గగన్ నారంగ్ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. 1983, మే 6న చెన్నైలో జన్మించిన గగన్ నారంగ్ (Gagan Narang) 2006 కామన్వెల్త్ క్రీడలలో 4 బంగారు పతకాలను సాధించాడు. అందులో రెండు వ్యక్తిగత పతకాలు కాగా మరో రెండు పెయిర్స్‌లో అభినవ్ బింద్రాతో కలసి సాధించాడు. 2008 ఒలింపిక్ క్రీడలలో కూడా 3 ఈవెంట్లలో పాల్గొన్ననూ పతకం దక్కలేదు.అయితే 2012లో లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకుని చరిత్ర లిఖించాడు.

2010 లో ఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన గగన్ నారంగ్

క్రీడా జీవితం

మార్చు

2003లో హైదరాబాదులో జరిగిన ఆఫ్రో-ఏషియన్ క్రీడలలో పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గగన్ నారంగ్ స్వర్ణపతకం సాధించాడు.[1] 2006లో జరిగిన ప్రపంచ కప్ షూటింగ్ క్రీడలలో ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారుపతకం సాధించాడు. 2008లో జరిగిన ప్రపంచ కప్‌లో రజతపతకంతో సరిపెట్టుకున్నాడు. 2006 కామన్వెత్ క్రీడలలో 4 స్వర్ణపతకాలను సాధించాడు. అందులో రెండు వ్యక్తిగత విభాగంలోనివి (10మీటర్ల ఎయిర్ రైఫిల్, 50 మీటర్ల ఎయిర్ రైఫిల్) కాగా మరో రెండు పతకాలను అభినవ్ బింద్రాతో కలిసి పెయిర్స్‌లో (10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పెయుర్స్, 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ పెయిర్స్ 3వ పొజీషన్) విజయం సాధించాడు. ఒలింపిక్ క్రీడలు జరుగడానికి ముందు జర్మనీలోని హనోవర్‌లో జరిగిన పోటీలో 704.3 పాయింట్లతో ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ రికార్డును మెరుగుపర్చాడు. 2012లో లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుచుకుని అభినవ్ బింద్రా తరువాత భారత్ తరపున ఒలింపిక్ పతకాన్ని సాధించిన రెండవ షూటింగ్ క్రీడాకారుడిగా నిలిచాడు.

మూలాలు

మార్చు
  1. "Gagan Narang wins India's first gold". October 26, 2003. a rediff.com article about Afro-Asian Games