కడ గందపు చెక్కలను కూడా బజారులో అమ్ముతుంటారు. ఇవి చాల విలువైనవి. అందు చేత వీటిని స్మగ్లర్లు దొంగ రవాణ చేస్తుంటారు. రాయలసీమ ప్రాంతంలో ఈ చెట్లు ఎక్కువగా కనబడతాయి. ప్రత్యేకంగా వీటిని పెంచరు. పొలాల గట్ల మీద తోటలలో వాటంతట అవే పడి పెరుగు తుంటాయి. వీటిని ప్రత్యేకంగా పెంచడము, కొట్టడము, అమ్మడం నిషేధం. అంచు చేత దొంగలు వీటిని రాత్రికి రాత్రే కొట్టుకొని పోతుంటారు. చందనం వాడకంతో సౌందర్యం పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది రాజులూ, మహారాజుల కాలంలోనే ప్రాచుర్యంలో ఉంది. నేటి కాలంలో రసాయనిక సాధనాలతో సౌందర్య పోషణ చేసుకోబోయి, ఉన్న అందానికీ మంగళం పాడేస్తున్నారు చాలా మంది. నేటికీ, సౌందర్యసాధనాల్లో చందనానికి గల ప్రాధాన్యం చెప్పుకోదగిందే. చందనం తాలూకు గుణాలు మహత్తరమైనవి. వాటిని గురించి తెలుసుకుందాం. రూపసౌందర్యాలకూ, చందనానికీ అవినాభావసంబంధం ప్రాచీనకాలం నుంచీ ఉంది. చాలా మంది పురుషులు చందనపు బొట్టు పెట్టుకోవటం మనకు తెలుసు. శరీరానికి చందనలేపనం చేసుకోవటం గురించీ వింటుంటాం. సుకోమలమైన చర్మం, అందానికి ప్రతీక. అలాగే చందనం నుంచి వెలువడే సుగంధాలు ఆరోగ్యానికీ నిదర్శనం. ఈ కారణాల చేతనే చందనాన్ని సౌందర్య సాధనాల్లో నేడూ వాడుతున్నారు.

సౌందర్య సాధనాలలో వాడకం మార్చు

కొన్ని రకాల పెర్‌ఫ్యూమ్‌లలోనూ చందనం వుంటుంది. ఆధ్యాత్మిక మానసికారోగాల కోసం కూడా చందనం వాడకం ఉంది. వేదాల్లో దేవరాజైన ఇంద్రుని నందనోద్యానంలో చందనవృక్షం వున్న ప్రసక్తి ఉంది. దాని సువాసనలతో దేవలోకం మొత్తం గుబాళించిందట. అక్కడున్న దివ్యదేవతలతో పాటు అప్సరసలందరి సౌందర్యానికీ అతిముఖ్యకారణం చందనమేననీ, ఆ తరువాతి కాలంలో చందనం భూలోకంలోకి వచ్చినప్పుడు, సహజ సౌందర్యోద్ధరణ కోసం స్త్రీలందరూ చందనాన్ని వాడారనీ ప్రతీతి. బాలీవుడ్‌ సుందరి, నాట్యతారామణి, నిన్నటి 'డ్రీమ్‌ గర్ల్‌' హేమమాలిని సౌందర్యం, ఐదు దశాబ్దాలు దాటినప్పటికీ నిలిచి వుండటానికి కారణమేమిటంటే, నృత్యాభ్యాసంతో పాటు చర్మానికి చందనలేపనం చేసుకుంటానని చెప్పింది. గతంలో తిరువనంతపురం సిస్టర్స్‌లో ఒకరైన పద్మిని కూడా చెప్పారు. సౌందర్య నిపుణురాలూ, బ్యూటీ కన్సల్టెంటూ అయిన బ్లాసం కొచర్‌ కూడా చందనం సుగుణాలను పొగిడింది. చందనం ఒక సంపూర్ణమూ, సహజమూ అయిన సౌందర్యవర్ధక సాధనం. కోమలత, కమనీయత నిలిచి వుండటానికి చందనం తోడ్పడుతుంది. మాయిశ్చరైజింగ్‌ ఏజెంట్‌గానూ పని చేసేది చందనమే. చర్మంలో నుంచి పోయిన తేమను తిరిగి తీసుకురాగలగిన చక్కని సాధనం. అంతే కాకుండా, చర్మంలోని అదనపు జిడ్డును కూడా చందనం తొలగిస్తుంది. అందుకనే సంపూర్ణమైన స్కిన్‌ కేర్‌ ప్రాడక్ట్‌గా చందనాన్ని నేటి వారూ భావిస్తున్నారు. చందనాన్ని ముల్తానీ మట్టి, పన్నీరు కలిపి, పేస్ట్‌లా చేసి, ముఖం, మెడ మీద రాసుకుంటే ఈ లేపనం చర్మాన్ని స్నిగ్ధం చేస్తుంది. చాలా శుష్కంగా వుండే చర్మానికి కూడా చందనం మేలు చేస్తుంది. స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల చందనతైలాన్ని వేసుకోవాలి. శరీరమంతటా చందనలేపనం చేసుకుని, ఆ తరువాత చందనతైలం వేసుకున్న నీటితో స్నానం చేస్తే బలే మజాగా వుంటుంది. చర్మంలోని శుష్కత పూర్తిగా పోతుంది. చందనం మేలైన స్క్రబ్‌గానూ ఉపయోగపడుతుంది.

