గగనపహాడ్,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని గ్రామం.[1]ఇది శంషాబాద్ మండలానికి 8 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధికి చెందిన ప్రాంతం.పిన్ కోడ్ 500077, తపాలా ప్రధాన కార్యాలయం కటేధాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది.తెలుగు ఇక్కడ స్థానిక భాష.ఉర్ధూ,హిందీ భాషలు మాట్లాడతారు.

సమీప ప్రాంతాలుసవరించు

మాణిక్య కాలనీ, పద్మశాలిపురం, తెలంగాణ ఎన్.జి.ఓ.స్. కాలనీ, ఫేజ్ -2 గగన్ పహాడ్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాలు.

సమీప నగరాలుసవరించు

హైదరాబాదు, ఫరూఖ్ నగర్, సింగాపూర్, సంగారెడ్డి

రాజకీయాలుసవరించు

ఈ ప్రాంతంలో టిడిపి, టిఆర్ఎస్, ఐఎన్‌సి ప్రధాన రాజకీయ పార్టీలు.

విశేషాలుసవరించు

గగన్‌పహాడ్‌కు చెందిన వెంకటయ్య జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికయ్యాడు. రాష్ట్ర పురపాలక, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ రూ.1,11,116 చెక్కును అందజేశాడు.జాతీయ స్థాయిలో అవార్డు అందుకొనుటకు తాను విమానంలో ప్రయాణిస్తానని కలలో కూడా అనుకోలేదని వెంకటయ్య అన్నాడు.[2]

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నగరంలో ఓవర్ నైట్ సెలబ్రిటీ వెంకటయ్య". Sakshi. 2016-08-05. Retrieved 2020-06-28.

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=గగన్‌పహడ్&oldid=2972167" నుండి వెలికితీశారు