సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలానికి చెందిన పట్టణం.ఇది మంజీరా నది ఒడ్డున ఉంది.[2] అందమైన మంజీరా నది, సింగూరు డ్యాం జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని.సింగూరు జలాశయం హైదరాబాదు నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ రాణి. ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ, హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 65కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది. ఇక్కడ సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ఉంది.

Sangareddy
Sangareddipet
Collectorate building of Sangareddy
Collectorate building of Sangareddy
Sangareddy is located in Telangana
Sangareddy
Sangareddy
Location in Telangana, India
Sangareddy is located in India
Sangareddy
Sangareddy
Sangareddy (India)
Coordinates: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917
Country India
StateTelangana
DistrictSangareddy
MetroHyderabad Metropolitan Region
CityHyderabad
Municipal Established1954
(70 సంవత్సరాల క్రితం)
 (1954)
Named forSanga
Government
 • TypeMunicipal Council
 • BodySangareddy Municipal Corporation
 • MLAJagga Reddy
విస్తీర్ణం
 • City13.70 కి.మీ2 (5.29 చ. మై)
Elevation
496 మీ (1,627 అ.)
జనాభా
 (2011)[1]
 • City72,344
 • Rank21st in Telangana
 • జనసాంద్రత5,300/కి.మీ2 (14,000/చ. మై.)
 • Metro
3,25,000
Languages
 • OfficialTelugu, Urdu
Time zoneUTC+05:30 (IST)
PIN
502 001
Telephone codecode-08455
Vehicle registrationTS 15

ఇక్కడకి దగ్గరలో వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వరాలయం, శ్రీ రామ మందిరం, గణపతి దేవాలయం, సాయిబాబా దేవాలయం ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ వేడుకలు అత్యంత శోభయమానంగా జరుగుతాయి ముఖ్యంగా వైకుంఠఏకాదశి.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

రవాణా సదుపాయాలు

మార్చు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు.దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.

సంగారెడ్డి పట్టణం నుండి హైదరాబాద్, జహీరాబాద్, సిద్దిపేట, పటాన్‌చెరు

, నర్సాపూర్, మెదక్, గజ్వేల్, శంకర్‌పల్లి, సదాశివపేట, నారాయణఖేడ్, తాండూరు, వికారాబాద్, పిట్లం, శంకరంపేట, బాన్సువా హన్మకొండడ ఒంగోలు, గుంటూరు,,,, కర్ణాటకలోని బీదర్, హుమ్నాబాద్, భాల్కి, గుల్బర్గా, బసవకళ్యాణ్,, మహారాష్ట్రలోని ముంబై, షోలాపూర్, డెగ్లూర్, ఉద్గీర్, నాందేడ్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ ద్వారా బస్సులు నడుస్తున్నాయి.

ప్రముఖులు

మార్చు

అభివృద్ధి పనులు

మార్చు

సంగారెడ్డి ప‌ట్ట‌ణ కేంద్రంలో 15 కోట్ల‌ రూపాయలతో నిర్మించిన రెండు వాట‌ర్ ట్యాంక్‌ల‌ను, సంగారెడ్డి మున్సిప‌ల్ కాంప్లెక్స్‌ను, చింత‌ల‌ప‌ల్లిలో బ‌స్తీ ద‌వఖానాను, సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్ యూనిట్ ను 2022 జూలై 19న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హ‌రీశ్‌రావు ప్రారంభించాడు. బీసీ బాలిక‌ల కాలేజీ హాస్ట‌ల్ భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేశాడు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక ప్రజాప్రతినిథులు, అధికారులు పాల్గొన్నారు.[5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 June 2016. Retrieved 28 June 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-08-16.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (5 June 2015). "ఐదు పీజీలు చేస్తానంటున్న టెలీస్టార్..." www.andhrajyothy.com. Archived from the original on 10 July 2020. Retrieved 10 July 2020.
  5. telugu, NT News (2022-07-19). "సంగారెడ్డి ప‌ట్ట‌ణంలో రూ. 50 కోట్ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న : మంత్రి హ‌రీశ్‌రావు". Namasthe Telangana. Archived from the original on 2022-07-19. Retrieved 2022-07-19.

వెలుపలి లంకెలు

మార్చు