చర్మం జీవం లేకుండా, వాడిపోయినట్లుగా కనిపిస్తే, లేదా చర్మంలోని మృతకణాలు సౌందర్యానికి బాధకాలుగా నిలిస్తే, స్నానం చేసే ముందు, కాస్త బరకగా వుండే చందనం పొడిని ముఖం, మెడ, చేతులూ, కాళ్లకు రాసుకోవాలి. దాంతో చర్మం మీదుండే మృతకణాల పొర తొలగిపోతుంది. చర్మానికి కొత్త కాంతి వస్తుంది.సెన్సిటివ్‌ చర్మానికి చందనం లాభాలు కలుగజేస్తుంది. క్రీమ్‌ రూపంలో, ఫేస్‌ ప్యాక్‌లాగా చందనాన్ని వాడుకుంటే సరిపోతుంది. ఈ వస్తువుల వాడకంతో చర్మం మచ్చలు లేనిదిగా, సుందరంగా తయారవుతుంది. ఫేస్‌ క్లెన్జర్‌గానూ, ఎండకు కమిలిన చర్మం మీదా చందనం తన చల్లని ప్రభావాన్ని చూపుతుంది. చందనం గల సబ్బులూ, చందనం పేస్ట్‌తో రోజూ చర్మాన్ని శుభ్రపరచుకుంటే, కొద్ది రోజుల్లోనే చర్మం వికసించి, సహజకాంతితో మెరుస్తుంటుంది. అరోమా బాత్‌, పెర్‌ఫ్యూమ్‌ల రూపంలో చందనాన్ని వాడుకోవచ్చు. రోజూ చందనతైలాన్ని కొన్ని చుక్కలు వాడుకోవటం వల్ల, చెమట వల్ల ఏర్పడే దుర్గంధం పోతుంది. మరి కొన్ని లాభాలు చందనవృక్షం తాలూకు ఆకులు, వేళ్లు, చెక్క అన్నిటిలోనూ చందనానికి వుండే సుగుణాలు ఉన్నాయి.

చందనంతో రోజూ బొట్టు పెట్టుకుంటే, మనస్సు, మస్తిష్కమూ ప్రశాంతంగా వుంటాయి. ఆధ్యాత్మిక దృష్టితో చూసినా చందనానికి ప్రముఖస్థానమే ఉంది. పూజలూ, ధ్యానాల్లో స్థిరత్వానికి తోడ్పడుతుంది. దీని సుగంధాలు శరీరంతో పాటు మనస్సుకూ కొత్త శక్తిని కలుగజేస్తాయి. చందనం అంటేనే చల్లదనం. మరి ఆ చందనంతో కంటికి పెట్టుకునే కాటుక తయారు చేసుకుంటే ఎలా వుంటుంది? కళ్లకు చల్లగా వుంటుంది. వినటం మనసుకు చల్లదనాన్నిస్తుంది. పరిశుభ్రమైన చందనపు చెక్కను అరగదీసి, దాన్ని మందమైన ఇనుపపాత్ర కింది భాగంలో లేపనంలా పూయాలి. పెద్ద కట్టెల పొయ్యి మీద ఈ పాత్రను వుంచాలి. ఈ పాత్రలో ఆముదం పోసి, ఓ సన్నని బట్టలో మరో రెండు చందనపు చెక్కలను చుట్టి పెడతారు. ఇప్పుడు కట్టెల పొయ్యిని అంటిస్తే, పాత్రలో వుండే కట్టెలు కాలిపోయి, బూడిదలా తయారవుతాయి. ఆ బూడిదకు కాస్త వెన్న కలిపి రుబ్బాలి. ఈ మిశ్రమమే కళ్లకు చలువ చేసే చందనపు కాటుక. ఈ కాటుక పెట్టుకున్న కళ్లను జనం తప్పకుండా మరోసారి చూసి తీరుతారు. వేసవిలో ఇలాంటి చందనపు కాటుకను పెట్టుకోవటం చాలా మంచిది. వేసవిలో చందనము : మండే ఎండల్లో మంచు చల్లదనాన్ని అందించే శక్తి గంధం సొంతం. చర్మానికి తాజాదనంతో పాటు.. మెరుపునూ తెచ్చే గంధం.. మరెన్నో విధాలుగానూ ఉపయోగపడుతుంది. గంధం చెక్క, గంధం పొడి మాత్రమే కాదు.. నూనె కూడా మేలు చేస్తుంది. చర్మాన్ని చల్లబరచడమే కాదు.. యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది గంధం. వేసవిలో అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. మొటిమలు, దద్దుర్లను కూడా నివారించే శక్తి గంధానికి ఉంది. ఒక్క శారీరకంగానే కాదు.. మానసిక సాంత్వననందిస్తుంది. గంధం నుంచి వచ్చే ప్రత్యేకమైన సువాసన ఒత్తిడిని తగ్గించి మనసుకు, మెదడుకు హాయినందిస్తుంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టనివారు.. స్నానం చేసే నీటిలో మూడు చుక్కల గంధపు నూనెను వేసుకుంటే.. ఎంతో మార్పు ఉంటుంది. చందనంతో పాటు ఈ వేసవిలో ప్రత్యేకంగా లభించే మల్లెలను కలిపి చికిత్స చేస్తే.. శరీరంపై పడే అతివేడి ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. అరగదీసిన గంధం, బాదం పొడి, మల్లె పువ్వుల గుజ్జు, కలబంద గుజ్జు చెంచా చొప్పున తీసుకోవాలి. అన్నింటినీ కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై నలుపు తగ్గి క్రమంగా ప్రకాశవంతంగా మారుతుంది. ఎండలో వెళ్లినా కూడా చర్మం అంత త్వరగా నల్లగా మారదు. జిడ్డు, మొటిమల సమస్య ఉన్నప్పుడు.. చెంచా అరగదీసిన గంధం, తులసి పొడి పావు చెంచా, తేనె, మల్లెపువ్వు గుజ్జు చెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ బాగా కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి ఈ పూత చక్కగా పనిచేస్తుంది. వేసవిలో గనుక ఈ పూతను తరచూ వేసుకుంటే.. చర్మం చాలా తేటగా కనిపిస్తుంది. ఎండలో తిరిగినప్పుడు చర్మం కమిలినట్లు అవుతుంది. మంట, దురద, చెమట పొక్కులు బాధిస్తార. అలాంటివారు... రెండు చెంచాల గంధంపొడి, పుదీనా రసం, ముల్తానీమట్టి, కలబంద గుజ్జు చెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని పది నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ రెండుసార్లు చేస్తే ఎంతో మార్పు ఉంటుంది. చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

చందనం సున్నిపిండి... ఈ కాలంలో సున్నిపిండి వాడితే చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది. అయితే దీన్ని ప్రత్యేకంగా తయారు చేసుకోవాలి. పెసలు, సెనగలు, బియ్యం పావుకేజీ చొప్పున, యాభై గ్రాముల పసుపు కొమ్ములు, వంద గ్రాములు ఎండబెట్టిన కమలాఫలం చెక్కులు తీసుకుని అన్నింటినీ పిండి పట్టించాలి. ఆరు చెంచాల సున్నిపిండికి చెంచా మంచి గంధం పొడి కలపాలి. వాడుకునేటప్పుడు సగం నిమ్మచెక్క రసం కూడా కలిపి శరీరానికి రుద్దుకోవాలి. చర్మం తాజాదనంతో మెరుస్తుంది. మృదువుగానూ ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం నల్లబడి, ఎర్రగా కందిపోయి.. మంటగా అనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. అది ఇతర సమస్యలకు కారణం కావచ్చు. అలాంటప్పుడు ఈ చికిత్స ప్రయత్నిస్తే.. కాంతులీనే చర్మం మీ సొంతమవుతుంది.

  • మల్లె, కలబంద సుగుణాలున్న మిశ్రమంతో చర్మాన్ని శుభ్రపరచాలి
  • మంచిగంధం జాస్మిన్‌ గ్రాన్యువల్స్‌తో చేసిన నలుగుతో ఐదునిమిషాలు మర్దన
  • మంచిగంధం, తామర క్రీంతో ఏడెనిమిది నిమిషాలు మర్దన
  • మల్లెల గుజ్జు, గులాబీ జెల్‌ రాసి పదినిమిషాలు ఉంచాలి.
  • తరువాత జాస్మిన్‌ సిరమ్‌ వేసి ఏడు నిమిషాలు డెర్మోసోనక్‌ చికిత్స
  • జాస్మిన్‌, క్రిస్టల్‌ పూత వేసి ఇరవై నిమిషాల తరువాత తొలగించాలి.

చందనం పొడి, పసుపు సమపాళ్లలో కలిపి నీళ్లతో మెత్తని పేస్టులా చేసి ముఖంపై మొటిమలున్న చోట రాసుకోవాలి. చందనం చల్లదనాన్ని ఇస్తే, పసుపు యాంటీ బయోటిక్‌లా పనిచేస్తుంది. ఇందులో చిటికెడు కర్పూరం కలిపినా మంచిదే. దీనిని రాత్రి పడుకోబోయే ముందు రాసుకుని, ఉదయం లేచాక శుభ్రం చేసుకుంటే సరి. మొటిమలు మరీ బాధిస్తే చందనానికి రోజ్‌వాటర్‌ కలిపి రాసుకుంటే తగ్గుతాయి. టాన్‌కి విరుగుడు: నాలుగు టీ స్పూన్ల చందనం పొడికి, రెండు టీ స్పూన్ల కొబ్బరినూనె, రెండు స్పూన్ల బాదం నూనె కలిపి ముఖానికీ మెడకీ చేతులకీ రాసుకుని పావుగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మం నునుపు కోసం: ఒక స్పూను బాదం పొడి, ఒక స్పూను గంధం పొడి, పాలు కలిపి ముఖానికీ మెడకీ రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తే, చర్మం రంగు తేలుతుంది. ఎర్ర చందనం పొడిని రాసుకుంటే ముఖం మీద చారలూ, గీతలూ ఉంటే పోతాయి. మార్కెట్లో దొరికే గంధం నూనెతో ముఖాన్ని మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.

మూలాలు మార్చు

  1. Asian Regional Workshop (1998). Santalum album. 2006. IUCN Red List of Threatened Species. IUCN 2006. www.iucnredlist.org. Retrieved on 2007-02-08.

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీగంధం&oldid=3337051" నుండి వెలికితీశారు